
రాయబారిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు
కౌలాలంపూర్: శ్రీలంక రాయబారి ఇబ్రహిం సాహిద్ అన్సర్‌కు కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా విమానాశ్రయంలోనే ఆయనపై నిరసనకారులు దాడి చేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు మలేషియా పోలీసులు తెలిపారు.
మలేషియాలో శ్రీలంక హైకమిషనర్‌గా పనిచేస్తున్న అన్సర్‌పై విమానాశ్రయంలో నిరసనకారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆయనను చుట్టుముట్టిన నలుగురైదుగురు వ్యక్తులు పిడిగుద్దులు కురిపిస్తూ.. దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ దాడిలో ఆయనకు స్వల్పగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే, నిరసనకారులు ఎవరు? వారు ఎందుకు ఆయనపై దాడి చేశారనే వివరాలను మలేషియా పోలీసులు తెలుపలేదు. మరోవైపు ఈ ఘటనపై శ్రీలంక ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంలోని మలేషియా రాయబారికి సమన్లు జారిచేసి.. తమ నిరసన తెలియజేసింది.