మెట్రో రైలులో పొగలు.. పేలుడు! | Sparks on train at metro station, passengers evacuated | Sakshi
Sakshi News home page

మెట్రో రైలులో పొగలు.. పేలుడు!

Published Wed, May 24 2017 12:45 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

మెట్రో రైలులో పొగలు.. పేలుడు! - Sakshi

మెట్రో రైలులో పొగలు.. పేలుడు!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ మెట్రో రైలు పైకప్పులో నిప్పురవ్వులు ఎగజిమ్ముకొని పొగలు రావడంతో వెంటనే అందులోని ప్రయాణికులను దింపేశారు. ఢిల్లీలోని రాజీవ్‌చౌక్‌ స్టేషన్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉదయం 10.22 గంటలకు మొదట సెంట్రల్‌ సెక్రటేరియట్‌ వద్ద మెట్రో రైలులో నిప్పురవ్వలు ఎగజిమ్ముకోవడం, పొగలు రావడాన్ని గుర్తించారని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ (డీమ్మాఆర్సీ) అధికారి ఒకరు తెలిపారు. దీంతో రాజీవ్‌ చౌక్‌ స్టేషన్‌లో రైలును నిలిపేసి.. అక్కడ ప్రయాణికులందరినీ దింపేశారు.

ఆ తర్వాత రైలు పైకప్పులో నిప్పురవ్వలు వచ్చి.. స్వల్ప పేలుడు చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని, దీనిపై విచారణ జరుపుతున్నామని డీమ్మాఆర్సీ తెలిపింది. అయితే, పలువురు ప్రయాణికులు మాత్రం తాము రైలులో రెండు పేలుళ్ల శబ్దాలు విన్నామని ట్వీట్‌ చేశారు. అయితే, రెండు పేలుళ్ల జరిగినట్టు వచ్చిన ప్రచారాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement