వాహనాల పన్ను వివాదంపై పిటిషన్ కొట్టివేత | Supreme court cancellation file on vehicles entry tax | Sakshi
Sakshi News home page

వాహనాల పన్ను వివాదంపై పిటిషన్ కొట్టివేత

Published Thu, Apr 23 2015 1:35 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

వాహనాల పన్ను వివాదంపై పిటిషన్ కొట్టివేత - Sakshi

వాహనాల పన్ను వివాదంపై పిటిషన్ కొట్టివేత

త్వరగా విచారించాలని హైకోర్టుకు సూచించిన సుప్రీం
 
న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రవేశించే  ఏపీ వాహనాలపై పన్ను విధిం పు తగదంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శ్యామల తదితర ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయ గా.. బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
 
పిటిషనర్ల తరపు న్యాయవాది వి.వి.ఎస్.రావు వాదన వినిపిస్తూ ఏపీలో రిజిస్టర్ అయిన బస్సులు తెలంగాణలోకి ప్రవేశిస్తే పన్ను కట్టాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, మరో పదేళ్లపాటు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధాని అని పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో ఈ ఆదేశాలు చట్ట విరుద్ధమని వివరించారు. దీనిపై జస్టిస్ హెచ్.ఎల్.దత్తు స్పందిస్తూ పన్నులు విధించకుంటే  పాలన ఎలా సాగుతుందని ప్రశ్నిం చారు.
 
కానీ ఈ తరహా పన్ను విధించడం పరిహాసమేనని న్యాయవాది పేర్కొనగా.. ఏమాత్రం కాదని న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు. పన్నులు విధించడం రాష్ట్రాల అవసరమని, దీనిని తప్పుపట్టాల్సిన పనిలేదని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను విచారించేందుకు తిరస్కరించారు. హైకోర్టులో ఈ కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నందున దీనిని త్వరగా పరిష్కరించాలని సూచిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement