
మరో రూ. 200 కోట్లు చెల్లించండి..
న్యూఢిల్లీ: సహారా సంస్థల చీఫ్ సుబ్రతారాయ్ కి సుప్రీంకోర్టు మరోసారి ఊరటను కల్పించింది. సహారా అధిపతి పెరోల్ ను నవంబరు 28వ తేదీవరకు పొడిగించింది. సహారా గ్రూప్ సెబీకి ఈ నెలాఖరుకు రూ.200కోట్లు డిపాజిట్ చేయడానికి అంగీకరించడంతో కోర్టు ఈ ఆయనకు వెసులుబాటును కల్పించింది. నవంబరు 28 లోపు 200 కోట్ల రూపాయలను చెల్లించాలని చీఫ్ జస్టిస్ టీ.ఎస్ థాకూర్, జస్టిస్ అనిల్ దావే, ఏకే సిక్రీ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా సెప్టెంబర్28 నాటి కోర్టు ఆదేశాల ప్కారం సహారా న్యాయవాదిబశుక్రవారం రూ.215కోట్లు డిపాజిట్ చేశారు. మరో రూ.200కోట్లను ఈ నెలాఖరుకు డిపాజిట్ చేయనున్నట్టు కోర్టుకు స్పష్టం చేసింది. అలాగే గతంలో సుప్రీం ఆదేశాలకు మేరకు సెబీకి రూ.12వేల కోట్లు ఏ విధంగా చెల్లిస్తారనే అంశంపై సుబ్రతారాయ్ న్యాయవాది కోర్టుకు రోడ్ మ్యాప్ అందజేశారు. డిసెంబరు 2018 నాటికి సహారా పూర్తి చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
కాగా సెబీలో అవకతవకల కేసులో సుబ్రతారాయ్ రెండేళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఈ ఏడాది మే నెలలో తల్లి మరణించడంతో పెరోల్‌పై బయటకు వచ్చారు. సెబీకి రూ.500కోట్లు చెల్లించే ఒప్పందంతో కోర్టు గతంలో పెరోల్ పొడిగించిన న్యాయస్థానం షరతులతో పెరోల్ పొడిగిస్తున్న సంగతి తెలిసిందే.