‘భారత్-పాక్ మధ్య స్నేహమే మార్గం’
న్యూఢిల్లీ: భారత్‌లో పాకిస్తాన్ ప్రముఖులకు వ్యతిరేకంగా శివసేన నిరసనల నేపథ్యంలో.. ప్రస్తుతం జరిగింది, జరుగుతున్నది విషాదకరమంటూ.. సమాజంలో అసహనం నెలకొని ఉందని.. ప్రజలు పరస్పరం గౌరవించుకోవటం లేదని పాక్‌కు చెందిన బాలికా విద్య ఉద్యమకారిణి, నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ విచారం వ్యక్తంచేసింది. ఆమె ఆదివారం ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ.. భారత్ - పాకిస్తాన్‌లు రెండూ ముందుకు వెళ్లాలంటే పరస్పరం గౌరవించుకుంటూ, కలిసి పనిచేయటం ముఖ్యమని పేర్కొంది. ఇప్పుడు అవసరమైనది పరస్పర సహనం, స్నేహం, ప్రేమ అని సూచించింది.