టీఆర్‌ఎస్‌ పాలనలో నగరాభివృద్ధి తీరిదీ...  | Sakshi Special Report On Hyderabad Development On Telangana 4th Formation Day | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 2 2018 8:29 AM | Last Updated on Tue, Sep 4 2018 5:48 PM

Sakshi Special Report On Hyderabad Development On Telangana 4th Formation Day

సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు. ఈ నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ పాలనలో గ్రేటర్‌ అభివృద్ధి కొంత మోదం..కొంత ఖేదం అన్నట్లుగా ఉంది. కొన్ని సమస్యలు సవాల్‌గానే మిగలగా..కొన్ని సక్సెస్‌లు ప్రజలకు ఊరట కలిగించాయి. ఇక తీరైన రహదారులు, నాలాల ప్రక్షాళన, వైద్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనలో సాధించింది గోరంత..సాధించాల్సింది కొండంత ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో దాహార్తి తీర్చే పనులను రికార్డు సమయంలో పూర్తిచేయడం.. ఔటర్‌ లోపలున్న 190 గ్రామాలకు దాహార్తిని తీర్చే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతుండడంతో గ్రేటర్‌ తాగునీటి ముఖచిత్రం మారింది. కానీ నిరుపేదలకు రెండు లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని సర్కారు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ.. లక్ష ఇళ్లకు మాత్రమే టెండర్లు పూర్తిచేశారు. మొత్తంగా 109 ప్రాంతాల్లో పనులు ప్రారంభించినప్పటికీ..  ఈ ఏడాది చివరి నాటికి 40 వేల ఇళ్లు, వచ్చే సంవత్సరం జూన్‌ నాటికి మిగతావి పూర్తిచేస్తామని బల్దియా ప్రకటించింది.

అత్యంత కీలకమైన నాలాల ప్రక్షాళన కాగితాలకే పరిమితమైంది. సమస్యాత్మకంగా ఉన్న 46 బాటిల్‌నెక్స్‌లో నాలాలను విస్తరించే çపనుల్లో ఒక్కటి మాత్రమే పూర్తయింది. ఆస్తులు, ఆక్రమణల తొలగింపు క్లిష్టంగా మారడంతో రూ.230 కోట్ల విలువైన పనులు కుంటుపడ్డాయి. ఎస్సార్‌డీపీలో భాగంగా వివిధ దశల్లో 23 వేల కోట్లతో పనులకు ప్రణాళికలు రూపొందించారు. వీటిల్లో దాదాపు రూ.3000 కోట్ల మేర పనులే పురోగతిలో ఉన్నాయి. నగర ప్రజలనుంచి తీవ్ర విమర్శలకు కారణమైన రోడ్లను మెరుగుపరచేందుకు వివిధ ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, మార్పుచేర్పులతో అనుకున్నంత వేగంగా ముందుకు సాగకపోవడం గ్రేటర్‌ పిటీ. స్వచ్ఛర్యాంకింగ్‌లలో ఈ సంవత్సరం ఉత్తమ రాజధాని నగరంగా హైదరాబాద్‌ అవార్డు పొందడం విశేషం.

ఇక నాలుగేళ్ల పాలనలో ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త సంస్కరణలు చోటుచేసుకున్నాయి.  ఈ–పాస్‌ ద్వారా సరుకులు పంపిణీ జరగడంతో డీలర్ల చేతివాటానికి అడ్డుకట్ట పడింది. శాంతిభద్రతల విషయంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. మెట్రో రైళ్లు కూతపెట్టడంతో సిటీజనులు ఆనందంగా ఉన్నప్పటికీ.. ఆర్టీసీ నాలుగేళ్లలో రూ.418 కోట్ల నష్టాలకు చేరుకుంది. మరోవైపు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ దిశగా అడుగులు పడ్డాయి. వైద్యం రంగం బలోపేతం దిశ గా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. మూసీ, హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన పనులు చేపట్టలేదు. నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గ్రేటర్‌లో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...  

ప్రకటన ఘనం.. పని కొంచెం.. జీహెచ్‌ఎంసీ 
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నో ప్రకటనలు చేసింది. అందుకనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించింది. వీటిలో చాలా వరకు ప్రారంభమైనప్పటికీ, పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రెండు లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు గాను, లక్ష ఇళ్లకే టెండర్లు పూర్తికాగా.. 109 ప్రాంతాల్లో పనులు ప్రారంభించారు. సింగం చెరువు తండాలో 176 ఇళ్లు పూర్తి చేశారు. ఈ ఏడాది చివరికల్లా 40వేల ఇళ్లు, వచ్చే ఏడాది జూన్‌ నాటికి మిగతావి పూర్తి చేసే లక్ష్యంతో పనులు కొనసాగిస్తున్నారు. ఇక రూ.10వేల కోట్లతో నాలాలను ఆధునీకరిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. తొలిదశలో అత్యంత సమస్యాత్మకమైన 46 బాటిల్‌నెక్స్‌లో నాలాలను విస్తరించే çపనుల్లో ఒక్కటి మాత్రమే పూర్తయింది. ఆస్తులు, ఆక్రమణల తొలగింపు క్లిష్టంగా మారడంతో రూ.230 కోట్ల విలువైన ఈ పనులు కుంటుతున్నాయి.  
 
ఎస్సార్‌డీపీలో భాగంగా రూ.23వేల కోట్లతో పనులకు ప్రణాళికలు రూపొందించారు. వీటిలో దాదాపు రూ.3,000 కోట్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. అయ్యప్పసొసైటీ, మైండ్‌స్పేస్, చింతల్‌కుంట ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం రూ.243 కోట్ల పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాదిలో కొన్ని ఫ్లైఓవర్లు పూర్తి కానున్నాయి. ఇటీవల మరో రూ.2,128 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

నగరవాసుల తీవ్ర ఇబ్బందుల్లో రహదారులు ఒకటి. వీటిని మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా, పనులు వేగంగా సాగడం లేదు. 20ఏళ్లు మన్నికగా ఉండే వైట్‌టాపింగ్‌ రోడ్లను డక్ట్‌లతో సహ రూ.1930 కోట్లతో చేపట్టాలని నిర్ణయించినప్పటికీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా పూర్తి కావనే అంచనాతో ప్రస్తుత పరిష్కారంగా రూ.1120 కోట్లతో రీకార్పెటింగ్‌ పనులు చేస్తున్నారు. మరో రెండు వారాల్లో వీటిని పూర్తి చేస్తామని చెబుతున్నారు.  

సామాన్య ప్రజల సౌకర్యార్థం రూ.90 కోట్లతో 31 ఫంక్షన్‌హాళ్లు నిర్మిస్తామని ప్రకటించి నాలుగేళ్లయినా, అందులో ఐదు మాత్రమే పూర్తయ్యాయి. ఇంటినెంబర్ల సమస్య ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతోంది. తాజాగా కొత్త ప్రణాళికలతో ఇటీవల మూసాపేట్‌ సర్కిల్‌లో సర్వే చేపట్టారు. ఒక్కో శ్మశానవాటికను దాదాపు రూ.కోటితో ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. వాటిల్లో దాదాపు 14 శ్మశానవాటికల్లో మాత్రమే పనులు చేశారు.  

‘స్వచ్ఛ’తలో ఉత్తమ రాజధానిగా హైదరాబాద్‌ అవార్డు పొందినప్పటికీ, ఇంటివద్దే తడిపొడి చెత్త 25 శాతం కూడా వేరు కావడం లేదు. 4.60 లక్షల ఎల్‌ఈడీల ఏర్పాటు దాదాపు పూర్తయింది. ఈ–ఆఫీస్, డీపీఎంఎస్‌తో ఆన్‌లైన్‌లోనే భవననిర్మాణ అనుమతులు అమలు చేస్తున్నారు. వాటర్‌ ఏటీఎంలు, ఆధునిక బస్‌షెల్టర్లు తదితర పనులు జరుగుతున్నాయి. విపత్తుల నిర్వహణ, కార్యక్రమాల అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. చెరువుల సుందరీకరణ, గణేశ్‌ నిమజ్జన కొలనులు చేపట్టారు. రూ.5 భోజన కేంద్రాలు 150 ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నారు.   

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నో ప్రకటనలు చేసింది. అందుకనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించింది. వీటిలో చాలా వరకు ప్రారంభమైనప్పటికీ, పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రెండు లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు గాను, లక్ష ఇళ్లకే టెండర్లు పూర్తికాగా.. 109 ప్రాంతాల్లో పనులు ప్రారంభించారు. సింగం చెరువు తండాలో 176 ఇళ్లు పూర్తి చేశారు. ఈ ఏడాది చివరికల్లా 40వేల ఇళ్లు, వచ్చే ఏడాది జూన్‌ నాటికి మిగతావి పూర్తి చేసే లక్ష్యంతో పనులు కొనసాగిస్తున్నారు. ఇక రూ.10వేల కోట్లతో నాలాలను ఆధునీకరిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. తొలిదశలో అత్యంత సమస్యాత్మకమైన 46 బాటిల్‌నెక్స్‌లో నాలాలను విస్తరించే çపనుల్లో ఒక్కటి మాత్రమే పూర్తయింది. ఆస్తులు, ఆక్రమణల తొలగింపు క్లిష్టంగా మారడంతో రూ.230 కోట్ల విలువైన ఈ పనులు కుంటుతున్నాయి.  
 
ఎస్సార్‌డీపీలో భాగంగా రూ.23వేల కోట్లతో పనులకు ప్రణాళికలు రూపొందించారు. వీటిలో దాదాపు రూ.3,000 కోట్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. అయ్యప్పసొసైటీ, మైండ్‌స్పేస్, చింతల్‌కుంట ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం రూ.243 కోట్ల పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాదిలో కొన్ని ఫ్లైఓవర్లు పూర్తి కానున్నాయి. ఇటీవల మరో రూ.2,128 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  

నగరవాసుల తీవ్ర ఇబ్బందుల్లో రహదారులు ఒకటి. వీటిని మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా, పనులు వేగంగా సాగడం లేదు. 20ఏళ్లు మన్నికగా ఉండే వైట్‌టాపింగ్‌ రోడ్లను డక్ట్‌లతో సహ రూ.1930 కోట్లతో చేపట్టాలని నిర్ణయించినప్పటికీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా పూర్తి కావనే అంచనాతో ప్రస్తుత పరిష్కారంగా రూ.1120 కోట్లతో రీకార్పెటింగ్‌ పనులు చేస్తున్నారు. మరో రెండు వారాల్లో వీటిని పూర్తి చేస్తామని చెబుతున్నారు.  

సామాన్య ప్రజల సౌకర్యార్థం రూ.90 కోట్లతో 31 ఫంక్షన్‌హాళ్లు నిర్మిస్తామని ప్రకటించి నాలుగేళ్లయినా, అందులో ఐదు మాత్రమే పూర్తయ్యాయి. ఇంటినెంబర్ల సమస్య ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతోంది. తాజాగా కొత్త ప్రణాళికలతో ఇటీవల మూసాపేట్‌ సర్కిల్‌లో సర్వే చేపట్టారు. ఒక్కో శ్మశానవాటికను దాదాపు రూ.కోటితో ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. వాటిల్లో దాదాపు 14 శ్మశానవాటికల్లో మాత్రమే పనులు చేశారు.  

‘స్వచ్ఛ’తలో ఉత్తమ రాజధానిగా హైదరాబాద్‌ అవార్డు పొందినప్పటికీ, ఇంటివద్దే తడిపొడి చెత్త 25 శాతం కూడా వేరు కావడం లేదు. 4.60 లక్షల ఎల్‌ఈడీల ఏర్పాటు దాదాపు పూర్తయింది. ఈ–ఆఫీస్, డీపీఎంఎస్‌తో ఆన్‌లైన్‌లోనే భవననిర్మాణ అనుమతులు అమలు చేస్తున్నారు. వాటర్‌ ఏటీఎంలు, ఆధునిక బస్‌షెల్టర్లు తదితర పనులు జరుగుతున్నాయి. విపత్తుల నిర్వహణ, కార్యక్రమాల అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. చెరువుల సుందరీకరణ, గణేశ్‌ నిమజ్జన కొలనులు చేపట్టారు. రూ.5 భోజన కేంద్రాలు 150 ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నారు.   

ప్రగతి బండి.. నష్టాలండి 
గ్రేటర్‌ ఆర్టీసీ నాలుగేళ్లలో రూ.418 కోట్ల నష్టాలకు చేరుకుంది. ఏటేటా నష్టాలు పెరుగుతున్నాయి.. తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. రెండేళ్ల  క్రితం జీహెచ్‌ఎంసీ నుంచి రూ.120 కోట్ల మేర ఆర్థిక సహాయం అందజేశారు. కానీ ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ కూడా చేతులెత్తేసింది. ఆర్టీసీ భారాన్ని మోయలేమని స్పష్టం చేసింది. దీంతో ప్రతిరోజు సుమారు 32లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయం అందజేస్తున్న   గ్రేటర్‌ ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. మెట్రో ప్రాజెక్టు వ్యయంలో ఒక్క శాతం నిధులు ఆర్టీసీకి ఖర్చు చేసినా... ఆ సంస్థ కొత్త బస్సులతో కళకళలాడుతుంది. నష్టాల నుంచి గట్టెక్కుతుంది. నాలుగేళ్ల  క్రితం  వచ్చిన 80 ఏసీ కొత్త బస్సులు మినహా, ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా అదనంగా కొనుగోలు చేయలేదు. సుమారు 1,000 డొక్కు బస్సులు ఆర్టీసీని వెక్కిరిస్తున్నాయి. అద్దె బస్సులే నడుపుతున్నారు. ఇటీవల 100 బ్యాటరీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది. కానీ అవి కూడా అద్దె ప్రాతిపదికన వచ్చేవే, కానీ సొంతంగా కాదు. పర్యావరణహితంగా ఆర్టీసీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గతంలో  ప్రవేశపెట్టిన 120 సీఎన్‌జీ బస్సులకు సకాలంలో ఇంధనం అందకపోవడంతో రెగ్యులర్‌గా తిరగడం లేదు. 

జలసిరులు... జలమండలి
నాలుగేళ్లలో గ్రేటర్‌ తాగునీటి ముఖచిత్రం సమూలంగా మారింది. జలమండలి విజన్‌తో మహానగర పాలకసంస్థలో విలీనమైన 11 శివారు మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో రూ.1,900 కోట్ల హడ్కో నిధులతో ఏడాదిలోనే 2,500 కిలోమీటర్ల మేర నూతన పైపులైన్లు, 54 భారీ స్టోరేజీ రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు. దీంతో సుమారు 1,000 కాలనీలు, బస్తీల్లోని 35లక్షల మంది దాహార్తి తీరింది. ఇక ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపలున్న 190 గ్రామాలకు దాహార్తి తీర్చేందుకు రూ.700 కోట్ల అంచనా వ్యయంతో యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 60 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. మిగతా గ్రామాలకు ఈ ఏడాది చివరికల్లా సరఫరా చేసేందుకు జలమండలి చర్యలు తీసుకుంటోంది. నీటి నాణ్యత విషయంలో జలమండలి ఐఎస్‌ఓ అవార్డు అందుకుంది.

వినియోగదారుల ఫిర్యాదులను సామాజిక మాధ్యమాల్లో స్వీకరించడం, వినూత్న సాంకేతిక విధానాల అమలుతో తెలంగాణ ఎక్సలెన్స్, హడ్కో అవార్డులు దక్కించుకుంది. ఇంటర్నేషనల్‌ వాటర్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం పొందింది. ఇక మహానగర జనాభా మూడు రెట్లు పెరిగినప్పటికీ... మరో వందేళ్లు తాగునీటి అవసరాలకు ఢోకా లేకుండా చూసేందుకు శామీర్‌పేట్‌ సమీపంలో 10టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో భారీ స్టోరేజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జలమండలి ఎండీ ఎం.దానకిశోర్‌ చొరవ, విజన్‌తో సుమారు రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో నగర శివార్లలో సీవరేజి మాస్టర్‌ప్లాన్‌ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు సుమారు రూ.2వేల కోట్ల అంచనావ్యయంతో 158 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ జలహారం (వాటర్‌గ్రిడ్‌)ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం విశేషం.  

కాసుల గలగలలు.. వాణిజ్య పన్నుల శాఖ  
వాణిజ్య పన్నుల శాఖకు తొలి మూడేళ్లు పెద్ద ఎత్తున రాబడి సమకూరినప్పటికీ, గతేడాది మాత్రం జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపింది. ఈ శాఖకు సమకూరే ఆదాయంలో గ్రేటర్‌ రాబడి అత్యంత కీలకం. ఇందులో మొత్తం 12 డివిజన్లు ఉండగా, మహానగరంలోనే ఏడు డివిజన్లు ఉన్నాయి. నగరంలోని అబిడ్స్, చార్మినార్, బేగంపేట్, పంజగుట్ట, సికింద్రాబాద్, సరూర్‌నగర్, హైదరాబాద్‌ రూరల్‌ డివిజన్ల పరిధిలోనే అత్యధికంగా ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ ఏడాది జీఎస్టీ అమలు ప్రభావం పడింది.   

రిజిస్ట్రేషన్ల శాఖ
రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంపుల శాఖకు నాలుగేళ్లలో దండిగా ఆదాయం సమకూరింది. çసుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ కట్టడి ఫలితంగా స్థిరాస్తి లావాదేవీలు తగ్గుముఖం పట్టినప్పటికీ, తిరిగి ఊపందుకున్నాయి. ఈ శాఖలో మొత్తం 12 జిల్లా రిజిస్ట్రార్లు(డీఆర్‌) ఉండగా, నగరంలోనే 4 డీఆర్‌ పరిధులు ఉన్నాయి. అందులో సుమారు 41 సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు పని చేస్తున్నాయి. మొత్తం మీద రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో మహానగరం వాటా 68.89 శాతం వరకు ఉంటుంది. మరోవైపు కొత్త సంస్కరణలు కూడా అమలవుతున్నాయి. రిజిస్ట్రేన్‌ నమోదు ప్రక్రియ పూర్తిస్థాయి ఆన్‌లైన్‌గా మారింది.  


హెచ్‌ఎండీఏ  
రెండున్నరేళ్ల క్రితం ప్రారంభించిన డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(డీపీఎంఎస్‌), లేఅవుట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ సిస్టమ్‌ల అమలుతో అనుమతుల్లో వేగం పెరగడంతో పాటు హెచ్‌ఎండీఏకు గణనీయంగా ఆదాయం సమకూరింది. ఈ విధానాలతో నెలకు రూ.50 కోట్ల ఆదాయం లభిస్తోంది. కండ్లకోయ జంక్షన్‌ పనులు పూర్తవడంతో 158 కి.మీ మార్గంలో ఔటర్‌రింగ్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మంగళ్‌పల్లి, బాటసింగారం లాజిస్టిక్‌ హబ్స్‌ పనులు ఇటీవల పట్టాలెక్కాయి. బాలానగర్‌ ఫ్లైఓవర్‌ను రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.3,500 కోట్ల విలువైన కోకాపేట భూములు ప్రభుత్వానికి దక్కేందుకు హెచ్‌ఎండీఏ చేసిన కృషి ఫలించింది. ఎన్నడు లేని విధంగా 1.70 లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిశీలించి, 1.25 లక్షల దరఖాస్తులకు ఆమోద ముద్ర వేసింది.   

ప్రక్షాళన... పడని అడుగు
చారిత్రక మూసీ నది ప్రక్షాళన విషయంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నిత్యం గృహ, వాణిజ్య పారిశ్రామిక సముదాయాల నుంచి సుమారు 1400 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలు నదిలో కలుస్తున్నాయి. ఇందులో జలమండలి 700 మిలియన్‌ లీటర్ల మురుగు జలాలనే శుద్ధి చేస్తోంది. మిగతా జలాల శుద్ధికి 18 మురుగు శుద్ధికేంద్రాల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. నగరంలో మూసీ ప్రవహించే 45 కి.మీ మార్గంలో తీరైన ఫ్లైఓవర్‌లు, వాక్‌వేలు, సుందరీకరణ పనులు చేపడతామన్న సర్కారు మాటలు నీటిమూటలే అయ్యాయి.  
 
ఇక హుస్సేన్‌సాగర్‌ను మంచినీటి చెరువుగా మారస్తామన్న సర్కారు మాటలు... నీటి మీద రాతలే అయ్యాయి. సాగరంలోకి ఐదు నాలాల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థ జలాలకు అడ్డుకట్ట పడకపోవడం, సాగర గర్భంలో పేరుకున్న ఘన వ్యర్థాలను తొలగించకపోవడంతో హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన సైతం కాగితాలకే పరిమితమైంది.  ]

అయ్యో.. ‘హా’స్పత్రులు 

ప్రభుత్వం వైద్యరంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నా.. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు లేక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి ప్రాంగణంలో కొత్తగా రెండు బహుళ అంతస్థుల భవనాలు నిర్మించనున్నట్లు నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పునాదిరాయి కూడా పడలేదు. శివారు జిల్లాల నుంచి వచ్చే రోగులకు సత్వర వైద్యసేవలు అందించేందుకు గ్రేటర్‌ చుట్టూ నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం... ఇప్పటి వరకు స్థల సేకరణ కూడా చేయలేదు. నిమ్స్‌లో నెఫ్రాలజీ, యూరాలజీ టవర్స్‌ ప్రతిపాదన ఇప్పటికీ ముందకు కదలేదు. జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు ఒక్క ఆస్పత్రి కూడా అందుబాటులోకి రాలేదు. ఆపరేషన్లు తరచూ వికటిస్తుండటంతో సరోజినిదేవి కంటి ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు ఆపరేషన్ల సంఖ్య కూడా తగ్గింది. కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సింగ్, వార్డుబాయ్స్, ఇతర సిబ్బంది కొరత త్రీవంగా వేదిస్తుంది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో దోపిడీతో... ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే తగినన్ని పడకలు, వైద్య పరికరాలు, ఇతర మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.   

సరికొత్త సంస్కరణలు  ప్రజాపంపిణీ
ప్రజాపంపిణీ వ్యవస్థలో సరికొత్త సంస్కరణలు చోటుచేసుకున్నాయి. రేషన్‌ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డు వచ్చింది. గ్రేటర్‌లో  ప్రయోగాత్మకంగా ఈ–పోస్‌ ద్వారా సరుకుల పంపిణీ జరగడంతో డీలర్ల చేతివాటానికి అడ్డుకట్ట పడింది. గతంలో యూనిట్‌కు నాలుగు కిలోల చొప్పున 20కిలోల పరిమితి కాగా, యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అందరికీ ఆరు కిలోల చొప్పున పంపిణీ జరగుతోంది. ఈ–పోస్‌ అమలుతో ప్రతి నెల 35–40 శాతం సరుకులు మిగులుతున్నాయి. ఎక్కడైనా రేషన్‌ తీసుకునే విధానం మరింత వెసులుబాటు కల్పించింది. ఈ రెండు విధానాలూ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. అయితే పౌరసరఫరాల శాఖ దశల వారీగా ఆహార భద్రత కార్డులను ఏరి వేస్తోంది. గ్రేటర్‌లో 12 సివిల్‌ సప్లై సర్కిల్స్‌ ఉండగా.. హైదరాబాద్‌ పరిధిలో 9, మేడ్చల్‌ అర్బన్‌లో 2, రంగారెడ్డి అర్బన్‌ పరిధిలో ఒకటి ఉన్నాయి. మొత్తం మీద రేషన్‌కార్డు సంఖ్య నాలుగేళ్ల క్రితం 14.04 లక్షలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 10.21లక్షలకు తగ్గింది.  

విప్లవాత్మక మార్పులు పోలీస్‌ విభాగం
నాలుగేళ్లలో నగర శాంతిభద్రతల విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. టెక్నాలజీ వినియోగం, కఠిన చర్యలతోనే నేరాల నియంత్రణ సాధ్యం. ప్రజలతో పోలీసులు స్నేహభావం, మర్యాదతో నడుచుకుంటేనే వారి ప్రతిష్ట పెరుగుతుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఇవన్నీ నగర పోలీస్‌ విభాగంలో కనిపించాయి. స్టేషన్‌లో ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో మోడల్‌ పోలీస్‌ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో కీలక నిర్ణయం నేరగాళ్ల ‘ఆడిటింగ్‌’. ప్రతి ఠాణా పరి«ధిలో నివసించే పాత నేరగాళ్ల వివరాలు సేకరించి, జియో ట్యాగింగ్‌ చేశారు. దీంతో గస్తీ నిర్వహించే రక్షక్, బ్లూకోల్ట్‌ సిబ్బంది, ప్రతి అధికారి విధిగా తమ పరిధిలోని ఎంఓ క్రిమినల్స్‌ ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేసేలా ఏర్పాటు చేశారు. నేర నిరూపణలో కీలకమైన ఆధారాలు అందించే క్లూస్‌టీమ్స్‌ను పరిపుష్టం చేశారు. ఒకప్పుడు ఒకే టీమ్‌ ఉండగా... దేశంలోనే మరే ఇతర నగరంలో లేని విధంగా సబ్‌–డివిజన్‌ స్థాయిలో మొత్తం 17 బృందాలు ఏర్పాటు చేశారు.  

నాలుగేళ్లలో నగరంలోని సీసీ కెమెరాల సంఖ్య 1.5 లక్షలకు చేరింది. వీటి ఏర్పాటులో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తూ ‘నేను సైతం’ అనే ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టారు.  

నేరాలు 30 శాతం వరకు తగ్గాయి. దీనికి పీడీ యాక్ట్‌ ప్రయోగం కీలకాంశం. మూడు కమిషనరేట్లలో కలిపి దాదాపు 3వేల మందిపై దీన్ని ప్రయోగించారు.  

ఈవ్‌టీజర్ల పీచమణిచేందుకు ‘షీ–టీమ్స్‌’ ఏర్పాటు చేశారు. బాధిత మహిళలకు సహాయం అందించేందుకు  ‘భరోసా’ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ రెండూ ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి.  

కేసుల దర్యాప్తులో సలహాలు, సూచనలు అందించడానికి ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌(ఐఎస్‌సీ) ఏర్పాటు చేశారు. దీని సేవల్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.  

బంజారాహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో పాటు కమిషనరేట్‌లో ఆధునిక కంట్రోల్‌ రూమ్‌ రాష్ట్రానికే తలమానికం. ఈ ఏడాది చివరి నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది.  

నగర వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లు, డివిజన్లు, జోన్లను అనుసంధానిస్తూ వీడియో కాన్ఫరెన్సింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. హాక్‌–ఐ, లాస్ట్‌ రిపోర్ట్, హైదరాబాద్‌ కాప్, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్, వెరిఫై, 360 డిగ్రీస్‌ వ్యూ లాంటి యాప్స్‌ అమలులోకి తీసుకొచ్చారు.  

ట్రాఫిక్‌ విభాగంలో క్యాష్‌లెస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, చెస్ట్‌ మౌంటెడ్‌ కెమెరాలు పరిచయం చేశారు. సైబర్, క్రైమ్‌ ల్యాబ్స్, ఐటీ సెల్, వీడియో ఎన్‌హాన్స్‌మెంట్‌ ల్యాబ్‌ ఏర్పాటుతో పాటు ఆధునిక ఉపకరణాలు సమీకరించారు.   

మెట్రో మెరుపులు...

నగరవాసుల కలల మెట్రో నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో పట్టాలెక్కింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో పరుగులు పెట్టనుంది. అక్టోబర్‌లో అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ రూట్లోనూ మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇక డిసెంబరులో జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మార్గంలోనూ మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. పాతనగరానికి వచ్చే ఏడాది మెట్రో రాకపోకలు మొదలయ్యే అవకాశం ఉంది. రాయదుర్గం–శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(31 కి.మీ) మార్గంలో రూ.4,500 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ను ఏర్పాటు చేయడం విశేషం.  

విమానాశ్రయ విస్తరణ..
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ దిశగా అడుగులు పడ్డాయి. ఇటీవల జరిగిన దశాబ్ది వేడుకల్లో భాగంగా ఎయిర్‌పోర్ట్‌ విస్తరణకు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. విమానాశ్రయంలో జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో అందుకనుగుణంగా సదుపాయాలను పెంచనున్నారు. రెండో రన్‌వేతోపాటు ఒకేసారి పదివేల మందితో సమావేశాలు నిర్వహించుకునే స్థాయిలో భారీ సమావేశ మందిరాలు, ఇతర అన్ని సదుపాయాలతో ఎయిర్‌పోర్ట్‌ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

ఐటీ.. పిటీ  
ఐటీ రంగంలో గత నాలుగేళ్లలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించలేదు. ఐటీఐఆర్‌ పట్టాలెక్కకపోవడం, ఐటీ రంగంలో నూతన కంపెనీల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకోకపోవడంతో ఉపాధి అంతంతమాత్రంగానే ఉంది. మహానగరం పరిధిలోని వెయ్యి ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల్లో ప్రస్తుతం సుమారు 5లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. టీఎస్‌ ఐపాస్, నూతన ఐటీ పాలసీల రాకతో ఇటీవల ఐటీ కంపెనీల వెల్లువ మొదలైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సమీప భవిష్యత్‌లో ఈ రంగానికి గ్రేటర్‌లో ఉజ్వల భవిత ఉంటుందని పేర్కొంటున్నారు. 

నాలుగేళ్లలో నగరాభివృద్ధి కొంచెం మోదం.. 
కొంచెం ఖేదంలా సాగింది. శివార్లలో దాహార్తి తీరింది.. మెట్రో పరుగులు పెట్టింది. ప్రజాపంపిణీ, శాంతిభద్రతల విషయంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. హెచ్‌ఎండీఏ, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖకు దండిగా ఆదాయం సమకూరింది. ఇక హుస్సేన్‌సాగర్, మూసీ ప్రక్షాళనకు అడుగు పడలేదు. ఆర్టీసీ నష్టాల్లోంచి గట్టెక్కలేదు. నూతన ఆస్పత్రుల నిర్మాణమే లేదు. 
ఇలా సవాళ్లు... సక్సెస్‌లతో సాగిన నాలుగేళ్ల నగరాభివృద్ధిపై నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం 
సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.  – సాక్షి, సిటీబ్యూరో  

వెలుగుల వేడుక 

రాష్ట్ర అవతరణ వేడుకలకు నగరం సిద్ధమైంది. రంగురంగుల విద్యుద్దీపాలతో కాంతులీనుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement