Old photo
-
టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా?
టైమ్ ట్రావెల్ అనేది ఒక విచిత్ర భావన. దీని గురించి చర్చలు కూడా జరుగుతుంటాయి. టైమ్ ట్రావెల్ అనేది వాస్తవికతకు దూరంగా ఉంటుంది. సినిమాల్లో టైం ట్రావెల్‌ని చూసిన ప్రేక్షకులు ఎంతగానో ఆశ్చర్యపోతుంటారు. టైమ్ ట్రావెల్ గురించి తెలుసుకుంటే అలా ట్రావెల్ చేసి, తమ గతం చూసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. నిజానికి టైమ్ ట్రావెల్ అనేది ఇంకా సాధ్యం కాలేదు. అయితే టైమ్ ట్రావెల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటప్పుడు టైమ్ ట్రావెల్ నిజమని అనిపిస్తుంటుంది. ఇటీవల విదేశీ మీడియాలో ఇలాంటి ఒక ఫొటో వైరల్‌గా మారి, తెగ చర్చలకు దారితీసింది. ఇది టైమ్ ట్రావెల్‌ను రుజువు చేసే ఫొటో అని చెబుతున్నారు. డైలీ స్టార్ న్యూస్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం 2016వ సంవత్సరంలో ఐస్లాండ్ దేశానికి సంబంధించిన ఫేస్బుక్ గ్రూప్‌లో ఒక ఫోటో షేర్ అయ్యింది. ఈ ఫోటోపై ఈ నాటికీ చర్చలు జరుగుతున్నాయి. అందులో కనిపిస్తున్నది టైమ్ ట్రావెలర్ అయి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ వాదన వెనుక ఒక ఆధారం కూడా ఉందని చెబుతున్నారు. టైమ్ ట్రావెల్ చేస్తున్న వ్యక్తిని పరిశీలించినప్పుడు.. అతను మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తాడు. అయితే ఈ ఫోటో 1943లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఐస్లాండ్లోని రెక్జావిక్‌లో తీసినదని నివేదికలో పేర్కొన్నారు. అ ఫొటోలో జనం రద్దీ కనిపిస్తుంది. సైనికులు అటూఇటూ తిరుగుతూ కనిపిస్తారు. అయితే ఒక వ్యక్తి ఓ షాపు దగ్గర ఫోన్లో మాట్లాడుతున్నట్టు కనిపిస్తాడు. అతడే టైమ్ ట్రావెల్ చేసిన వ్యక్తి అని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకుంటే ఆ సమయంలో ఫోన్లు అందుబాటులో లేవు. ఈ ఫొటోలో అమెరికన్ సైనికులు రోడ్డు మీద వెళుతుండగా వారి ముఖాల్లో కొంచెం ఆందోళన కనిపిస్తోంది. అయితే ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి ముఖంలో అలాంటి ఆందోళన కనిపించడం లేదు. కాగా రోడ్డుపై నడుస్తున్నవారు చలిని తట్టుకునేందుకు ట్రెంచ్ కోట్లు ధరించి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ఫొటో షేర్ చేసిన ఫేస్బుక్ బృందం ఇది 1943లో తీసిన ఫొటోగా పేర్కొంది. ఇది కూడా చదవండి: 21 కి.మీ. పరిగెత్తితే 11 కిలోలు తగ్గుతారా?.. దీనిలో నిజమెంత? -
గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ బ్యూటీ.. షాకింగ్ లుక్ వైరల్
మృణాల్ ఠాకుర్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సీతారామం మూవీతో రాత్రికిరాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో యువరాణిగా తన అందం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన నటనతో దర్శక-నిర్మాతల దృష్టిని ఆకట్టుకున్న ఈ భామకు ఇప్పుడు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఆమె వైజయంతి బ్యానర్లో ఓ సినిమాకు సంతకం చేసిందని, మరిన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మృణాల్‌కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: ‘సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, ఆ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నా’ ఇందులో ఆమె లుక్ చూసి అంతా షాకవుతున్నారు. సీతారామంలో యువరాణిలా కుర్రకారు మనసులను దొచుకున్న ఆమె ఈ ఫొటోలో నల్లగా.. డిగ్లామర్ లుక్‌లో కనిపించింది. ఆమె ముఖం, చేతులు కమిలినట్లుగా కనిపించాయి. అంతేకాదు ఈ ఫొటోలో ఆమె బ్యాగ్రౌండ్ చూస్తుంటే హాస్పిటల్లో దిగినట్లు కనిపిస్తోంది. దీంతో ఆమెకు ఏమైంది? ఎందుకు ఇలా మారిపోయింది? అంటూ ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫొటో ఎప్పటిదని కూడా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇది ప్రస్తుత ఫొటో కాదని, ఓల్డ్ పిక్ అని తెలుస్తోంది. మృణాల్ సినిమాల్లో కంటే ముందు పలు టీవీ సీరియల్స్‌లో నటించిన సంగతి తెలిసిందే. చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే.. గతంలో తను నటించిన ఓ సీరియల్లోని లుక్ అయ్యింటందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ ఫొటో ఎప్పటిది అనేది మాత్రం స్పష్టత లేదు. మొత్తానికి సీతారామం చిత్రంలో చీరకట్టులో తనదైన గ్లామర్‌తో ఎంతో మంది మనసు దోచుకున్న మృణాల్ ఈ ఫొటోలో పూర్తిగా డిగ్లామర్తో కనిపించి షాకిచ్చింది. కాగా మృణాల్ ఠాకూర్ ‘కుంకుమ భాగ్య’ అనే హిందీ సిరియల్‌తో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌కి చెల్లిగా ఆమె నటించింది. ఈ సీరియల్‌కు తెలుగులో సైతం మంచి ఆదరణ దక్కింది. ఈ క్రమంలో ‘సూపర్ 30’, జర్సీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్గా మారింది మృణాల్. తాజాగా ‘సీతారామం’ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. -
ఈ బిజినెస్‌మేన్‌ని గుర్తుపట్టారా?
ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి యాక్టర్ కావాలని బిజినెస్‌మేన్ అయ్యారు. టీనేజీలో ఉన్నప్పుడు బాలీవుడ్ సినిమాలంటే చెవి కోసుకునేవారు. నచ్చిన సినిమాలో సీన్లను తలపించేలా రియల్ లైఫ్‌లో ఎడ్వెంచర్లు చేశారు. అక్కడితో ఆగిపోలేదు. సినిమా కెరీర్ లక్ష్యంగా హర్వర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అక్కడే బిల్‌గేట్స్‌తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. ఇంకేముంది యాక్టర్ కావాల్సిన వ్యక్తి మళ్లీ బిజినెస్ రూట్లోకి వచ్చారు. వ్యాపారంలో అనేక రికార్డులు సృష్టించారు. Remembering the best weekends of my youth. In ‘72 -I was 17-a friend & I used to often hitchhike from ‘Bombay’ to ‘Poona’ taking rides on trucks. That’s probably when I developed my love for the open road..The movie ‘Parichay’ had come out & we would sing “Musafir hoon Yaaron’😊 pic.twitter.com/VuTvMTyivd — anand mahindra (@anandmahindra) November 13, 2021 సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. జీన్స్ టీషర్ట్‌లో ఉన్న ఆ వ్యక్తి ట్రక్‌లో కూర్చుని ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతనెవరా ? అని మనం ఆలోచించేలోగా.. ఆయనే అన్ని వివరాలు చెప్పారు. 1972లో ఆనంద్ మహీంద్రా 17 ఏళ్ల టీనేజీ కుర్రాడిగా ఉన్నప్పుడు అప్పుడే బాలీవుడ్లో దుమ్మరేపిన పరిచయ్ సినిమా చూశారు. అంతే ఆ సినిమాలో ముసాఫిర్ హుం యారో అని పాట పాడుతూ తన స్నేహితుడితో కలిసి బాంబే నుంచి పూనాకి ట్రక్కులో ప్రయాణం చేశారు. ఆ సందర్భంగా తీసుకున్న తన ఫోటోను ఆనంద్మహీంద్రా ట్వీట్టర్లో పంచుకున్నారు. -
ఈ ఫోటోలో ఉన్న స్టార్ కిడ్స్‌ని గుర్తుపట్టారా?
ముంబై : రంగుల హోలీ వస్తుందంటే.. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఎంతో ఉత్సాహంగా హోలీ పండుగును జరుపుకుంటారు. కరోనా కారణంగా ఆంక్షల మధ్య ఈసారి హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. పలువురు సినీ స్టార్స్ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఎంతో ఉల్లాసంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ స్టార్ హీరోయిన్ తన స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేసుకుంది. కింగ్ ఖాన్ షారుక్ కూతురు సుహానా ఖాన్, కపూర్ ఫ్యామిలీకి చెందిన షనయా కపూర్‌తో కలిసి హోలీ వేడుకలను జరుపుకున్న చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే. తన బెస్ట్ ఫ్రెండ్స్‌తో అనన్య దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో మధ్యలో ఉన్నదినటి అనన్య పాండే కాగా, ఆమె కుడివైపు షనయా కపూర్ ఉండగా, ఎడమ వైపు ఉన్నది సుహానా ఖాన్. వీరిద్దరితో బెస్ట్ హోలీ మొమరీస్ ఉన్నాయని గుర్తు చేసుకుంది అనన్య. ఈ సందర్భంగా అందరూ సురక్షితంగా హోలీ జరుపుకోవాలని కోరింది. View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) చదవండి : హోలీ సెలబ్రేషన్స్‌లో మన స్టార్స్.. ఫోటోలు వైరల్ సోషల్ హల్చల్: మేనుకు రంగులద్దుకున్న భామలు -
ఆర్టికల్ 370 రద్దు.. మోదీ అరుదైన ఫొటో!
న్యూఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మొదటి కేంద్ర ప్రభుత్వంగా నరేంద్రమోదీ సర్కారు చరిత్రలో నిలిచిపోనుంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమిత్ షా ప్రకటన వెలువడిన వెంటనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ట్విటర్లో ప్రధాని నరేంద్రమోదీకి సంబంధించిన ఆసక్తికరమైన ఫొటోను పోస్టు చేశారు. ఎప్పటిదో తెలియని ఈ పాత ఫొటోలో యవ్వనంలోని నరేంద్రమోదీ ఓ కార్యక్రమంలో కూర్చొని ఉన్నారు. ఆర్టికల్ 370ను రద్దు చేయాలి.. ఉగ్రవాదాన్ని అంతమొందించాలని ఆయన వెనుక ఉన్న బ్యానర్లో రాసి ఉంది. ఈ ఫొటోను పోస్టు చేసి.. ‘హామీ నెరవేరింది’ అని రాం మాధవ్ కామెంట్ చేశారు. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా యవ్వనంలో ఉన్నప్పుడు నరేంద్రమోదీ ఆందోళన నిర్వహించినప్పటి ఫొటో ఇది అయి ఉంటుందని, నేడు ఆర్టికల్ 370 రద్దు అయిన నేపథ్యంలో ఈ అరుదైన ఫొటోను ఆయన షేర్ చేసి ఉంటారని భావిస్తున్నారు. Promise fulfilled pic.twitter.com/iiHQtFxopd — Ram Madhav (@rammadhavbjp) August 5, 2019 -
సిక్కులను చంపించింది.. ఫోటో దిగుతారా?
సాక్షి, సినిమా : ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా నటి ప్రియాంక చోప్రా పోస్ట్ చేసిన ఓ ఫోటో వివాదాస్పదంగా మారింది. తన కటుంబ సభ్యులు ఇందిరతో దిగిన ఓ ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతే కొందరు అసభ్యపదజాలంతో ప్రియాంకను తిడుతూ కామెంట్లు పెట్టారు. అక్టోబర్ 31న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా మూడు దశాబ్దాల క్రితం ఫోటో అంటూ షేర్ చేయగా.. ఫోటోలో ప్రియాంక తల్లి, పిన్ని, తాత ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే చాలా లైకులు, కామెంట్లు చాలా వచ్చాయి. అయితే ఆ కామెంట్లలో చాలా మట్టుకు బండ బూతులు ఉండటం విశేషం. ఇందిరా గాంధీ సిక్కులను ఊచకోత కోయించిందని.. అలాంటి వ్యక్తితో ఫోటో దిగటానికి మీ కుటుంబానికి సిగ్గు లేదా? అని కొందరు.. యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మీరూ ఇలా నేతల ఫోటోలు షేర్ చెయ్యకండని కొందరు కామెంట్లు చేశారు. అయితే ఆ కామెంట్లను ప్రియాంక పట్టించుకోలేదు. ఇక వివాదాలు ప్రియాంకకు కొత్తేం కాదు. గతంలో మోదీ ముందు కాలు మీద కాలేసుకుని కూర్చోవటం, జాతీయ జెండాను చున్నీలా చుట్టుకోవటం, అస్సాంపై అనుచిత వ్యాఖ్యలు... తదితర వివాదాల్లో ఆమె చిక్కుకున్న విషయం తెలిసిందే. An amazing old photo my masi(aunt) @neelaakhouri sent over with her,my mother @madhumalati ,my late grand parents Madhu Jyotsna and Manhar krishna Akhouri with the late former PM of India Indira Gandhi. #just #Roots #history #family ❤️🙏🏼 A post shared by Priyanka Chopra (@priyankachopra) on Oct 30, 2017 at 6:55pm PDT -
శిరీషపై గతంలోనూ దాడి?
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతుండగానే ఆమెకు సంబంధించిన మరింత సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతురాలు శిరీషకు.. ఆమె పనిచేసే స్టుడియో యజమాని రాజీవ్‌కు మధ్య విభేదాలున్నట్లు, వాటిని పరిష్కరించుకునేందుకే కుకుమానూర్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి వెళ్లినట్లు పోలీసులు ఇదివరకే ప్రకటించారు. కాగా, గతంలో శిరీషపై రాజీవ్ పలుమార్లు భౌతిక, లైంగికదాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాజీవ్ కొట్టిన దెబ్బల ధాటికి ముఖం కమిలిపోయిన శిరీష ఫొటో ఒకటి గడిచిన కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘ఈ దెబ్బలేంటన’ని ఇంట్లో వాళ్లు ప్రశ్నించగా, యాక్సిడెంట్ అయిందని శిరీష చెప్పినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతోన్న కథనం ప్రకారం.. తన దగ్గర ఉద్యోగం చేస్తోన్న శిరీషను రాజీవ్ పలుమార్లు వేధించేవాడని, ఆమెపై భౌతిక, లైంగిక దాడికి పాల్పడేవాడని, ఈ విషయాలన్నీ ఎవరికైనా చెబితే శిరీష కూతుర్ని చంపేస్తానని బెదిరించేవాడని తెలుస్తోంది. పెళ్లిళ్లలో ఫొటోషూట్లు చేసే సమయంలోనూ రాజీవ్ అమ్మాయిల పట్ల అదోరకమైన ధోరణితో వ్యవహరించేవాడని సమాచారం. అయితే ఇదంతా నిజమో కాదో పోలీసు దర్యాప్తులో తేలనుంది. శిరీష పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలనాలు -
కిక్కిరిసిన 'ఢిల్లీ మెట్రో'పై పేరడీల జోరు!
న్యూఢిల్లీ: 2016లో అది మొదటి సోమవారం. అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' అంకెల విధానానికి విషమ పరీక్ష ఎదురైంది కూడా సోమవారం నాడే. మూడు రోజుల వారాంతపు సెలవుల అనంతరం ఢిల్లీ వాహనదారులు సోమవారమే రోడెక్కారు. 'సరి-బేసి' విధానం కారణంగా చాలామంది తమ కార్లను ఇంట్లోనే వదిలేసి.. ప్రజారవాణా వ్యవస్థపై ఆధారపడ్డారు. దీంతో ఢిల్లీలోని మెట్రో స్టేషన్లన్నీ కిక్కిరిపోయాయి. సాధారణంగానే రద్దీగా ఉండే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ మరింత కిటకిటలాడింది. ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతోపాటు విపరీతమైన జనంతో కిక్కిరిసిపోయిన మెట్రో స్టేషన్ ఫొటో ఒకటి ట్విట్టర్, ఫేస్బుక్ లో దుమ్మురేపింది. కాసేపటిలోనే విపరీతంగా షేర్ అయి వైరల్ గా మారింది. అయితే ఆ ఫొటో పాతదని, గత ఏడాది అక్టోబర్ 22న తీసిన ఈ ఫొటోకు 'సరి-బేసి' విధానానికి ఎలాంటి సంబంధం లేదని హిందూస్థాన్ టైమ్స్ తన ట్విట్టర్ పేజీలో వెల్లడించడంతో.. ఈ ఫేక్ వైరల్ పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. పాత ఫొటోను వైరల్ చేయడాన్ని తప్పుబడుతూ పేరడీ ఫొటోలతో హోరెత్తించారు. ఢిల్లీలోని రాజీవ్ చౌక్ లో రద్దీ ఎక్కువగా ఉందన్న వార్తలను ఎద్దేవా చేస్తూ పలు ఫొటోలు షేర్ చేశారు. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో రైలు కోసం వేచివేచి ఇలా గడ్డాలు, మీసాలు పెరిగిపోయాయి Huge Crowd at Rajiv Chowk Metro Station. People's hair and beard grown long while waiting to board train pic.twitter.com/xKSIbZllRp — Joy (@Joydas) January 4, 2016 మెట్రోరైలు లేక రాజీవ్ చౌక్ వద్ద ప్రజలు ఇలా బస్సులో కిక్కిరిసిపోయారు! రాజీవ్ చౌక్ వద్ద రద్దీ లేదట.. ప్రజలు ఇలా ఆనందంగా ప్రయాణిస్తున్నారట రాజీవ్ చౌక్ నుంచి ఇప్పుడే బయటకు వస్తున్న కేజ్రీవాల్! రాజీవ్ చౌక్ వద్ద మెట్రో రైలును ఎక్కేందుకు వెళ్తున్నారు..