మూడోసారి అవకాశమిస్తే మంచి భార్యగా ఉంటా | tamil actress amala paul in vip series | Sakshi
Sakshi News home page

మూడోసారి అవకాశమిస్తే మంచి భార్యగా ఉంటా

Published Wed, Jun 28 2017 6:57 PM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

మూడోసారి అవకాశమిస్తే మంచి భార్యగా ఉంటా - Sakshi

మూడోసారి అవకాశమిస్తే మంచి భార్యగా ఉంటా

చెన్నై: హీరో ధనుష్‌కు మంచి భార్యగా ఉంటానని చెప్పింది నటి అమలాపాల్‌. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు రెండేళ్లు గడవక ముందే తెగతెంపులు చేసుకుని మళ్లీ యాక్టింగ్‌ బాటపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న అమలాపాల్‌.. ధనుష్‌తో వీఐపీ-2లోనూ జతకట్టింది. గతంలో వచ్చిన వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ- తెలుగులో రఘువరన్‌.బీటెక్‌) సినిమాలో వీళ్లిద్దరి కెమెస్ట్రీ అద్భుతంగా పండటంతో రెండో భాగానికి కూడా అమలానే ఎంపికచేసుకున్నారు.

అయితే వీఐపీ-1లో హీరో ధనుష్‌ని ఆటపట్టించి, ఏడిపించే ప్రియురాలిగా నటించిన అమలా.. వీఐపీ-2లో హీరో భార్యగా చేస్తోంది. సినిమా ప్రయోషన్‌లో భాగంగా ఆమె ఇటీవల మీడియాతో మాట్లాడింది. ‘వీఐపీ-1లో నా పాత్రను చంపేయనందుకు థ్యాంక్స్‌. వీఐపీ-2లో సతాయించే భార్యగా నటిస్తున్నా. ఫస్ట్‌ పార్ట్‌లో ప్రియురాలిగా, సెకండ్‌ పార్ట్‌లో హింసించే అర్ధాంగిగా చేసిన నాకు వీఐపీ-3లోనూ ఛాన్స్‌ ఇస్తే మంచి భార్యగా ఉంటా’ అని చమత్కరించింది అమలాపాల్‌. తద్వారా ఇంకా వస్తుందోరాదో తెలియని సినిమాలో తన పాత్రను కన్ఫార్మ్‌చేసుకుంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement