
7 శాతం పెరిగిన టాటా మోటార్స్ స్పీడ్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు ఏప్రిల్‌లో 7 శాతం పెరిగాయి. కంపెనీ శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం...
ఏప్రిల్‌లో కంపెనీ 36,205 వాహనాలను విక్రయించింది. 2014 ఇదే నెలలో ఈ విక్రయాల సంఖ్య 33,962.
దేశీయంగా వాణిజ్య, పాసింజర్ వాహన విక్రయాలు 5 శాతం పైగా పెరిగి 30,740 యూనిట్ల నుంచి 32,419 యూనిట్లకు ఎగశాయి.
దేశంలో ఒక్క పాసింజర్ వాహన అమ్మకాలు చూస్తే 37 శాతం పెరిగి 7,441 యూనిట్ల నుంచి 10,230 యూనిట్లకు చేరాయి.
అయితే దేశంలో కమర్షియల్ వాహన విక్రయాలు ఐదు శాతం తగ్గి, 22,189గా రికార్డయ్యాయి.
ఏప్రిల్‌లో ఎగుమతులు 18 శాతం పెరిగి 3,222 యూనిట్ల నుంచి 3,786 యూనిట్లకు చేరాయి.