న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడుతో ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుపై వెంకయ్య అభ్యంతరం వ్యక్తం చేయడం, మద్దతు ఇవ్వలేమని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో వీరు భేటి అయ్యారు.
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, అశోక్ బాబు మంగళవారం సాయంత్రం వెంకయ్యను కలిశారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఒప్పించేందుకు వీరు సమావేశమైనట్టు సమాచారం. తెలంగాణ బిల్లులో సవరణలపై రాష్ట్ర నాయకులు చర్చించినట్టు తెలుస్తోంది.
వెంకయ్యతో కిషన్ బృందం సమాలోచనలు
Published Tue, Feb 11 2014 9:04 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement