బతికున్న జలగలను నమిలి తినేశాడు!
బతికున్న జలగలను ఓ వ్యక్తి నమిలి తినేశాడు. దాదాపు 6 నుంచి 7 అంగుళాల పొడవు ఉన్న పెద్ద జలగలను సాస్ లో ముంచుకుని అవి కదులుతుండగానే నమిలి తినేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చైనాకు ఓ చెందిన వ్యక్తి స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు ఈ సాహసం చేసినట్లు తెలుస్తోంది.
వాటిని నములుతున్న సమయంలో అతను జలగల రుచి చాలా బాగుంది అంటూ కామెంట్ కూడా చేశాడు. చైనీయులు అన్ని రకాల ఆహారాలను తీసుకుంటారు. అయితే జలగలను ఓ మనిషి తినడమనేది సాధ్యమేనా అనిపిస్తుంది. ఎందుకంటే జలగలు రక్తం తాగి జీవిస్తాయి. ఒకే ఒక జాతికి చెందిన జలగలు మాత్రమే రక్తాన్ని తమ ఆహారంగా తీసుకుంటాయి. జలగల్లో కొన్ని జాతులు రక్తాన్ని ఆహారంగా తీసుకోవు.
ఉత్తర అమెరికాలో రక్తాన్ని ఆహారంగా తీసుకోని జలగల జాతులు అగుపిస్తాయి. ఒక్క అంటార్కిటికా ఖండంలో తప్ప ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో జలగల జాతులు ఉన్నాయి. కొన్ని జాతుల జలగలను వైద్యరంగంలో వినియోగిస్తున్నారు. అవసరమైనప్పుడు జలగలను ఉపయోగించి వాటి ద్వారా మనిషి శరీర భాగంలో కావలసిన చోటు నుంచి చెడు రక్తాన్ని పీల్చేలా చేస్తారు.
జలగలు 18 అంగుళాల వరకూ పెరుగుతాయి. వీటి జీవనకాలం 20 సంవత్సరాలు. జలగలు కుటుంబాలుగా జీవిస్తాయి. ఒక జలగ గుడ్లు పెడితే ఆ కుటుంబం మొత్తం తమ శరీరాలతో వాటికి ఎలాంటి వ్యాధులు సోకకుండా కాపాడుకుంటాయి. చైనాలో ఉండే కాంటోనీస్ క్యూజీన్ లలో అన్ని రకాల తినే ఆహారాలు లభ్యమవుతాయి. వీటిలో బొద్దింకలు తదితర కీటకాల ఆహారాలు కూడా ఉంటాయి.