
సిగ్గుపడదాం... తలదించుకుందాం
- అక్షరాస్యతలో తెలంగాణకు 32వ స్థానం: ఎంపీ వినోద్‌కుమార్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అక్షరాస్యతలో తెలంగాణ దేశంలోనే 32వ స్థానంలో ఉండటం సిగ్గుచేటని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. ‘‘దేశంలో 29 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలుంటే అందులో 32వ స్థానం మనది. స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లయినా ఇంకా నిరక్షరాస్యతను నిర్మూలించలేకపోయాం.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్‌లో ఆసరా, ఉపాధి హామీ, గృహ నిర్మాణం, వయోజన విద్య, వైద్యం వంటి అంశాలపై గురువారం జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్‌తోపాటు ఎంపీలు కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ హాజరయ్యారు.