Sita Ramam Actress Mrunal Thakur Old Picture Goes Viral - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ హీరోయిన్‌, ఆమెకు ఏమైంది?

Published Sat, Sep 17 2022 4:28 PM | Last Updated on Sat, Sep 17 2022 6:36 PM

Sita Ramam Actress Mrunal Thakur Old Picture Goes Viral - Sakshi

మృణాల్‌ ఠాకుర్‌.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సీతారామం మూవీతో రాత్రికిరాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. ఈ చిత్రంలో యువరాణిగా తన అందం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన నటనతో దర్శక-నిర్మాతల దృష్టిని ఆకట్టుకున్న ఈ భామకు ఇప్పుడు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఆమె వైజయంతి బ్యానర్లో ఓ సినిమాకు సంతకం చేసిందని, మరిన్ని ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మృణాల్‌కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

చదవండి: ‘సోషల్‌ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు, ఆ స్క్రీన్‌ షాట్స్‌ తీసి పెట్టుకున్నా’

ఇందులో ఆమె లుక్‌ చూసి అంతా షాకవుతున్నారు. సీతారామంలో యువరాణిలా కుర్రకారు మనసులను దొచుకున్న ఆమె ఈ ఫొటోలో నల్లగా.. డిగ్లామర్‌ లుక్‌లో కనిపించింది. ఆమె ముఖం, చేతులు కమిలినట్లుగా కనిపించాయి. అంతేకాదు ఈ ఫొటోలో ఆమె బ్యాగ్రౌండ్‌ చూస్తుంటే హాస్పిటల్లో దిగినట్లు కనిపిస్తోంది. దీంతో ఆమెకు ఏమైంది? ఎందుకు ఇలా మారిపోయింది? అంటూ ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫొటో ఎప్పటిదని కూడా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇది ప్రస్తుత ఫొటో కాదని, ఓల్డ్‌ పిక్‌ అని తెలుస్తోంది.  మృణాల్‌ సినిమాల్లో కంటే ముందు పలు టీవీ సీరియల్స్‌లో నటించిన సంగతి తెలిసిందే.

చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే..

గతంలో తను నటించిన ఓ సీరియల్లోని లుక్‌ అయ్యింటందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ ఫొటో ఎప్పటిది అనేది మాత్రం స్పష్టత లేదు. మొత్తానికి  సీతారామం చిత్రంలో చీరకట్టులో తనదైన గ్లామర్‌తో ఎంతో మంది మనసు దోచుకున్న మృణాల్‌ ఈ ఫొటోలో పూర్తిగా డిగ్లామర్‌తో కనిపించి షాకిచ్చింది. కాగా మృణాల్‌ ఠాకూర్‌ ‘కుంకుమ భాగ్య’ అనే హిందీ సిరియల్‌తో పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌కి చెల్లిగా ఆమె నటించింది. ఈ సీరియల్‌కు తెలుగులో సైతం మంచి ఆదరణ దక్కింది. ఈ క్రమంలో ‘సూపర్‌ 30’, జర్సీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్‌గా మారింది మృణాల్‌. తాజాగా ‘సీతారామం’ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement