
విస్తీర్ణంలో చిన్నవి వసతుల్లో పెద్దవి!
- చిన్న ప్రాజెక్టుల్లో పెరుగుతున్న గిరాకీ
- ఆధునిక వసతులు, గ్రీనరీ ఉండాలంటున్న కొనుగోలుదారులు
- చిన్న ప్రాజెక్టుల వైపే రియల్టర్ల చూపు
- ప్రతికూల పరిస్థితుల్లో ఇవే మేలంటున్న నిపుణులు
- ఉప్పల్ బస్‌డిపో దగ్గర రెండున్నర ఎకరాల్లో ఏవీ కన్‌స్ట్రక్షన్ ‘ఏవీ ఇన్ఫో ప్రైడ్’ను నిర్మిస్తోంది. మొత్తం 210 ఫ్లాట్లు. చ.అ. ధర రూ. 2,450.
- ఇదే సంస్థ ఉప్పల్ బస్ డిపో దగ్గరే 2,800 చ. గజాల్లో ‘హరేరాం రెసిడెన్సీ’ పేరుతో 60 ఫ్లాట్లను నిర్మిస్తోంది. చ.అ. ధర రూ. 2,300. ఇదే ప్రాంతంలో 833 చ. గజాల్లో ‘రాచూరి అరణ్య’ పేరుతో 20 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. చ.అ. ధర రూ. 2,300.
- ఇదే సంస్థ ఉప్పల్‌లో 900 చ. గజాల్లో ‘మేఘన రెసిడెన్సీ’ పేరుతో 20 ఫ్లాట్లను నిర్మిస్తోంది. చ.అ. ధర రూ. 2,600.
- ఇదే సంస్థ నాగోల్‌లో 500 చ. గజాల్లో ‘రాయల్ రెసిడెన్సీ’ పేరుతో 8 ఫ్లాట్లను నిర్మిస్తోంది. చ.అ. ధర రూ. 2,800.
- శంకర్‌నగర్‌లో వినాయక బిల్డర్స్ ప్రమోటర్స్ 2,400 చ. గజాల్లో ‘సాయిసత్య నిలయం’ను నిర్మిస్తోంది. మొత్తం 5 అంతస్తుల్లో 50 ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ. 2,300.
- బంజారాహిల్స్ రోడ్ నం:10లో హెచ్‌ఎస్‌ఆర్ డెవలపర్స్ 1,200 చ. గజాల్లో ‘తులీప్’ ప్రాజెక్ట్‌లో 10 ఫ్లాట్లను నిర్మిస్తోంది. చ.అ. ధర రూ. 4 వేలు.
- ఇదే సంస్థ చిక్కడపల్లిలో 400 చ. గజాల్లో ‘ఎంకే రెసిడెన్సీ’ పేరుతో 6 ఫ్లాట్లను నిర్మిస్తోంది. చ.అ. ధర రూ. 5,200.
- ఇదే సంస్థ ఎల్బీనగర్‌లో 6,700 చ. గజాల్లో ‘హెచ్‌ఎస్‌ఆర్ అమృతా ఆకాశ్’ను నిర్మిస్తోంది. మొత్తం 140 ఫ్లాట్లుంటాయి. కేవలం 8 ఫ్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. చ.అ. ధర రూ. 2,800-3,000.
- ఉప్పల్‌లోని రాఘవేంద్రనగర్‌లో రాక్స్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ 850 చ. గజాల్లో ‘సాయి బృందావన్’ను నిర్మిస్తోంది. మొత్తం 35 ఫ్లాట్లు. చ.అ. ధర రూ. 2,900.
- బంజారాహిల్స్ రోడ్ నం:5లో లోటస్ ప్రాపర్టీస్ ప్రై.లి. ఎకరం విస్తీర్ణంలో ‘లోటస్ రోల్డానా’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మొత్తం 35 లగ్జరీ ఫ్లాట్లు.
- పద్మారావ్‌నగర్‌లో 550 చ. గజాల్లో శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ ‘మీనా రెసిడెన్సీ’లో 8 ఫ్లాట్లను నిర్మిస్తోంది. చ.అ. ధర రూ. 4,550.
- ఇదే సంస్థ పంజగుట్టలో 550 చ. గజాల్లో 8 ఫ్లాట్లను నిర్మిస్తోంది. చ.అ. ధర రూ. 8 వేలు, ఇదే ప్రాంతంలో వెయ్యి గజాల్లో మరో 15 ఫ్లాట్ల ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నారు. చ.అ. ధర రూ 8 వేలుగా చెబుతున్నారు.
- బోడుప్పల్‌లో ఎస్వీ కన్‌స్ట్రక్షన్స్ 5 వేల చ. గజాల్లో ‘ఎస్వీ ప్రైడ్’ను నిర్మిస్తోంది. మొత్తం 80 ఫ్లాట్లు. చ.అ. ధర రూ. 2,400. ఇదే ప్రాంతంలో మరో 5 వేల చ. గజాల్లో ‘ఎస్వీ బృందావన్’ ప్రాజెక్ట్‌ను ఈ నెలాఖరులోగా ప్రారంభించనున్నారు. చ.అ. ధర రూ. 2,400.
- ఇదే సంస్థ ఉప్పల్ బస్‌డిపో వెనుక ప్రాంతంలో 800 చ. గజాల్లో ‘ఎస్వీ ఫ్లోరా’ను నిర్మిస్తోంది. మొత్తం 20 ఫ్లాట్లు. చ.అ. ధర రూ. 2,500. ఇదే ప్రాంతంలో 1,500 చ. గజాల్లో ‘ఎస్వీ స్ప్లెండర్’ను కూడా నిర్మిస్తున్నారు. మొత్తం 15 ఫ్లాట్లు. చ.అ. ధర రూ. 2,400.
- ఇదే సంస్థ ఫిర్జాదిగూడలోని కెనరా నగర్‌లో 1,800 చ. గజాల్లో ‘ఎస్వీ హార్మొనీ’ను నిర్మిస్తోంది. మొత్తం 30 ఫ్లాట్లు. చ.అ. ధర రూ. 2,400.
విశాలమైన రోడ్లు, చుట్టూ పచ్చని చెట్లు, జిమ్, స్విమ్మింగ్ పూల్, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, లైబ్రరీ.. వంటి వసతులుండాలంటే విశాలమైన విస్తీర్ణంలో నిర్మించే బడా ప్రాజెక్టుల్లో మాత్రమే ఉంటాయనుకోవడం పొరపాటే. ఎందుకంటే ప్రస్తుతం నగరంలో నిర్మిస్తున్న చిన్న చిన్న ప్రాజెక్టుల్లోనూ ఆధునిక వసతులు కల్పిస్తున్నారు బిల్డర్లు. కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. చిన్నవైనా, పెద్ద ప్రాజెక్టులైనా ఆధునిక వసతులు, గ్రీనరీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో పునాదుల్లోనే అమ్మకాలు జరిగిపోతున్నా వసతుల కల్పనలో మాత్రం బిల్డర్లు వెనకాడట్లేదు. నగరంలో ఈ మధ్యకాలంలో చిన్న ప్రాజెక్టుల్లో ఆధునిక వసతు లందించే జోరు పెరిగింది. ఈ సరికొత్త
పోకడపై ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది..
సాక్షి, హైదరాబాద్: బడా ప్రాజెక్టులు నిర్మించాలంటే కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు కానీ ప్రతికూల పరిస్థితుల్లో పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం కష్టం. తెచ్చిన బ్యాంకు లోన్ల వడ్డీ భారంగా మారి బోర్డు తిప్పేస్తున్న నిర్మాణ సంస్థలు అనేకం. వీటన్నింటికీ పరిష్కారం చూపిస్తున్నాయి చిన్న ప్రాజెక్టులు. చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితోనే చిన్న ప్రాజెక్టులను ప్రారంభించొచ్చు. అంతేకాకుండా పునాదుల్లోనే అమ్మకాలు జరిగిపోతుండటంతో బిల్డర్లలో ఆసక్తి పెరుగుతోంది. దీంతో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొద్ది పాటి ఖాళీ స్థలంలోనే నిర్మాణాలు చేపడుతున్నారు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ‘చిన్న ప్రాజెక్ట్‌ల మార్కెట్‌లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్‌లో తమ కంపెనీ బ్రాండింగ్ అలాగే ఉండిపోతుంది. అందుకే స్థలం ఎంతైనా సరే నిర్మాణాలు చేపడుతున్నాం’ అని శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ ఎండీ నర్సయ్య చెప్పారు. పునాదుల్లోనే ఫ్లాట్స్ అమ్మకాలు పూర్తవుతున్నప్పటికీ ఆధునిక వసతులు కల్పించడంలో వెనక్కి తగ్గట్లేదన్నారు. అయితే చిన్న ప్రాజెక్టులు చేపట్టాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
వసతులకే ప్రాధాన్యం..
ఇంటి ఎంపిక విషయంలో మహిళలు, పిల్లలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ధర ఎక్కువైనా.. వసతుల ఎంపిక విషయంలో మాత్రం రాజీపడటం లేదు. ఆరోగ్యం కోసం వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేపింగ్‌లతో పాటు పండుగలు, ప్రత్యేక రోజుల్లో సందడి చేసేందుకు ఫంక్షన్ హాల్, సమావేశ గది వంటివి కోరుకుంటున్నారు. చిన్నప్రాజెక్టుల్లో
కొన్నే ఫ్లాట్లుంటాయి. దీంతో ఫ్లాట్‌వాసులందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. దీంతో ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రాజెక్టులకు గిరాకీ బాగానే ఉంటుంది.
ప్రతికూలంలో చిన్న ప్రాజెక్టులే మేలు..
ఒకప్పుడు చిన్న ప్రాజెక్టులు నిర్మించాలంటే బడా సంస్థలు అంతగా ఆసక్తి చూపించేవి కాదు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో బడా ప్రాజెక్టులు ప్రారంభించి అమ్మకాల్లేక బాధపడటం కంటే డిమాండ్ ఉన్న ప్రాంతంలో చిన్న ప్రాజెక్టులను నిర్మించడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద ప్రాజెక్టులు నిర్మించాలంటే స్థలం దొరకటం కష్టం. నిర్మాణానికి ఐదారేళ్లు పడుతుంది. దీంతో నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతుంది. అంతేకాకుండా బడా ప్రాజెక్టులను ప్రజలు అంత సులువుగా నమ్మరు. పేరు మోసిన బిల్డర్ అయితేనే అమ్మకాలుంటాయి. కొత ్త బిల్డర్‌కైతే మరింత కష్టం. కానీ చిన్న ప్రాజెక్టులు అలా కాదు నిర్మాణం పూర్తవక ముందే అమ్మకాలు పూర్తవుతాయి. నిర్మాణ వ్యయమూ భారంగా మారదు.
నగరంలో నిర్మిస్తున్న చిన్న ప్రాజెక్టుల్లో కొన్ని..
పద్మారావ్‌నగర్‌లో మరో ప్రాజెక్ట్..
కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా పద్మారావ్‌నగర్‌లో నిర్మించిన ‘సాయి ఆశ్రయ్’ ప్రాజెక్ట్‌లో 50 శాతానికి పైగా స్థలంలో జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్ వంటి వసతులెన్నో కల్పించాం. త్వరలోనే ఇదే ప్రాంతంలో ఎకరం విస్తీర్ణంలో 70 ఫ్లాట్లతో మరో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాం. డబ్బు సంపాదించడం కోసం ఈ ప్రాజెక్టులు చేయకుండా ఆహ్లాదకరమైన వసతులనందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
- ఇంద్రసేనా రెడ్డి, గిరిధారి కన్‌స్ట్రక్షన్ ఎండీ.