సగానికి పైగా దేశ సంపద వారిచేతుల్లోనే!
సగానికి పైగా దేశ సంపద వారిచేతుల్లోనే!
Published Wed, Nov 23 2016 5:47 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
సంపన్నులైనా 1 శాతం మంది భారతీయుల దగ్గరే దేశంలోని సగానికి పైగా సంపద అంటే 58.4 శాతం ఉన్నట్టు క్రెడిట్ స్యూజ్ గ్రూప్ ఏజీ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన తన తాజా ప్రపంచ సంపద డేటాలో ఈ విషయం తెలిపింది. గతేడాది వారి చేతుల్లో 53 శాతం ఉంటే, ఈ ఏడాది మరింత పెరిగిందని క్రెడిట్ స్యూజ్ పేర్కొంది. 2010 నుంచి ప్రతేడాది క్రెడిట్ స్యూజ్ ఈ డేటాను విడుదలచేస్తోంది. సంపన్నులే శరవేగంగా మరింత సంపన్నులుగా మారుతున్నారని ఈ డేటా వెల్లడించింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, వారి సంపదను మెరుగుపరుచుకోవడానికి వారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని డేటా పేర్కొంది.
2000లో మాత్రమే దేశ సంపదలో వీరి సహకారం తగ్గి 36.8 శాతంగా నమోదైనట్టు క్రెడిట్ స్యూజ్ తెలిపింది. గత 16 ఏళ్లుగా ఈ 1 శాతం మంది సంపన్నులు దేశ సంపదలో గణనీయంగా వారి షేరును పెంచుకుంటున్నారని, మొత్తం సంపదలో మూడువంతుల మంది వారిదగ్గరే ఉన్నట్టు క్రెడిట్ స్యూజ్ డేటా వివరించింది. క్రెడిట్ స్యూజ్ విడుదలచేసిన ఈ గణాంకాలతో భారత్ అత్యంత అసమాన వ్యవస్థలో ఒకటిగా నిలుస్తున్నట్టు వెల్లడవుతోంది. ఈ గణాంకాల్లో టాప్ స్థానంలో రష్యా నిలిచింది. వారి దేశ సంపదలో 74.5 శాతం సంపద టాప్ 1 శాతం మంది చేతులోనే ఉంది. భారత్ తర్వాతి స్థానాలో చైనా(43.8 శాతం మంది), ఇండోనేషియా (49.3 శాతం మంది), బ్రెజిల్ (47.9 శాతం మంది)లు నిలిచాయి.
Advertisement
Advertisement