శిరీషపై గతంలోనూ దాడి? | sirisha suspicious death; old photos revealed | Sakshi
Sakshi News home page

శిరీషపై గతంలోనూ దాడి?

Published Thu, Jun 15 2017 5:51 PM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM

శిరీషపై గతంలోనూ దాడి? - Sakshi

శిరీషపై గతంలోనూ దాడి?

హైదరాబాద్‌: బ్యుటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతుండగానే ఆమెకు సంబంధించిన మరింత సమాచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మృతురాలు శిరీషకు.. ఆమె పనిచేసే స్టుడియో యజమాని రాజీవ్‌కు మధ్య విభేదాలున్నట్లు, వాటిని పరిష్కరించుకునేందుకే కుకుమానూర్‌ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి వెళ్లినట్లు పోలీసులు ఇదివరకే ప్రకటించారు. కాగా, గతంలో శిరీషపై రాజీవ్‌ పలుమార్లు భౌతిక, లైంగికదాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాజీవ్‌ కొట్టిన దెబ్బల ధాటికి ముఖం కమిలిపోయిన శిరీష ఫొటో ఒకటి గడిచిన కొద్ది గంటలుగా సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘ఈ దెబ్బలేంటన’ని ఇంట్లో వాళ్లు ప్రశ్నించగా, యాక్సిడెంట్‌ అయిందని శిరీష చెప్పినట్లు తెలిసింది. 

సోషల్‌ మీడియాలో ప్రచారమవుతోన్న కథనం ప్రకారం.. తన దగ్గర ఉద్యోగం చేస్తోన్న శిరీషను రాజీవ్‌ పలుమార్లు వేధించేవాడని, ఆమెపై భౌతిక, లైంగిక దాడికి పాల్పడేవాడని, ఈ విషయాలన్నీ ఎవరికైనా చెబితే శిరీష కూతుర్ని చంపేస్తానని బెదిరించేవాడని తెలుస్తోంది. పెళ్లిళ్లలో ఫొటోషూట్లు చేసే సమయంలోనూ రాజీవ్‌ అమ్మాయిల పట్ల అదోరకమైన ధోరణితో వ్యవహరించేవాడని సమాచారం. అయితే ఇదంతా నిజమో కాదో పోలీసు దర్యాప్తులో తేలనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement