హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రింటింగ్ ప్రెస్ ఖాళీ చేయడానికి సంబంధించిన కేసులో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్(డీసీహెచ్‌ఎల్)కి దేశ అత్యు న్నత న్యాయస్థానంలో చుక్కెదురయ్యింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయమంటూ డీసీహెచ్‌ఎల్ వేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వద్ద తీసుకున్న రూ.110 కోట్ల రుణం తిరిగి చెల్లించనందుకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌ను ఫిబ్రవరి 28, 2014 కల్లా డీసీహెచ్‌ఎల్ ఖాళీ చేయాలంటూ రాష్ర్ట హైకోర్టు నవంబర్ 11న తీర్పునిచ్చింది.
దీన్ని సవాలు చేస్తూ డీసీహెచ్‌ఎల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోటక్ బ్యాంక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరు పార్టీలను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు తీర్పును ఇచ్చిన నేపథ్యంలో విచారణకు స్వీకరించదగ్గ అర్హత ఈ కేసుకు లేదని కోటక్ బ్యాంక్ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన జస్టిస్ బి.ఎస్. చౌహాన్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ కేసును ఉపసంహరించుకోమని డీసీహెచ్‌ఎల్‌ను కోరగా అందుకు డీసీహెచ్‌ఎల్ ఆమోదం తెలిపింది. అంతక్రితం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సవరణలు కోరుతో తిరిగి అదే కోర్టును ఆశ్రయించేలా డీసీహెచ్‌ఎల్‌కు సుప్రీం కోర్టు వీలుకల్పించింది.
సుప్రీంలో డీసీకి చుక్కెదురు
Published Wed, Dec 18 2013 1:58 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement