విభజనపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి సహా మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం, శుక్రవారం నుంచి విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ ఏర్పాటుపై తాము స్టే ఇవ్వలేమని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. ఈ కేసును సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకు దాఖలైన పిటిషన్లను అప్పటికి సమయం పరిపక్వం కాలేదంటూ సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.