Malala
-
సహజీవనం: అప్పు చెల్లించమన్నందుకు ప్రియురాలి హత్య
సాక్షి, వికారాబాద్: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన ప్రియురాలిని హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన బేగారి లక్ష్మీ అనే మహిళ భర్త కొంతకాలం కిందట మరణించాడు. భర్త మృతితో ఒంటరిగా ఉంటున్న లక్ష్మి పద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన నర్సింలుతో సహాజీనవం చేస్తోంది. ఈ క్రమంలో లక్ష్మీ, నర్సింలుకు 50 వేల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని లక్ష్మీ నర్సింలును పలుమార్లు కోరింది. దీంతో డబ్బు తిరిగి ఇవ్వాల్సి వస్తుందేమోనని అతడు లక్ష్మిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వారం రోజుల క్రితం డబ్బు ఇస్తానని లక్ష్మీని నమ్మించి తన వెంట తీసుకెళ్లాడు. నమ్మి నర్సింలు వెంట వెళ్లిన లక్ష్మిని రాస్నం అడవిలో దారుణంగా హత్య చేశాడు. లక్ష్మి కనిపించకపోడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నర్సింలును విచారించగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో సీఐ జలంధర్ రెడ్డి, ఎస్ఐ అశోక్ బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: సుంకి చెక్ పోస్టు: సంచుల కొద్దీ నకిలీ నోట్ల పట్టివేత భర్త అడ్డుతొలగిస్తే సంతోషంగా ఉండొచ్చని.. -
ఐక్యరాజ్య సినిమా గుల్ మకాయ్
అవును చిత్రమే! ఉగ్రవాదంపై ఒక పదహారేళ్ల అమ్మాయిఉగ్రురాలవడం చిత్రమే! బందూకు చూపినా మారాకు వణకకపోతే అది చిత్రమే!‘నీ ఆలోచన కరెక్టు కాదు’ అనిమెదడులోకి బుల్లెట్ దింపినా..ఆలోచన ఆగకపోతే అది చిత్రమే!ఆ అమ్మాయి బయోపిక్నిఐరాస సెలబ్రేట్ చెయ్యడం చిత్రమే. గుర్తు కోసం చెప్పడమిది. ఇవాళ శుక్రవారం కదా. వచ్చే శుక్రవారం.. జనవరి 25న లండన్‌లో 450 మంది అత్యున్నతస్థాయి అధికార ప్రతినిధులు కలుస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నుంచి కొందరు, దేశాలన్నిటినీ కలుపుకుపోయే ‘ఈమ్శామ్’ అనే ఒక సంస్థ ఉంది.. ఆ సంస్థ నుంచి కొందరు, ఇంకా.. ఇండో–పాక్ దౌత్యవేత్తలు, బ్రిటన్ హై కమిషన్ నుంచి కొందరు వస్తున్నారు. వీళ్లతో పాటు మరో ముగ్గురు ముఖ్యులు.. లండన్‌లో ఫ్లయిట్ దిగుతారు. ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది. ఇండియా, పాకిస్తాన్, బ్రిటన్, ఐక్యరాజ్యసమితి ఒకచోట కలుస్తున్నాయంటే.. కచ్చితంగా అది చిన్న సంగతైతే కాదు. అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఇలా జరుగుతుంది. తాలిబాన్! అఫ్గానిస్తాన్‌లో యుద్ధం (జిహాద్) చేస్తున్న ఉగ్రవాద సంస్థ. ఇప్పుడు నిద్రాణంలో ఉంది. నిద్రాణంలో ఉందంటే నిద్రపోతోందని కాదు. ఏ క్షణమైనా నిద్రలేవొచ్చని. ‘దాని ముఖం. లేచి ఏం చేస్తుంది?’ అని లోకల్ కుర్రాళ్లకు ధైర్యం చెప్పి, తుపాకుల్ని భుజానికెత్తుకుని అమెరికా సైన్యం ఈమధ్యే అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందక్కడ. అక్కడే కాదు. పాకిస్తాన్లో, భారత్‌లో కూడా! అఫ్గాన్ బార్డర్లో ఇప్పుడు రోజూ ఉదయాన్నే పక్షులు స్వేచ్ఛగా సూర్యస్నానాలు చేసి, మధ్యాహ్నమంతా దొరికిందేదో తిని, సాయంకాల విన్యాసాలు చేస్తున్నాయి. నేలపై మసి బొగ్గుల్లేవు. నింగిలో అగ్ర విమానాల గగ్గోలు లేదు. రెండేళ్ల క్రితం వరకు ఈ మూడు దేశాల్లో (పాక్, ఇండియా, అఫ్గానిస్తాన్) ఇంత ప్రశాంతత లేదు. ఆరేళ్ల క్రితమైతే.. ప్రశాంతత అనే మాటకు అర్థమే లేదు. పాకిస్తాన్ అందర్నీ ఒణికిస్తుంది కదా, పాకిస్తానే వణికిపోతున్న టైమ్ అది.. తాలిబాన్ల దెబ్బకి! మొహమ్మద్ ఒమర్ వర్తమానం అందిందంటే.. ‘పోస్ట్’ అంటూ ఆత్మాహుతి బాంబు డోర్ దగ్గర డెలివరీ అయినట్లే. తీసుకుని ఎక్కడ పడేయాలి దాన్ని. ఎంత పాక్ అయితే మాత్రం ఎన్నాళ్లని ఆ బాంబుని నెత్తిమీదే పెట్టుకుని తనని తను కాపాడుకుంటుంది. ఇక ముల్లా అఖ్తర్ మన్సూర్ పాక్‌లోకి దిగాడంటే.. అధ్యక్ష భవనంలో ఆ పూట కార్యక్రమాలు క్రమం తప్పాల్సిందే. ఫస్ట్ ప్రయారిటీ ముల్లా. తర్వాతే ఆహార పానీయాలు. ఇండియాక్కూడా తిండీ నీళ్లు దక్కని రోజులున్నాయి. కనీసం టాయ్‌లెట్‌కి వెళ్లనివ్వలేదు తాలిబాన్లు. ఇండియన్ ఫ్లయిట్‌ను హైజాక్ చేసి (1999), వారం రోజులు ఎటూ కదలనివ్వలేదు. ఇప్పుడు ఒమర్, మన్సూర్ ఇద్దరూ లేరు. ఒమర్‌ని టీబీ తీసుకుపోయిందని పాక్ పత్రిక ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ రాసింది. రెండేళ్ల వరకు ఒమర్ చనిపోయిన సంగతే ప్రపంచానికి తెలియకుండా షో నడిపింది తాలిబాన్! మన్సూర్‌ను అమెరికన్ సైనికులు ఎయిర్ స్ట్రైక్‌లో చంపేశారు. తాలిబాన్‌కు ఇప్పుడు ఇద్దరే నాయకులు మిగిలారు. వాళ్లు ‘మిగిలిన నాయకులు’ మాత్రమే. నాయకులు కాదు. ఒమన్, మన్సూర్.. చనిపోయేవరకూ ఎవర్నీ బతకనివ్వలేదు. పాక్‌ని చెప్పు చేతల్లో ఉంచుకున్నారు. పాక్ చేత పనులన్నీ చెప్పి చేయించుకున్నారు. గవర్నమెంట్ పాకిస్తాన్‌దే. పాకిస్తాన్ ఏ డ్రెస్ వేసుకోవాలన్నది, ఇండియాతో పాక్ ఎంతసేపు మాట్లాడాలన్నది డిసైడ్ చేసేది మాత్రం ఒమర్, మన్సూర్. ఇద్దరూ అంత పవర్ఫుల్. ఆ పవర్‌తో వాళ్లు సరిపెట్టుకుని ఉంటే బాగుండేది. అమ్మాయిల జోలికి వచ్చారు! జోలికి రావడం అంటే అసభ్యంగా ఏమీ బిహేవ్ చెయ్యలేదు. ‘స్కూల్లేదు ఏం లేదు. ఇంట్లో ఉండండి’ అని ఆజ్ఞ జారీ చేశారు. ‘ఆడపిల్లలు స్కూల్బ్యాగుతో రోడ్డు మీద కనిపిస్తే కాల్చిపారేస్తాం’’ అని శాంపిల్‌గా రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అదే వారి చావుకొచ్చింది. ఎక్కడో జరిపిన ఆ కాల్పుల చప్పుడు పాకిస్తాన్‌లోని ‘స్వాత్’ లోయలో ప్రతిధ్వనించింది. ఆ లోయలోని ఒక ఇంట్లో శ్రద్ధగా పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఓ పదిహేనేళ్ల బాలికను ఆ కాల్పులు డిస్టర్బ్ చేశాయి. ‘‘ఏంటి నాన్నా ఇది?’’ అంది.‘‘వాళ్లంతే’’ అన్నాడు తండ్రి. ‘‘స్కూల్‌కి వెళితే చంపేయడం ఏంటి నాన్నా’’ అంది.‘‘వాళ్లంతేనమ్మా’’ అన్నాడు తండ్రి. త్వరగా తెల్లారితే బాగుండనుకుంది ఆ బాలిక.. స్కూలుకు వెళ్లడం కోసం! తెల్లారింది. తయారై స్కూలుకు బయల్దేరింది. స్కూలుకు వెళ్లి, పరీక్ష రాసి, బస్‌లో వస్తుంటే.. తాలిఫాన్లు ఆ అమ్మాయి మీద, ఇంకో అమ్మాయి మీద కాల్పులు జరిపారు. రెండో అమ్మాయి తప్పించుకుంది. ఈ అమ్మాయికి తలలో బులెట్ దిగింది. కోమాలోకి వెళ్లిపోయింది. తాలిబాన్లు ఆ బాలిక తలలోకి బులెట్ దిగబడిందనే అనుకున్నారు కానీ, ఆ బాలికే బుల్లెట్లా మారి, తమ ఆధిపత్యపు కణతల్లో దిగబడుతుందని ఊహించలేదు. వారం తర్వాత ఆ బాలిక కోమాలోంచి బయటికి వచ్చింది. మూడు నెలల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. తిరిగి స్కూల్‌కి బయల్దేరింది!తాలిబాన్లకు తొలి చావు అది. చావంటే ప్రాణం పోవడం మాత్రమే కాదు. ఆజ్ఞ ధిక్కారం జరగడం కూడా. ఆ బాలిక తాలిబాన్లను ‘గుల్ మకాయ్’ అనే పేరుతో స్మూత్‌గా ఒక్కో పోటూ పొడవడం మొదలు పెట్టింది. బీబీసీలో గుల్ మకాయ్. బ్లాగుల్లో గుల్ మకాయ్. ‘‘గుల్ మకాయ్ ఎవరు?’’ .. తాలిబాన్ ఆరా తీసింది. ‘‘భాయ్.. అది పెన్ నేమ్’’ అన్నారు అనుచరులు. ‘‘అసలు పేరేంటి?’’‘‘మలాలా. మలాలా యూసాఫ్జాయ్’’.గుర్తు చేయడం కోసం చెప్పడమిది. వచ్చే శుక్రవారం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి నాలుగు వందల యాభై మంది లండన్‌లో కలుస్తున్నారు. వాళ్లు వస్తున్నది సదస్సుకోసం, సమావేశం కోసం కాదు. సినిమా చూడ్డం కోసం. ఆ సినిమా పేరు.. ‘గుల్ మకాయ్’. మలాలా బయోపిక్! దర్శకుడు అమ్జాద్ ఖాన్. నిర్మాతలు సంజ్సింఘ్లా, ప్రీతీ వియల్ లాలూ. స్క్రీన్ ప్లే భస్వాతి చక్రవర్తి. వీళ్లందరికన్నా పెద్ద పేరు రీమ్ షేక్. మలాలా పాత్రలో నటిస్తున్నది ఈ అమ్మాయే. చిన్న పిల్లపై బయోపిక్ ఏంటి? చిన్న పిల్ల పాత్రను పోషిస్తున్న మరో చిన్న పిల్ల రీమ్ షేక్ పేరు పెద్ద పేరు ఎలా అవుతుంది? మలాలా ఎఫెక్ట్ ఇది. చిన్న వయసులోనే కదా తను అంత పెద్ద తాలిబాన్లకు ఎదురు తిరిగింది. చిన్న వయసులోనే కదా అంత పెద్ద నోబెల్ బహుమతి పొందింది. చిన్న వయసులోనే కదా మూడు ఇన్స్పైరింగ్ బుక్స్ (ఐయామ్ మలాలా, మలాలాస్ మ్యాజిక్ పెన్సిల్, ఉయ్ ఆర్ డిస్ప్లేస్డ్) రాసింది. ‘గుల్ మకాయ్’లో మలాలా తండ్రి జియావుద్దీన్‌గా అతుల్ కులకర్ణి, మలాలా తల్లిగా దివ్యాదత్త నటిస్తున్నారు. గత ఏడాది జనవరిలో చనిపోయిన విలక్షణ నటుడు ఓమ్ పురి ఈ చిత్రంలో జనరల్ కయానీగా నటించారు. ఇవన్నీ సాధారణ విషయాలు. అసాధారణం ఏంటంటే.. ఐక్యరాజ్య సమితి తొలిసారిగా ఒక సినిమాకు నిర్వహిస్తున్న స్క్రీనింగ్ ఈవెంట్ ఇది! ‘ఈమ్శామ్’తో (పౌష్టికాహార నివారణకు కృషి చేస్తున్న ఖండాంతర ప్రభుత్వాల సంస్థ) కలిసి, ఐరాస మళ్లీ ఫిబ్రవరి మధ్యలో న్యూయార్క్‌లోని తన ప్రధాన కార్యాలయంలో ‘గుల్ మకాయ్’ని ప్రదర్శించబోతోంది. మరి మన దేశంలో ఎప్పుడు విడుదల అవుతుంది? ఏప్రిల్‌లో. ఎగ్జామ్స్ తర్వాత. అన్నట్లు లండన్‌లో పెద్దపెద్ద వాళ్లతో కలిసి ‘గుల్ మకాయ్’ సినిమాను చూడబోతున్న ఆ ముగ్గురూ ఎవరు? మలాలా ప్లస్ ఆమె తల్లిదండ్రులు. రీల్ మలాలా.. రీమ్ షేక్ బయోపిక్‌లు తీసేవాళ్ల అదృష్టం ఏంటంటే.. రియల్ లైఫ్ పాత్రలకు తగిన పోలికలున్న రీల్ లైఫ్ నటులు దొరకడం. ‘గుల్ మకాయ్’లో మలాలా పాత్రకు అచ్చుగుద్దినట్లుగా కాకపోయినా, ఇంచుమించు ఆ అమ్మాయిలానే ఉన్న రీమ్ షేక్ అనే అమ్మాయి దొరికింది. మలాలా జీవితం 16వ యేట మొదలైంది కాబట్టి ఈ పదహారేళ్ల అమ్మాయిని ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం తను జీటీవీలో వస్తున్న ‘తుర్nుసే హై రాబ్తా’లో కల్యాణి దేశ్‌ముఖ్ అనే పాత్రలో నటిస్తోంది. రీమ్ పుట్టింది ముంబైలో. ఆరవ యేటలోనే నటనలోకి వచ్చింది. టీవీ సీరియళ్లలో ఇప్పటికే ఆమెది ఎనిమిదేళ్ల కెరీర్! 13 సీరియళ్లలో నటించింది. 2016లో బెజోయ్ నంబియార్ ‘వజీర్’ సినిమాలో చిన్న క్యారెక్టర్ వేసింది. రెండు అవార్డులు వచ్చాయి. ఒక అవార్డుకు నామినేట్ అయింది. రియల్ లైఫ్‌లో మలాలా పోషిస్తున్న పెద్ద పాత్ర లానే, రీల్ లైఫ్‌లో రీమా తన వంతు పాత్రలో గుర్తింపు తెచ్చుకుంటోంది. -
నేను శక్తి
శక్తి! ఏ ఇంట్లో కనపడుతుంది? ఏ వీధిలో నడుస్తుంది? ఏ ఆఫీసును నడిపిస్తుంది? ఏ వ్యవహారాలు చక్కబెట్టగలుగుతుంది? ఏ కొరివికుండ మోస్తుంది? ఏ ఆస్తి కాగితం మీద సంతకం పెడుతుంది? ఎప్పడు మంచంలో వద్దనగలుగుతుంది? ఎక్కడ తన కంచంలో ఓ ముద్ద వేసుకోగలుగుతుంది? అబ్బ... అంతెందుకు? అసలు ఎన్ని పిండాలలో ఊపిరిపోసుకుంటుంది? సంప్రదాయపు కట్టుబాట్లలో ఇంకెన్నాళ్లు కట్టుబడి ఉంటుంది? దేవత అనీ, పూజనీయురాలనీ, త్యాగమూర్తనీ... ఇంకెన్నాళ్లు మనిషిగా జీవించే అవకాశాన్ని పోగొట్టుకుంటుంది? ఇంట్లో కొరికినా, వీధిలో కాటేసినా ఇంకెన్నాళ్లు మూగబోయిన విగ్రహంలా ఉండిపోతుంది? భూమి అంత చైతన్యం రావాలి. ఆకాశమంత అవగాహన కావాలి. నీకు జన్మనిచ్చినదానిని... నువ్వు నాకేమిస్తావు? ఆకాశంలో సగమిస్తావా? భూమ్మీద పూర్తిగా దగా చేస్తావా? వద్దు... నువ్వు నాకు ఇవ్వద్దు. శక్తి ఒకరు ఇస్తే రాదనీ... ఒకరు దోచుకుంటే పోదనీ... వెక్కిరిస్తే దాక్కోదనీ... శక్తి నేనని... తెలుసుకుంటా. తెలియజేస్తా. నేను శక్తి అందమైన రేపటికి నేను శక్తి... దానికి మీరే సాక్షి. నేను నా గళమెత్తుతాను. అరవగలనని చెప్పడానికి కాదు. గొంతులేని వారి తరఫున వినిపించడం కోసం. – మలాలా యుసాఫ్జాయ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత -
ఫెమినిజం మగాళ్ల విషయం
ఇరవై అంటే పెద్ద వయసేం కాదు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యుసాఫ్జాయ్ వయసు ఇరవైకి ఒక ఏడాది ఎక్కువ. అది కూడా ఎక్కువేం కాదు. అయితే ‘ఫెమినిజం’కి ఆమె చెప్పిన అర్థంలో.. వయసుకు మించిన పరిణతే కనిపిస్తోంది. టీనేజ్లోనే మలాలా నోబెల్‌ను సాధించడం కన్నా గొప్ప సంగతి ఈ పరిణతి. ‘ఫెమినిజం మగాళ్ల విషయం’ అన్నారు మలాలా. ఎగ్జాక్ట్లీ! ‘స్త్రీవాదం గురించీ, స్త్రీల హక్కుల గురించీ మాట్లాడ్డం అంటే.. నిజానికది స్త్రీవాదనను అంగీకరించాలని పురుషులకు నచ్చచెప్పడమే’ అని ఇటీవల మలాలా దావోస్‌లో ప్రసంగిస్తూ అన్నారు! ‘హౌ స్వీట్’ అంటూ హాలంతా చప్పట్లు. 2015లో హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్‌తో సంభాషిస్తున్నప్పుడు ‘ఫెమినిజం అంటే ఏంటీ?’ అనే ప్రశ్నకు ‘ట్రికీ వర్డ్’ అని జవాబిచ్చారు మలాలా. తికమకపెట్టే పదం అని. అప్పటికి ‘జెండర్ ఈక్వాలిటీ’ అన్నదొక్కటే ఆమెకు తెలుసు. తర్వాత కొన్నాళ్లు ఫెమినిజం అంటే అదేదో సుపీరియరిజం అనుకున్నారట మలాలా. ఇప్పుడు ఫెమినిజాన్ని కూడా ఈక్వాలిటీ అనే అర్థంలోనే చూస్తున్నారు. ‘‘ఫెమినిజానికి ఇంకో అర్థం సమానత్వం. స్త్రీ.. సమానత్వాన్ని అడుగుతున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు. అయితే మనం ఫెమినిజం అన్న ప్రతిసారీ అది పురుషుడిని ఉద్దేశించి మాట్లాడటమే’ అని దావోస్‌లో చెప్పారు మలాలా. అంతకంటే కూడా సభను మురిపించిన మరో సంగతి, ‘స్త్రీవాదాన్ని సమర్థిస్తున్నవారూ స్త్రీలు వాదించడాన్ని అంగీకరించలేకపోవచ్చు. ఇప్పుడైతే గట్టిగా చెప్పగలను. స్త్రీవాదాన్ని నేను స్వీకరించాను’ అని మలాలా చెప్పడం. ఎమ్మా వాట్సన్ ప్రస్తుతం ‘హి ఫర్ షీ’ అనే స్త్రీవాద ప్రచారోద్యమాన్ని నడుపుతున్నారు. ‘మీ టూ’, ‘టైమ్స్‌అప్’తో పాటు ‘హి ఫర్ షీ’ని.. మలాలా సమర్థిస్తున్నారు. ‘బయటపడిపోతాం అని భయపడుతూ ఉంటే, విషయం బయటపడేదెలా?’ అని మలాలా ఇంకో అర్థవంతమైన మాటను అన్నారు. స్త్రీవాదానికి నవతరం నాయిక దొరికినట్లే ఉంది మలాలా మెచ్యూరిటీని చూస్తుంటే. -
పాకిస్తాన్ ప్రధానినవుతా!
దావోస్: ఓ బాలిక తనకు రాసిని ఉత్తరంలో భవిష్యత్తులో తాను ఇండియాకు ప్రధానమంత్రిని అవుతానని చెప్పిందని పాకిస్తానీ యువతి మలాలా యూసఫ్ జాయ్ గుర్తు చేసుకుంది. బాలిక విద్య కోసం పోరాడుతున్న మలాలా త్వరలోనే భారత పర్యటనకు వస్తానని ప్రకటించింది. 15 ఏళ్ల ప్రాయంలో పాకిస్తాన్లో బాలిక విద్య కోసం పోరాడుతున్న క్రమంలో ఆమెపై ఉగ్రమూకలు హత్యయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మలాలా బ్రిటన్ వేదికగా బాలికల సమస్యలపై పోరాడుతోంది. గుల్‌మకాయ్ పేరుతో సంస్థను స్థాపించి బాలిక విద్య కోసం నిధులు సేకరిస్తోంది. ఇందులోభాగంగా ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లోనూ పాల్గొంది. ఈ సందర్భంగా నోబెల్ శాంతి గ్రహీత మీడియాతో మాట్లాడింది. తన సంస్థ గుల్‌మకాయ్ విస్తరణ కోసం ఇండియాలో పర్యటించాలని అనుకుంటున్నానని మలాలా వెల్లడించింది. ఎంతోమంది భారతీయులు ఉత్తరాలు రాసి తన పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొంది. వారిచ్చే ప్రోత్సాహం మాటల్లో వర్ణించలేమని కొనియాడింది. పాకిస్తాన్ ప్రధానినవుతా! తనకు భారత్ అంటే చాలా ఇష్టమని మలాలా చెప్పింది. భారతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూసి హిందీ నేర్చుకున్నానని తెలిపింది. తనకు ఉత్తరం రాసిన ఓ బాలిక భవిష్యత్తులో తాను ఇండియాకు ప్రధానమంత్రిని అవుతానని చెప్పిందని గుర్తు చేసుకుంది. ఆ ఉత్తరం తన హృదయాన్ని తాకిందని చెప్పింది. నేటి బాలికల ఉన్నత ఆశయాలకు ఈ ఉత్తరమే నిదర్శనమని ప్రశంసించింది. తాను కూడా పాకిస్తాన్‌కి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇండియాలోని బాలికల కోసం కూడా తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘‘భావితరాలకు బాలికలే భవిష్యత్తు అన్న సంగతి మరువద్దు. కేవలం వారికి విద్యనందిస్తే సరిపోదు, వారికి నచ్చిన రంగంలో రాణించేందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి’’ అని సూచించింది. -
మలాల జీవిత కథ సినిమా
గుల్ మకయ్ 1997లో ఏ ముహూర్తాన మలాల జన్మించినదో కాని ఆమె జీవిత కథ ఎన్నో మలుపులు తిరిగి ప్రపంచానికి ఆసక్తి గొలుపుతూనే ఉంది. పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతానికి చెందిన, అఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న స్వాత్ లోయలో పుట్టి పెరిగిన ‘మలాల యూసఫ్‌జాయ్’ తన తండ్రి జియావుద్దీన్ అధ్యాపకుడైన కారణంగా చదువు మీద ఆసక్తి పెంచుకుంది. ఆడపిల్లలు చదువుకోవాలి అని భావించిన జియావుద్దీన్ మలాల చదువును ప్రోత్సహించాడు. అయితే మలాలాకు పద్నాలుగు పదిహేనేళ్ల వయసు ప్రాంతంలో అంటే 2010– 2012 కాలంలో స్వాత్ లోయ తాలిబన్ల ఆధిక్యం కిందకు వచ్చింది. తాలిబన్లు స్త్రీల విద్యను నిరసించారు. నిషేధించారు. గర్ల్స్ హైస్కూల్స్‌ను బాంబులతో పేల్చి భీతావహ పరిస్థితులు సృష్టించారు. అయినప్పటికీ మలాల బాలికల చదువు కోసం గొంతెత్తింది. తాలిబన్ తూటాలకు ఎదురు నిలిచి పోరాడింది. అంతకు ముందే ఆమె బి.బి.సి వారు ఉర్దూ బ్లాగ్‌లో స్వాత్ లోయలో బాలికల పరిస్థితుల పై ‘గుల్ మకయ్’ అనే కలం పేరుతో ఎన్నో వ్యాసాలు వెలువరించింది. ఆ తర్వాత ఆమె మీద డాక్యుమెంటరీ వచ్చింది. ‘ఇక్కడ చదవడానికి పుస్తకాలు లేకపోవడం నాకు విసుగు పుట్టిస్తోంది’ అనే వ్యాఖ్య ఆ డాక్యుమెంటరీలో ఆమె చేసింది. మలాల, ఆమె తండ్రి జియావుద్దీన్ తాలిబన్ల దృష్టిలో పడ్డారు. కొంతకాలం పెషావర్‌కు వెళ్లి శరణు పొంది పాక్ మిలటరీ పై చేయి సాధించిందనుకున్నాక స్వాత్ లోయకు తిరిగి వచ్చారు. అప్పటికీ మలాల పై తాలిబన్ల కోపం తీరలేదు. 2012 అక్టోబర్ 9న స్కూల్ నుంచి తిరిగి వస్తున్న ఆమె బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ మలాల తలలో దూసుకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె బతికి బయట పడి ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో బాలికల విద్య కోసం ప్రపంచ దేశాలలో ఎలా పని చేస్తున్నదో అందరికీ తెలుసు. నోబెల్ శాంతి పురస్కారం వంటి సర్వోన్నత పురస్కారం పొందడం అంత చిన్న వయసులో మలాల సాధించిన ఘనత. ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న మలాల జీవిత కథ ఇంత వరకూ వెండి తెర మీదకు రాలేదు. ఆ ప్రయత్నాన్ని బాలీవుడ్ సాఫల్యం చేస్తోంది. ‘గుల్ మకయ్’ పేరుతో మలాల జీవిత కథను వెండితెరకెక్కించింది. ఇండియన్ బుల్లితెర మీద గుర్తింపు పొందిన నటి ‘రీమ్ షేక్’ మలాల పాత్రను పోషిస్తోంది. పారలల్ సినిమాల దర్శకుడిగా గుర్తింపు పొందిన అంజాద్ ఖాన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే సగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో దివంగత నటుడు ఓంపురి ఒక పాట కూడా పాడారు. నటి దివ్యాదత్తా మలాలకు తల్లిగా ఈ సినిమాలో కనిపిస్తారు. మొత్తం మీద ఈ సినిమా భారతీయులనే కాక ప్రపంచ ప్రేక్షకులను కూడా కుతూహలపరిచే అవకాశం ఉంది. -
ధైర్యానికి నోబెల్!
కంగ్రాట్స్ మలాలా మలాలా డిగ్రీ కంప్లీట్ అయింది! చచ్చి బతికాక, ఆమె చదువు ఆపకుండా ధైర్యంగా డిగ్రీ పూర్తి చేసింది. అందుకే ఇది మలాలాకు మరో నోబెల్ లాంటిది. ఇవాళ మలాలా యుసాఫ్జాయ్ బర్త్ డే. 20 నిండి 21లోకి వచ్చేసింది. మలాలా జీవితంలో ఈ నెలకు ఇంకా రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఐదు రోజుల క్రితమే మలాల డిగ్రీ పూర్తయింది. అదే రోజు (జూలై 7) మాలాల ట్విట్టర్ అకౌంట్ ప్రారంభం అయింది. ఆమె ‘హాయ్.. ట్విట్టర్’ అని ట్వీట్ చేయగానే మొదటి మూడు గంటల్లో లక్షా 34 వేల మంది ఫాలోవర్లు ఆమె అకౌంట్‌కు జత అయ్యారు. అది కాదు విశేషం. కొన్ని గంటల్లోనే కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో మొదలుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వరకు ఎంతో మంది దేశాధినేతలు ట్విట్టర్లో ఈ అమ్మాయికి ‘హృదయపూర్వక స్వాగతం’ పలికారు. బాలికల విద్య కోసం, మహిళలకు సమానత్వం కోసం మలాలా పాటు పడుతున్న సంగతి తెలిసిందే. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ కాలేజీ నుంచి చివరి పరీక్ష రాసి బయటికి వస్తూ.. తన డిగ్రీ ఒక ‘బిట్టర్ స్వీట్’ అని ఆమె అన్నారు. తాలిబన్ తీవ్రవాదులు మలాలా పై కాల్పులు జరిపిన అనంతరం బర్మింగ్‌హామ్ ఆసుపత్రిలోనే ఆమెకు చికిత్స జరిగింది. తలలో దిగబడిన బుల్లెట్‌ను బయటికి తీసి వైద్యులు అతి కష్టం మీద ఆమె ప్రాణాలను కాపాడారు. పాక్‌లోని స్వాత్ లోయ మలాలా స్వగ్రామం. 2012 అక్టోబరులో ఓ రోజు స్కూలు బస్సులో వెళుతున్న పదిహేనేళ్ల మలాలాపై తాలిబన్లు కాల్పులు జరిపారు. బాలికలు చదువుకోడానికి వీల్లేదని తాలిబన్లు విధించిన నిషేధాజ్ఞల్ని ధిక్కరించి మరీ మాలాలా బయటికి వచ్చి చదువుకోవడం, మిగతా బాలికల్ని కూడా ధైర్యంగా బయటికి వచ్చి చదువుకొమ్మని పిలుపు ఇవ్వడం.. ఈ రెండు ‘తప్పులకు’ పడిన శిక్షే.. ఆమెపై కాల్పులు! తాలిబన్ల దాడి తర్వాత గాయాల నుంచి తేరుకుని మలాల మరింత కృత నిశ్చయంతో బాలిక చదువు కోసం కృషి చేశారు. ఓ పెద్ద ఉద్యమమే చేపట్టారు. అక్షరాలే ఆమె ఆయుధాలు. స్ఫూర్తి? ఇంకెవరు? మలాల జీవితమే. ఈ క్రమంలోనే 2014లో ఆమె నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ప్రస్తుతం మలాలా పూర్తి చేసిన డిగ్రీ పరీక్షల ఫలితాలు వచ్చే నెల వెల్లడి అవుతాయి. ఆ లోపే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆమె ఆహ్వానం అందింది! ఆక్స్‌ఫర్డ్‌లో మలాలా పి.పి.ఇ. చదవాలనుకుంటున్నారు. ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్. బ్రిటన్‌లోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ప్రపంచ దేశాల అధినేతలు, చివరికి మలాలా స్వదేశీ ప్రధాని దివంగత బెనజీర్ భుట్టో కూడా ఈ కోర్సును చదివిన వారే. చేతికి రాబోతున్న డిగ్రీని మలాల ‘బిట్టర్ స్వీట్’ అని అనడానికి తగిన కారణమే ఉంది. తనకన్నా ఎంతో మంది తెలివైన అమ్మాయిలు, ఆశ ఉండీ, అవకాశం లేక చదువుకోలేకపోతున్నారు కనుకనే ఈ సంతోషాన్ని ఆమె సంపూర్ణంగా ఫీల్ అవలేకపోతోంది. కానీ ఆమె విజయాన్ని ప్రపంచం మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తోంది. ‘‘విద్య, సమానత్వాల కోసం జరిగే పోరాటంలో బాలికలకు వాళ్ల గళాలే అత్యంత శక్తిమంతమైన ఆయుధాలు. ప్రతి బాలికలోనూ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది’’ అని కూడా మలాలా ట్వీట్ చేశారు. ఈ ఒక్కమాట చాలు.. బాలికలకు విద్యను, సమానత్వాన్ని నిరాకరించే సమాజాలకు తూటాలా తగలడానికి. మలాలా–మరి కొన్ని విశేషాలు ► మలాలాపై దాడి అనంతరం పాకిస్తాన్లో తొలిసారిగా ‘రైట్ టు ఎడ్యుకేషన్ బిల్లు’ అమల్లోకి వచ్చింది. ► నోబెల్ చరిత్రలోనే అతి చిన్న వయసులో శాంతి బహుమతి అందుకున్నారు మలాలా. అప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. ► ‘ఐ యామ్ మలాలా : ది గర్ల్ హూ స్టుడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ది తాలిబన్’ అనే పుస్తకాన్ని తన గురించి స్వయంగా రాసుకున్నారు మలాలా. ►యూనివర్సిటీ ఆఫ్ కింగ్స్ కాలేజీ మలాలాకు గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందజేసింది. ►ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్, బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2, ఒబామా, జస్టిన్ బీబర్లతో ముఖాముఖి సంభాషించారు. -
మలాల 'హాయ్' అనే పోస్టుకు అనూహ్యస్పందన
'హాయ్ ట్విట్టర్'.. కేవలం రెండు పదాల సింపుల్ పోస్టు. ఈ పోస్టుకు మైక్రోబ్లాగింగ్ సైట్లో అనూహ్య స్పందన వచ్చింది. రోజంతా ఈ హాయ్ ట్విట్టర్ అనే పదానికి ప్రతిస్పందనలు, ఫాలోవర్స్ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ సింపుల్ పోస్టు ఎవరు చేశారో తెలుసా? నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాల యూసఫ్‌జాయ్. నిన్ననే(శుక్రవారం) ఆమె ట్విట్టర్లో జాయిన్ అయ్యారు. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన మలాల, హాయ్ ట్విట్టర్ అని చెప్పి, బాలికల విద్యావ్యాప్తిగా మద్దతివ్వాలని కోరుతూ కొన్ని మెసేజ్‌లు చేశారు. ఆమె పిలుపుకు దాదాపు అంతర్జాతీయ అగ్రనేతలందరూ స్పందించారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ డ్రూడ్ నుంచి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ వరకు అందరూ మాలాలకు ట్విట్టర్లో ఘనస్వాగతం పలికారు. ట్విట్టర్ సైతం ఆమెకు అధికారికంగా స్వాగతం చెప్పింది. బాలికల విద్యకు ఆమె ప్రత్యేకమైన అంకితభావాన్ని, స్ఫూర్తిని అందిస్తుందని, మాలాలకు ట్విట్టర్లో వెల్కమ్ చెబుతూ ఆంటోనియా ట్వీట్ చేశారు. జస్టిన్ ట్రూడో కూడా మాలాల హైస్కూల్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసుకున్నందుకు శుభాకాంక్షలు చెప్పారు. విద్యకోసం తను చూపిస్తున్న తెగువ, అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. మలాల తనకు నిరంతరం స్ఫూర్తినందిస్తుందని బిల్‌గేట్స్ కూడా ట్వీట్ చేశారు. ఆమె అకౌంట్ క్రియేట్ చేసుకున్న 14 గంటల్లోనే 3,50,000 మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. 2012లో తాలిబన్ల చేతిలో దాడికి గురైన మలాల ప్రస్తుతం బాలికల విద్య కోసం పోరాటం సాగిస్తున్నారు. అతిచిన్నవయసులోనే ఆమె నోబెల్ శాంతి పురస్కారాన్ని కూడా పొందారు. Hi, Twitter. — Malala (@Malala) July 7, 2017 I welcome @Malala to Twitter, where she will bring her unique dedication and inspiration on behalf of girls' education. pic.twitter.com/Vwkr9qJAnb — António Guterres (@antonioguterres) July 7, 2017 Your bravery and commitment to education – both yours & others – is inspiring. Congratulations on graduating high school @Malala! — Justin Trudeau (@JustinTrudeau) July 7, 2017 -
మలాలా సిస్టర్స్
టీన్ ట్విన్స్ ఈ ఇద్దరు అమ్మాయిలు... మలాలా ఏ లక్ష్యం కోసం అయితే ఉద్యమించారో ఆ లక్ష్యసాధనకు పాటు పడుతున్నారు. బాలికల చదువు కోసం, సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్నారు. వీళ్ల చురుకుదనం మలాలానే ముగ్ధురాలిని చేసింది! మలాల ధ్యేయానికి తోబుట్టువులను చేసింది! మలాల యూషఫ్సాయ్! ప్రపంచానికి ఒక అబ్బురం. పద్నాలుగేళ్లకే తాలిబన్ తీవ్రవాదులతో పోరాటం, పదిహేడేళ్ల వయసుకే నోబెల్ శాంతి బహుమతి, ఇంకా టీనేజ్‌లో ఉండగనే ఇప్పుడు... బాలికల చదువు కోసం అంతర్జాతీయంగా ప్రచారోద్యమాన్ని నడపడం. ఇవన్నీ ఈ పాకిస్తానీ అమ్మాయిని ప్రపంచానికే ఓ బ్రాండ్ అంబాసిడర్ స్థాయికి చేర్చాయి! వారం క్రితమే మలాలా కెనడా గౌరవ పౌరసత్వం కూడా పొందారు. కెనడా చట్టసభలో ప్రసంగించారు. కెనడా పార్లమెంటు చరిత్రలోనే అతి చిన్నవయసు అతిథి ప్రసంగం అది. ఒక్కమాటలో... మలాలా ఓ ‘గర్ల్ వండర్’! అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది... మలాలా గురించి కాదు. మలాలానే అబ్బుర పరచిన ఇద్దరు అమ్మాయిల గురించి! వాళ్లదీ పాకిస్తానే కానీ, వాళ్లు ఉంటున్నది కెనడాలో. గౌరవ పౌరసత్వం అందుకోడానికి మలాలా వస్తున్నారని తెలిసి, ఆమెను ఎటూ కెనడా ‘ఎంగ్ అండ్ ఎనర్జిటిక్’ ప్రధాని జస్టిన్ ట్రూడో కలుస్తారని ఊహించి... వాళ్లిద్దర్నీ కలిపి ఇంటర్వూ్య చెయ్యాలని ఈ ఇద్దరు హైస్కూల్ విద్యార్థినులు స్కెచ్ వేసుకున్నారు. వేసుకున్నట్లే ఇంటర్వూ్య కూడా చేసేశారు. వాళ్లలో ఒక అమ్మాయి మరియమ్. ఇంకో అమ్మాయి నివాళ్ రెహమాన్. ఇద్దరూ కవల పిల్లలు. టీనేజ్ జర్నలిస్టులు. పదిహేనేళ్ల వయసు ఉంటుంది. ఇంటర్వూ చేశారని వీళ్లను జర్నలిస్టులు అనడం కాదు. ఏడాదిగా వీళ్లొక యూట్యూబ్ చానల్ నడుపుతున్నారు! ఆ చానల్ పేరు ‘ది వరల్డ్ విత్ ఎంఎన్ఆర్’. సమాజంలో మార్పును కోరుకునేవారందరూ కలుసుకునే కూడలి అది. మలాలా లాగే పన్నెండేళ్ల వయసులో వీళ్లు కూడా బాలికల చదువు ప్రాముఖ్యాన్ని సమాజానికి తెలియజెప్పే కార్యకర్తల్లా స్వచ్ఛందంగా బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. తల్లిదండ్రులు వీరికి సహకరించారు. బాలికల చదువుకు సహకరించడమే పెద్ద సంస్కరణ అయిన పరిస్థితుల్లో ‘బాలికల్ని చదివించండి’ అనే ప్రచారోద్యమానికి సహకరించడం పెద్ద సాహసమే కదా! ఇక ఈ పిడుగులు మలాలాను, కెనడా ప్రధాని ట్రూడోను ఎంత చక్కగా, ఎంత చకచకా ఇంటర్వూ చేశారో తెలుసుకోవాలంటే వీడియోను (The Day We Interviewed Malala and Justin Trudeau) చూడాల్సిందే. ఇంటర్వూ ప్రారంభానికి ముందు... తమదొక జెండర్ ఈక్వాలిటీ టీమ్ అని ఆ పెద్దవాళ్లిద్దరితో (మలాలా, ట్రూడో) తమను కలిపేసుకున్నారు ఈ చిన్నవాళ్లిద్దరు! ఆ గడుసుదనానికి వాళ్లవైపు నవ్వుతూ చూశారు ట్రూడో, మలాలా. ఇక ప్రశ్నలు మొదలయ్యాయి. ట్రూడో పాలనా విభాగాలలో మహిళలకు సమాన అవకాశాలు, బాలిక విద్యకోసం కెనడాలో పెట్టుబడులు వంటి కెనడాకే పరిమితమైన ప్రశ్నలతో పాటు... ట్రుడోను, మలాలాను ఉమ్మడిగా అడిగిన ప్రశ్నలూ ఉన్నాయి. మీరు కొత్తగా చదివిన పుస్తకం, మీకు స్ఫూర్తిని ఇచ్చిన మహిళ, పనిలో మునిగిపోయినప్పుడు వేళకాని వేళల్లో మీరు తినే ఆహారం, మిమ్మల్ని ఎప్పుడూ నవ్వించే వ్యక్తి, మీరు వెళ్లాలనుకుంటున్న దేశం (ఈ ప్రశ్నకు సమాధానంగా ట్రూడో పాకిస్తాన్ అని చెప్పారు. మలాల ఇండియాతో పాటు మరి కొన్ని దేశాల పేర్లు చెప్పారు), స్కూల్లో మీరు నేర్చుకున్న మంచి పాఠం, యువ విద్యార్థులకు మీరిచ్చే సలహా... ఇలా సరదా సరదాగా, కొంచెం సీరియస్‌గా ఉండే ప్రశ్నలు అడిగారు. వాటికి ట్రూడో, మలాలా ఇచ్చిన సమాధానాలు స్ఫూర్తివంతంగా ఉన్నాయి. నిజానికి ఇది... నలుగురు నిలుచుని మాట్లాడుకున్నట్లుగానే ఉంది కానీ, ఒక గంభీరమైన ఇంటర్వూ్యలా లేదు. ఆ ఇద్దరు అమ్మాయిలు... లేని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడ్డం చూసి ట్రూడో, మాలాల ముచ్చటపడినట్లే కనిపించారు. తర్వాత వీళ్లిద్దరి గురించీ మలాలా తన బ్లాగులో గొప్పగా రాశారు కూడా. నిజమైన కవలలుగా మాత్రమే కాదు, మలాలా ఉద్యమదీక్షకు కూడా ఈ ఇద్దరు అమ్మాయిలు కవలలు అని చెప్పాలి. – కొటేరు శ్రావణి, ‘సాక్షి’ వెబ్ మలాలా, ట్రూడోలను ఇంటర్వ్యూ చేస్తున్న మరియం, నివాళ్ -
‘భారత్-పాక్ మధ్య స్నేహమే మార్గం’
న్యూఢిల్లీ: భారత్‌లో పాకిస్తాన్ ప్రముఖులకు వ్యతిరేకంగా శివసేన నిరసనల నేపథ్యంలో.. ప్రస్తుతం జరిగింది, జరుగుతున్నది విషాదకరమంటూ.. సమాజంలో అసహనం నెలకొని ఉందని.. ప్రజలు పరస్పరం గౌరవించుకోవటం లేదని పాక్‌కు చెందిన బాలికా విద్య ఉద్యమకారిణి, నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ విచారం వ్యక్తంచేసింది. ఆమె ఆదివారం ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. భారత్ - పాకిస్తాన్‌లు రెండూ ముందుకు వెళ్లాలంటే పరస్పరం గౌరవించుకుంటూ, కలిసి పనిచేయటం ముఖ్యమని పేర్కొంది. ఇప్పుడు అవసరమైనది పరస్పర సహనం, స్నేహం, ప్రేమ అని సూచించింది. -
మలాలా వస్తే ఇలాగే చేస్తారా..?
తనపై శివసేన చేసిన దాడికి అబ్జర్వర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధీంద్ర కులకర్ణి ఘాటుగా స్పందించారు. తనను పాకిస్తాన్ ఏజెంటుగా అభివర్ణించడాన్ని తప్పుపట్టారు. నోబెల్ బహుమతి గ్రహీత మలాలా ముంబయి వస్తే ఇలాగే వ్యవహరిస్తారా..? అని ప్రశ్నించారు. తాను శాంతిని కోరుకునే వ్యక్తినని తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సోమవారం వెళ్లిన సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు నల్లరంగు పోసి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో కసూరి పుస్తకావిష్కరణను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌కు నిరాకరించడంతో శివసేన ఈ దాడికి దిగింది. అయినా సుధీంద్ర వెనకడుగు వేయకుండా కసూరి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
219మంది అమ్మాయిలను ఎత్తుకెళ్తే ఏం చేశారు?
లండన్: ప్రపంచ నాయకులపై నోబెల్ శాంతి బహుమతి విజేత, అక్షర సాహసి మలాలా యూసఫ్‌జాయ్ అసహనం వ్యక్తం చేసింది. బోకోహారమ్ ఉగ్రవాదులు 219 మంది అమ్మాయిలను ఎత్తుకెళ్లిపోయి ఏడాది అవుతున్నా మీరంతా ఏం చేస్తున్నారని నైజీరియన్ నేతలను, ఇతర ప్రపంచ నేతలను నిలదీసింది. పాకిస్థాన్‌లో బాలికల విద్యకోసం ఉద్యమించి ఉగ్రవాదుల బుల్లెట్ దాడులనుంచి ప్రాణాలతో బయటపడిన మలాలా గతేడాది నోబెల్ శాంతిపురస్కారం దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో బాలికలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలపై నిత్యం తాను స్పందిస్తూనే ఉంటానని చెప్పిన మలాలా.. బోకోహారమ్ ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రపంచ అగ్ర నేతలకు లండన్ నుంచి బహిరంగ లేఖ రాసింది. 'ఇప్పటివరకు మిమ్మల్ని రక్షించేందుకు నైజీరియాతో సహా ప్రపంచ నేతలు కూడా ప్రయత్నించలేదు. మీ సంకెళ్లు వీడలేదు. నాయకులు మిమ్మల్ని విడిపించేందుకు ఎంతో చేయాల్సి ఉంది. వారిపై ఒత్తిడి తెచ్చేవారిలో నేను ఒకదాన్ని. ధీరబాలికలారా మీరంతా ధైర్యంగా ఉండండి. మీపై నేను ఎంతో ప్రేమతో, సానుభూతితో ఉన్నాను' అని లేఖలో పేర్కొంది. అదే సమయంలో వారిని విడిపించేందుకు కృషిచేయాలని ప్రపంచ నేతలను కోరింది. గత ఏడాది నైజీరియా నుంచి 219 మంది పాఠశాల విద్యార్థినులను బోకోహారమ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. -
మలాలాకు మరో అరుదైన గౌరవం
ఇస్లామాబాద్: అతి చిన్న వయసులో ప్రపంచ శాంతి నోబుల్ బహుమతి దక్కించుకున్న మలాలా యూసఫ్ జాయ్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. కాలిఫోర్నియాలోని నాసా లోని ల్యాబ్ శాస్త్రజ్ఞులు 316201 అనే ఉల్కకు , బాలికా విద్య కోసం కృషిచేసిన మలాలా పేరును పెట్టారు. ఒక ఉల్కకు (ఆస్ట్రాయిడ్)మలాలా పేరు పెట్టడం చాలా గొప్ప విషయమని నాసా ఖగోళ శాస్త్రజ్ఙుడు ఎమీ మైంజర్ పేర్కొన్నారు. ఇంతకుముందు చాలామంది ఈ గౌరవం లభించినప్పటికీ మహిళల కోసం పనిచేసిన మహిళకు దక్కడం చాలా అరుదని ఆయన తెలిపారు. -
'కావాలంటే నన్ను చంపండి'
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని పెషావర్ ఆర్మీ స్కూల్‌పై ఉగ్రవాద దాడి ఘటనను నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు కైలాస్ సత్యార్థి, యూసఫ్ జాయ్ మలాలా ఖండించారు. ఉగ్రవాదులు కావాలంటే తనను చంపి, పిల్లల్ని విడుదల చేయాలని కైలాస్ అన్నారు. ఇదో చీకటి దినమని కైలాస్ సత్యార్థి అభివర్ణించారు. ఉగ్రవాద దాడి పిరికిపందల చర్యని మలాలా ఖండించారు. చిన్నారులను చంపడం హేయమని అన్నారు. బాలల హక్కుల కోసం పోరాడిన కైలాస్, మలాలా ఇటీవల సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించిన సంగతి తెలిసిందే. పెషావర్ ఆర్మీ స్కూల్లో ఉగ్రవాదుల దాడిలో విద్యార్థులతో సహా దాదాపు 126 మంది మరణించారు. ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో కైలాస్, మలాలా స్పందించారు. -
మాలాలకు ఆమ్నెస్టీ అవార్డు
మహిళల విద్యా హక్కుల కోసం పోరాడుతున్న పాకిస్థాన్ ధీర బాలిక మాలాల యూసఫ్జాయ్కు అరుదైన గౌరవం దక్కింది. 2003 సంవత్సరానికి గాను ఆమ్నెస్టీ అంతర్జాతీయ అత్త్యుమ అవార్డుకు (ది అంబాసిడర్ ఆఫ్ కాన్సైన్స్) ఎంపిక చేశారు. మాలాలతో పాటు అమెరికా గాయని, మానవ హక్కుల, సామాజిక ఉద్యమ కర్త హారీ బెలఫొంటె పేర్లను సంయుక్తంగా నామినేట్ చేశారు. మంగళవారం డబ్లిన్ (ఐర్లాండ్)లో జరిగే కార్యక్రమంలో మాలాల, హారీకి ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ప్రపంచంలో మానవ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసే విశిష్ట వ్యక్తులను ఆమ్నెస్టీ అవార్డుకు ఎంపిక చేస్తారు. 'మా కొత్త అంబాసిడర్లు ఇద్దరూ భిన్నమార్గాలను ఎంచుకున్నా, మానవ హక్కుల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ సలీల్ శెట్టి అన్నారు. -
భారతీయ యువతులకు ‘మలాలా డే’ అవార్డులు