ఒక్కరోజు నష్టం రూ. 18వేల కోట్లు | Strike to cost up to Rs 18,000 cr to economy, hurt exports: Assocham | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు నష్టం రూ. 18వేల కోట్లు

Published Fri, Sep 2 2016 7:00 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

ఒక్కరోజు నష్టం రూ. 18వేల కోట్లు

ఒక్కరోజు నష్టం రూ. 18వేల కోట్లు

దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు శుక్రవారం చేపట్టిన బంద్ కారణంగా 16 వేల నుంచి 18 వేలకోట్ల రూపాయల వరకు నష్టం ఏర్పడినట్టు అసోచాం  అంచనా వేసింది. ఈ రోజు బంద్ కారణంగా బ్యాంకింగ్, ప్రజారవాణా, టెలికాం తదితర సేవలకు అంతరాయం ఏర్పడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం ఏర్పడినట్టు అసోచాం ప్రతినిధులు వెల్లడించారు. దేశ జీడీపీలో వాణిజ్య, రవాణా, హోటల్స్ ప్రధాన రంగాలని, అలాగే బ్యాంకింగ్ సహా ఆర్థిక రంగ సర్వీసులు కీలకమైనవని, బంద్ కారణంగా నష్టం ఏర్పడినట్టు తెలిపారు.

నెలకు కనీస వేతనం రూ. 18 వేలు చేయాలని, నెలకు రూ. 3 వేల కనీస పెన్షన్ వంటి 12 డిమాండ్లతో 10 కేంద్ర కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ కారణంగా సాధారణ జనజీవనంపై ప్రభావం చూపించింది. ప్రజా రవాణా ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. హరియాణా, జార్ఖండ్, బెంగాల్లో వందలాది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement