జాగ్వార్ ల్యాండ్ రోవర్ రికార్డ్ అమ్మకాలు | Tata-owned Jaguar Land Rover posts record car sales | Sakshi
Sakshi News home page

జాగ్వార్ ల్యాండ్ రోవర్ రికార్డ్ అమ్మకాలు

Published Mon, Jan 13 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

Tata-owned Jaguar Land Rover posts record car sales

 లండన్: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడయ్యే మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. గతేడాది రికార్డ్ స్థాయి అమ్మకాలను సాధించామని  జేఎల్‌ఆర్ సీఈవో రాల్ఫ్ స్పెత్ చెప్పారు. 2013లో జేఎల్‌ఆర్ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా 4,25,000 అమ్ముడయ్యాయని పేర్కొన్నారు.  జేఎల్‌ఆర్ వాహనాల అమ్మకాల విషయంలో అత్యంత వేగమైన వృద్ధి సాధిస్తున్న దేశాలుగా అమెరికా, జర్మనీ, భారత్, చైనాలు నిలిచాయని వివరించారు. డిజైన్, టెక్నాలజీ, కొత్తదనం, నాణ్యత వంటి అంశాలపై ప్రధానంగా దృష్టిసారించామని, అందుకే రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించామని పేర్కొన్నారు. గతేడాది తామందించిన ఎఫ్-టైప్, రేంజ్ రోవర్ స్పోర్ట్‌లకు మంచి స్పందన లభించిందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement