వేద పాఠశాలలో టీచర్ కిరాతకం
బెంగళూరు: కర్నాటకలోని ఓ వేద పాఠశాలలో ఓ ఎనిమిదేళ్ల బాలుడి పట్ల అక్కడ పనిచేసే టీచర్ అతి కిరాతకంగా వ్యవహరించాడు. ఓ చేయి ఫ్రాక్చర్ అయిన ఆ బాలుడిని పట్టుకుని చెవి మెలేస్తూ... చితక్కొట్టాడు. నిజానికి ఈ ఘటన చాలా రోజుల క్రితం జరిగింది. అయితే ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సామాజిక మాధ్యమంలో పెద్ద సంచలనమే సృష్టిస్తున్నాయి.
నువ్వు బ్రాహ్మణుడివా, లేక క్షత్రియుడివా అంటూ బాలుడిని ఆ టీచర్ చావగొట్టినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కర్నాటకలోని బంట్వాల్‌లో వున్న ఓ వేద పాఠశాలలో జరిగిన ఓ సంఘటన.. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో పెద్ద సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలోనే కలకలం రేపుతోంది. దీనిపై స్థానిక దళిత్ సేవాసమితి నాయకుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై బుధవారం కేసు నమోదైంది.