
మాలాలకు ఆమ్నెస్టీ అవార్డు
మహిళల విద్యా హక్కుల కోసం పోరాడుతున్న పాకిస్థాన్ ధీర బాలిక మాలాల యూసఫ్జాయ్కు అరుదైన గౌరవం దక్కింది. 2003 సంవత్సరానికి గాను ఆమ్నెస్టీ అంతర్జాతీయ అత్త్యుమ అవార్డుకు (ది అంబాసిడర్ ఆఫ్ కాన్సైన్స్) ఎంపిక చేశారు. మాలాలతో పాటు అమెరికా గాయని, మానవ హక్కుల, సామాజిక ఉద్యమ కర్త హారీ బెలఫొంటె పేర్లను సంయుక్తంగా నామినేట్ చేశారు.
మంగళవారం డబ్లిన్ (ఐర్లాండ్)లో జరిగే కార్యక్రమంలో మాలాల, హారీకి ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ప్రపంచంలో మానవ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసే విశిష్ట వ్యక్తులను ఆమ్నెస్టీ అవార్డుకు ఎంపిక చేస్తారు. 'మా కొత్త అంబాసిడర్లు ఇద్దరూ భిన్నమార్గాలను ఎంచుకున్నా, మానవ హక్కుల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ సలీల్ శెట్టి అన్నారు.