vehicles entry tax
-
గుర్తుందా.. 15 తర్వాత ఫాస్టాగ్ లేకుంటే..
హైదరాబాద్: టోల్గేట్ల వద్ద నగదు రహిత టోల్ ఫీజు చెల్లింపులకు ప్రవేశపెట్టిన విధానం ‘ఫాస్టాగ్’. వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు ప్రవేశపెట్టిన విధానం ఈనెల 15వ తేదీ నుంచి పక్కాగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీ వాహనాలు ఫాస్టాగ్ విధానంలోకి మార్చుకోకపోతే ఇక టోల్‌ద్ట్లు దాటలేవు. దానికి ఇంకా వారం రోజులే గడువు ఉండడంతో ప్రభుత్వ అధికారులు అవగాహన కార్యక్రమాలు పెంచారు. దేశవ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద నగదు రహిత చెల్లింపుల కోసం కేంద్రం ప్రభుత్వం 2017లో ‘ఫాస్టాగ్’ విధానం తీసుకొచ్చింది. అప్పటి నుంచి అమలు చేస్తున్న ఈ విధానం గడువు పొడగిస్తూనే వస్తున్నారు. ఇక ఫిబ్రవరి 15 చివరి గడువు అని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఆ తర్వాత ‘ఫాస్టాగ్’ లేకపోతే వాహనం టోల్గేట్ దాటదని అధికారులు చెబుతున్నారు. టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ తగ్గించడంతో నగదు రహిత చెల్లింపుల ప్రోత్సాహానికి ఈ ఫాస్టాగ్ దోహదం చేస్తుంది. ఫిబ్రవరి 15 డెడ్ లైన్ ఆఖరు అని తేల్చి చెప్పింది. ఫాస్టాగ్ లేకపోతే జాతీయ రహదారులపై మీ కార్లు, లారీలు తదితర వాహనాలు అనుమతించరు. అయితే ఫాస్టాగ్ చేసుకునేందుకు కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా 720 టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు చేయించుకోకపోతే వెళ్లి ఫాస్టాగ్ చేసుకోండి. -
వాహనాల పన్ను వివాదంపై పిటిషన్ కొట్టివేత
త్వరగా విచారించాలని హైకోర్టుకు సూచించిన సుప్రీం న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రవేశించే ఏపీ వాహనాలపై పన్ను విధిం పు తగదంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శ్యామల తదితర ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయ గా.. బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వి.వి.ఎస్.రావు వాదన వినిపిస్తూ ఏపీలో రిజిస్టర్ అయిన బస్సులు తెలంగాణలోకి ప్రవేశిస్తే పన్ను కట్టాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, మరో పదేళ్లపాటు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధాని అని పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో ఈ ఆదేశాలు చట్ట విరుద్ధమని వివరించారు. దీనిపై జస్టిస్ హెచ్.ఎల్.దత్తు స్పందిస్తూ పన్నులు విధించకుంటే పాలన ఎలా సాగుతుందని ప్రశ్నిం చారు. కానీ ఈ తరహా పన్ను విధించడం పరిహాసమేనని న్యాయవాది పేర్కొనగా.. ఏమాత్రం కాదని న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు. పన్నులు విధించడం రాష్ట్రాల అవసరమని, దీనిని తప్పుపట్టాల్సిన పనిలేదని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను విచారించేందుకు తిరస్కరించారు. హైకోర్టులో ఈ కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నందున దీనిని త్వరగా పరిష్కరించాలని సూచిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.