ప్రముఖ పారిశ్రామికవేత్త భార్య కన్నుమూత
ముంబై: ప్రసిద్ధ దాత, గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ సతీమణి పరమేశ్వర గోద్రెజ్ (70) సోమవారం రాత్రి కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ముంబై బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోచికిత్సపొందుతున్న ఆమె గతరాత్రి తుదిశ్వాస విడిచారు. పలు సామాజిక కార్యక్రమాలు, విరాళాల ద్వారా ప్రసిధ్ది గాంచిన పరమేశ్వర్ 2002 లో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ తో కలసి ఎయిడ్స్ వ్యాధి నివారణకోసం 'గోద్రెజ్ హీరోస్ ప్రాజెక్ట్' ను లాంచ్ చేశారు. క్లింటన్ గ్లోబల్ ఇనీషియేటివ్, బిల్ అండ్ మిలింద్ గేట్స్ ఫౌండేషన్ లాంటి ఇతర ప్రాజెక్టులకు తన సేవల్ని అందించారు. పరమేశ్వర్ అకాల మరణంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు సంతాపం వ్యక్తం చేశారు.
రాజకీయవేత్తగా మారిన పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తన దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ఈ విషాదం నుంచి ఆమె భర్త, పిల్లలు త్వరగా కోలుకోవాలంటూ ట్విట్ చేశారు. పరమేశ్వర్ గోద్రెజ్ సామాజిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషించారని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సంతాపం తెలిపారు. ఫ్యాషన్ అండ్ స్టయిల్ లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారనీ, ఆది గోద్రెజ్ తో పెళ్లికి ముందు ఎయిర్ ఇండియాలో పనిచేసిన తొలి తరం ఎయిర్ హోస్టెస్ లలో ఆమె కూడా ఒకరని ఖేర్ ట్విట్ చేశారు. ఇంకా బాలీవుడ్ నిర్మాత మధుర్ భండార్కర్ విలక్షణ నటుడు కబీర్ బేడి, జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ తదితరులు తమ సంతాపాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కాగా 2012 లో తొలిసారి భారత పర్యటనకు వచ్చిన విన్‌ఫ్రేకు పరమేశ్వర్ గోద్రేజ్ విలాసవంతమైన విందును ముంబైలో ఏర్పాటు చేశారు. పరమేశ్వర్ కు ముగ్గురు సంతానం.
#ParmeshwarGodrej was a larger than life lady. She gave style & glamour a new dimension. Her charity work was great. She'll be missed. RIP
— Anupam Kher (@AnupamPkher) October 11, 2016