Adi Godrej
-
నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
గోద్రెజ్.. దేశంలో ఈ కంపెనీ పేరు విననివారు ఎవరూ ఉండరు. సబ్బులు, గృహోపకరణాల నుంచి రియల్ ఎస్టేట్ వరకు విస్తరించిన ఈ 127 ఏళ్ల కంపెనీ ఇప్పుడు నిట్టనిలువునా చీలిపోతోంది. గోద్రెజ్ గ్రూప్ వ్యవస్థాపక కుటుంబం తమ వ్యాపార సమ్మేళనాన్ని విభజించి పంచుకుంటోంది.ఆది గోద్రెజ్, అతని సోదరుడు నాదిర్ ఐదు లిస్టెడ్ కంపెనీలు ఉన్న గోద్రెజ్ ఇండస్ట్రీస్‌ను, జంషీద్, స్మిత అన్‌లిస్టెడ్ గోద్రెజ్, బోయ్స్, దాని అనుబంధ సంస్థలు అలాగే ముంబైలోని అత్యంత విలువైన ఆస్తులను, భూములను తీసుకునేందుకు అంగీకారం కుదిరింది.గోద్రెజ్ గ్రూప్ ప్రకటన ప్రకారం.. వ్యవస్థాపక కుటుంబంలోని ఆది గోద్రెజ్, ఆయన సోదరుడు నాదిర్ ఒక వైపుగా, వారి దాయాదులు జంషీద్ గోద్రెజ్, స్మితా గోద్రెజ్ కృష్ణ మరోవైపుగా రెండు శాఖల మధ్య వ్యాపారం సమూహం విడిపోతోంది.ఏరోస్పేస్, ఏవియేషన్‌లో రక్షణ, ఫర్నిచర్, ఐటీ సాఫ్ట్వేర్లలో విస్తరించిన గోద్రెజ్ & బోయ్స్, దాని అనుబంధ సంస్థలను కలిగి ఉన్న గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్‌నకు జంషీద్ గోద్రెజ్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఆయన సోదరి స్మిత కుమార్తె నైరికా హోల్కర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటారు. ముంబైలోని 3,400 ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌తో సహా ల్యాండ్ బ్యాంక్‌ను కలిగి ఉండే ఈ విభాగాన్ని వీరి కుటుంబాలు నియంత్రిస్తాయి.ఇక గోద్రెజ్ ఇండస్ట్రీస్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ అగ్రోవెట్, అస్టెక్ లైఫ్ సైన్సెస్ వంటి లిస్టెడ్ కంపెనీలను కలిగి ఉన్న గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు నాదిర్ గోద్రెజ్ చైర్‌పర్సన్‌గా ఉంటారు. ఆది, నాదిర్, వారి కుటుంబ సభ్యుల నియంత్రణలో ఉంటుంది. ఆది కుమారుడు పిరోజ్షా గోద్రెజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉంటారని, 2026 ఆగస్టులో నాదిర్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకుంటారని ప్రకటన తెలిపింది. ఈ విభజనను "యాజమాన్య పునర్వ్యవస్థీకరణ"గా గోద్రెజ్ కుటుంబం పేర్కొంది.లాయర్ నుంచి వ్యాపారవేత్తగా మారిన అర్దేషిర్ గోద్రెజ్, అతని సోదరుడు 1897లో గోద్రెజ్ కంపెనీని స్థాపించారు. అర్దేషీర్‌కు సంతానం లేకపోవడంతో ఆయన తమ్ముడు పిరోజ్షా సంతానానికి కంపెనీ వారసత్వంగా వచ్చింది. పిరోజ్షాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వీరు సోహ్రాబ్, దోసా, బుర్జోర్, నావల్. సంవత్సరాలు గడిచిన తర్వాత గ్రూప్ అధికారం బుర్జోర్ సంతానం (ఆది, నాదిర్), నావల్ పిల్లలు (జంషీద్, స్మిత) వద్దకు వచ్చింది. మరోవైపు సోహ్రాబ్‌కు సంతానం లేదు. దోసాకు రిషద్ అని ఒకేఒకరు సంతానం ఉండగా ఈయనకు కూడా పిల్లలు లేరు. -
విభజన దిశగా గోద్రెజ్ గ్రూప్ కుటుంబం
న్యూఢిల్లీ: సబ్బులు, గృహోపకరణాల నుంచి రియల్ ఎస్టేట్ దాకా వివిధ రంగాల్లో విస్తరించిన దేశీ దిగ్గజం గోద్రెజ్ గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న గోద్రెజ్ కుటుంబం విభజన దిశగా సాగుతోంది. సానుకూల పరిష్కార మార్గంపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం గోద్రెజ్ గ్రూప్‌నకు ఆది గోద్రెజ్ (79) చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన తోడబుట్టిన సోదరుడు నాదిర్ గోద్రెజ్.. గోద్రెజ్ ఇండస్ట్రీస్, గోద్రెజ్ ఆగ్రోవెట్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ఇక గోద్రెజ్ అండ్ బాయిస్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీకి వారి కజిన్ జంషీద్ ఎన్ గోద్రెజ్ సారథ్యం వహిస్తున్నారు. సంబంధిత వర్గాల ప్రకారం ఆది, నాదిర్ ఒక గ్రూపుగా, జంషిద్, ఆయన సోదరి స్మితా గోద్రెజ్ మరో గ్రూపుగా .. వ్యాపార సామ్రాజ్యాన్ని విభజించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. -
గోద్రెజ్‌లో కీలక పరిణామం, చైర్మన్ పదవికి ఆది గోద్రెజ్ రాజీనామా
న్యూఢిల్లీ: పాతతరం పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్ తాజాగా గోద్రెజ్ ఇండస్ట్రీస్(జీఐఎల్) చైర్మన్ పదవి నుంచి వైదొలగారు. అంతేకాకుండా కంపెనీ బోర్డు నుంచి సైతం తప్పుకున్నారు. తమ్ముడు నాదిర్ గోద్రెజ్‌కు కంపెనీ పగ్గాలు అప్పజెప్పారు. అక్టోబర్ 1నుంచి చైర్మన్‌గా నాదిర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు గోద్రెజ్ ఇండస్ట్రీస్ పేర్కొంది. 79ఏళ్ల ఆది గోద్రెజ్ ఇకపై గోద్రెజ్ గ్రూప్‌నకు చైర్మన్‌గా, జీఐఎల్‌కు గౌరవ చైర్మన్‌గానూ వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. నాదిర్ గోద్రెజ్ ప్రస్తుతం జీఐఎల్‌కు ఎండీగా పనిచేస్తున్నారు. తాజా మార్పులతో చైర్మన్, ఎండీ పదవులను నిర్వహించనున్నారు. కృతజ్ఞతలు.. జీఐఎల్‌కు ఆది గోద్రెజ్ దశాబ్దాల తరబడి సర్వీసులు అందించారు. నాలుగు దశాబ్దాలకుపైగా కంపెనీలో బాధ్యతలు నిర్వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆది గోద్రెజ్ పేర్కొన్నారు. ఈ కాలంలో పటిష్ట ఫలితాలు సాధించడంతోపాటు కంపెనీలో సమూల మార్పులను తీసుకువచ్చినట్లు తెలియజేశారు. తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన బోర్డుతోపాటు, టీమ్ సభ్యులు, బిజినెస్ భాగస్వాములు, వాటాదారులు, ఇన్వెస్టర్లు తదితరులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నాదిర్ సారథ్యంలో ఇకపై కంపెనీ మరింత పురోగాభివృద్ధిని సాధించగలదన్న ధీమాను వ్యక్తం చేశారు. కాగా.. ఆది గోద్రెజ్ నాయకత్వం, విజన్, కంపెనీని మలచిన తీరు, విలువలు వంటి అంశాలపట్ల జీఐఎల్‌తోపాటు, బోర్డు తరఫున నాదిర్ గోద్రెజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
గోద్రెజ్‌లో కీలక మార్పు: కొత్త వారసురాలు
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆది గోద్రెజ్ (75)తన వారసత్వ నాయకత్వాన్ని మంగళవారం ప్రకటించారు. గోద్రెజ్ గ్రూపునకు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీని తన కుమార్తెకు అప్పగించారు. గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌ను కుమార్తె నిసాబా(39)కు అందజేశారు. దీంతో 17 ఏళ్ళ పాటు కంపెనీకి నాయకత్వం వహించిన ఆది గోద్రెజ్ ఇక మీదట గౌరవ చైర్మన్‌గా ఉంటారు. రెండు నెలల క్రితం ఛైర్మన్‌గా ఆది గోద్రెజ్ రాజీనామా అనంతరం ఈ కీలక మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుతం కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్ననిసాబా ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మే 10, 2017నుంచి అమల్లోకి రానుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అతిపెద్ద కంపెనీకి అధిపతి గా వ్యవహరిస్తున్న అతి చిన్న వయస్కురాలిగా నిసాబా నిలిచారు. తన తండ్రి క్రమశిక్షణ, ఫలితాలపై దృష్టి, వినయపూర్వకమైన విధానం తమ గ్రూపు డీఎన్ఏలో ఎల్లప్పుడూ ప్రధానంగా ఉంటుందని నిసాబా వ్యాఖ్యానించారు. అలాగే తాను జీఎస్పీఎల్ బోర్డులో కొనసాగుతాననీ, కంపెనీ ఎండీ, సీఈవోగా వివేక్ గంభీర కొనసాగుతారని ఆది గోద్రెజ్ ప్రకటించారు. జిసిపిఎల్ పునాదులు ఎంతో బలంగా ఉన్నాయనీ, ఇది కొత్త చైర్పర్సన్ కు బదిలీ చేయడానికి అనువైన సమయమని చెప్పారు. నిసాబా నాయకత్వంలో సంస్థ అభివృద్ధి దిశగా పయనిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. వినియోగదారుల వస్తువులు, రియల్ ఎస్టేట్, గృహోపకరణాలు, వ్యవసాయ రంగాలతో సహా వివిధ రంగాలలో సేవలందిస్తున్న ఉన్న గోద్రెజ్ గ్రూప్ లోని ప్రధాన సంస్థ జీసీపీఎల్. 2007 లో ప్రారంభించిన సంస్థ యొక్క అభివృద్ధిలో నిసాబా మాస్టర్ మైండ్ కీలకం. ముఖ్యంగా దేశీయ సేంద్రీయ వృద్ధి ఆవిష్కరణ, స్థిరీకరణ ద్వారా సంస్థను పరుగులు పెట్టించారు. అదే సమయంలో భారతదేశం బైట అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా జీపీసీఎల్ ప్రపంచవ్యాప్తమైంది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో 2011 నుంచి పనిచేస్తున్న నిసాబా గత దశాబ్దంలో కంపెనీ వ్యూహంలో మరియు పరివర్తనలో నిసాబా కీలక పాత్ర పోషించారు. ఈ కాలంలో సంస్థ క్యాపిటలైజేషన్ 20రెట్లు అధిగమించింది. రూ. 3వేలకోట్ల నుంచి రూ.60వేల కోట్లకు చేరింది. అలాగే జనవరి మార్చ్ త్రైమాసికంలో అద్భుతమైన లాభాలను ప్రకటించింది. మార్చి 31, 2017 ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో జీసీపీఎల్ రూ. 9,608 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇది రూ. 8,753కోట్లుగాఉంది. కాగా ఆది గోద్రెజ్ ముగ్గురు సంతానంలో నిసాబా రెండవవారు. అతి పెద్ద కుమార్తె తాన్య దుబాష్ గోద్రేజ్ గ్రూప్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , చీఫ్ బ్రాండ్ ఆఫీసర్‌గా ఉన్నారు. చిన్న కుమారుడు పిరోజ్షా గోద్రెజ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుడు కల్పెష్ మెహతాను వివాహం చేసుకున్నారు. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు. -
ప్రముఖ పారిశ్రామికవేత్త భార్య కన్నుమూత
ముంబై: ప్రసిద్ధ దాత, గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ సతీమణి పరమేశ్వర గోద్రెజ్ (70) సోమవారం రాత్రి కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ముంబై బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోచికిత్సపొందుతున్న ఆమె గతరాత్రి తుదిశ్వాస విడిచారు. పలు సామాజిక కార్యక్రమాలు, విరాళాల ద్వారా ప్రసిధ్ది గాంచిన పరమేశ్వర్ 2002 లో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ తో కలసి ఎయిడ్స్ వ్యాధి నివారణకోసం 'గోద్రెజ్ హీరోస్ ప్రాజెక్ట్' ను లాంచ్ చేశారు. క్లింటన్ గ్లోబల్ ఇనీషియేటివ్, బిల్ అండ్ మిలింద్ గేట్స్ ఫౌండేషన్ లాంటి ఇతర ప్రాజెక్టులకు తన సేవల్ని అందించారు. పరమేశ్వర్ అకాల మరణంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయవేత్తగా మారిన పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తన దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ఈ విషాదం నుంచి ఆమె భర్త, పిల్లలు త్వరగా కోలుకోవాలంటూ ట్విట్ చేశారు. పరమేశ్వర్ గోద్రెజ్ సామాజిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషించారని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సంతాపం తెలిపారు. ఫ్యాషన్ అండ్ స్టయిల్ లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారనీ, ఆది గోద్రెజ్ తో పెళ్లికి ముందు ఎయిర్ ఇండియాలో పనిచేసిన తొలి తరం ఎయిర్ హోస్టెస్ లలో ఆమె కూడా ఒకరని ఖేర్ ట్విట్ చేశారు. ఇంకా బాలీవుడ్ నిర్మాత మధుర్ భండార్కర్ విలక్షణ నటుడు కబీర్ బేడి, జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ తదితరులు తమ సంతాపాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా 2012 లో తొలిసారి భారత పర్యటనకు వచ్చిన విన్ఫ్రేకు పరమేశ్వర్ గోద్రేజ్ విలాసవంతమైన విందును ముంబైలో ఏర్పాటు చేశారు. పరమేశ్వర్ కు ముగ్గురు సంతానం. #ParmeshwarGodrej was a larger than life lady. She gave style & glamour a new dimension. Her charity work was great. She'll be missed. RIP — Anupam Kher (@AnupamPkher) October 11, 2016 -
రామ్‌దేవ్‌పై గోద్రెజ్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్‌దేవ్ పై ప్రముఖ పారిశ్రామిక వేత్త, గోద్రేజ్ గ్రూప్ ఛైర్మన్ ఆది గోద్రేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమ విభాగం ఐఎంసీ మంగళవారం నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ లో మాట్లాడిన గోద్రేజ్ రామ్‌దేవ్ పేరు వల్లే పతంజలి నడుస్తోంది తప్ప, వారి ఎఫ్ ఎం సీజీ ఉత్పత్తులకు తమతో పోటీలేదన్నారు. ఆయన ఇమేజ్, పరపతి మూలంగా యోగా, ఆయుర్వేద ఉత్పత్తులు బావున్నాయి తప్ప మిగిలిన వాటికి అంత సీన్ లేదని తేల్చి పారేశారు. నెయ్యి, తేనె వంటి సాధారణ ఉత్పత్తులు మాత్రమే మార్కెట్లో అధికంగా అమ్మడవుతున్నాయని పేర్కొన్నారు. విలువ ఆధారిత విభాగంలో ఆ సంస్థ వాటా చాలా తక్కువని గోద్రెజ్ స్పష్టం చేశారు. కేవలం టాయిలెట్ సబ్బుల విభాగంలోనే కన్జూమర్ ప్రోడక్ట్స్ తో పోటీ పడుతోందన్నారు. ఈ విభాగంలో పతంజలి ప్రాతినిధ్యం చాలా తక్కువ అని వెల్లడించారు. డీజిల్ వాహనాలు నిషేధం వ్యతిరేకంగా మాట్లాడిన ఆది గోద్రేజ్ నిషేధానికి బదులుగా కాలుష్యాన్ని తగ్గించేందుకు, భూతాపాన్ని నిరోధించేందుకు టెక్నాలజీని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం పొడిగింపుపై సానుకూలంగా మాట్లాడారు. అలాగే ప్రస్తుతం కుంగిపోయిన రియాల్టీ రంగానికి జిఎస్టి బిల్లు బూస్ట్ ఇస్తుందని తెలిపారు. కాగా మ్యాగీ నూడల్స్ వివాదం తరువాత పతంజలి ఆదాయం రూ.5000 కోట్ల మైలురాయిని దాటడం.. ఎఫ్ఎమ్సీజీ రంగంలో చర్చనీయాంశమైంది. దీనిపై బ్రోకరేజి సంస్థలు, ఎనలిస్టులు 2020 నాటికి సంస్థ ఆదాయం 20,000 కోట్లకు చేరుతుందని అంచనావేసిన సంగతి తెలిసిందే. -
సాధారణ అంశాలే విజయాన్ని అందిస్తాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘అసాధారణ అంశాలతోనే విజయం సాధిస్తామన్న భావన తప్పు. కష్టపడడం, పట్టుదల, నిజాయితీ.. విస్మరించిన ఈ సాధారణ అంశాలే విజయాన్ని అందించి, కొనసాగిస్తాయి’ అని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. ఇక్కడి ఐఎస్బీలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అసమానతలు ఎదుర్కొంటున్న, అన్యాయానికి గురైన, సర్వస్వం కోల్పోయిన వారికి సహాయం చేయండి. ప్రత్యేకతలు ఉన్నవారు దీనిని మంచి అవకాశంగా భావించాలని చెప్పారు. ఆపన్నులకు చేతనైనంత సహాయం చేయాలని విద్యార్థులకు సూచించారు. ఎంత ఎదిగినా ఈ విషయాలను మరవరాదని తెలిపారు. అందరూ కలిసి ఒకే లక్ష్యంగా పనిచేస్తే సమాజంలో అపరిమితమైన మార్పు చోటు చేసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఐఎస్బీ హవా: ఇప్పటికి 6,000కు పైగా విద్యార్థులు ఐఎస్బీలో విద్యనభ్యసించారు. వీరిలో 180 మంది వివిధ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నారు. ఐఎస్బీ డీన్ అజిత్ రంగ్నేకర్ తెలిపారు. 350 మందికిపైగా విద్యార్థులు సొంతంగా వ్యాపారాలను ప్రారంభించారని పేర్కొన్నారు. సమాజాన్ని, చట్టాన్ని గౌరవించండి. బాధ్యతగల నాయకులుగా నిలవండని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యా సంబంధ పరిశోధనల్లో తమ స్కూల్ ముందుందని ఐఎస్బీ చైర్మన్ ఆది గోద్రెజ్ తెలిపారు. కాగా, 2013 బ్యాచ్‌లో 61 మంది విద్యార్థులు పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ ఫర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, 2014 బ్యాచ్‌లో 766 మంది విద్యార్థులు పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ను పూర్తి చేశారు.