leeches
-
Leech Therapy: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్, షుగర్ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా..
Leech Therapy- Health Benefits: లీచ్‌థెరపీ (జలగలతో వైద్యం) కొత్త వైద్యమేమీ కాదు. శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యులు జలగల వైద్యాన్ని వాడుతున్నారు. మనిషికి వచ్చే రకరకాల చర్మ వ్యాధులకు, ఇతర జబ్బులకు చెడురక్తం ప్రధాన కారణం. తేలిగ్గా, తక్కువ ఖర్చుతో, సురక్షితంగా ఈ చెడురక్తాన్ని తొలగించే ప్రక్రియకు వైద్య శాస్త్రంలో జలగల్ని మించిన ప్రత్నామ్నాయం మరొకటి లేదంటారు. ఏ ఏ జబ్బులకు వాడతారు? లీచ్‌థెరపీతో అన్ని రకాల చర్మవ్యాధులు, రక్తసంబంధిత వ్యాధులన్నిటినీ తగ్గించుకోవచ్చు. సొరియాసిస్, మెటిమలు, మధుమేహం వల్ల వచ్చే పుండ్లు, బోదకాలు, గడ్డలు, పైల్స్... ఇలా చాలా జబ్బులను ఇది నయం చేస్తుంది. సొరియాసిస్‌కి... ఒక వ్యక్తికి ఒంటినిండా సొరియాసిస్. తెల్లటి మచ్చలు రావడం, పొట్టు రాలడం మొదలయింది. పెద్ద మచ్చలున్న ప్రాంతంపై జలగల్ని వదిలారు. అలా ఎనిమిది సిట్టింగ్‌లు వైద్యం చేశారు. మళ్లీ మచ్చలు రాకుండా ఉండేందుకు మందులు ఇచ్చి పంపించారు. దాంతోపాటు కొన్ని ఆహారనియమాలు కూడా చెప్పారు. ‘సొరియాసిస్‌తో బాధపడేవారు చాలామంది ఉన్నారు. వారికి లీచ్‌థెరపీకి మించిన వైద్యం లేదు. సొరియాసిస్ అనేది చర్మవ్యాధి. శరీరంలో రోగనిరోధక శక్తి లోపించడం వల్ల వచ్చే వ్యాధుల్లో ఇదొకటి. ఈ వ్యాధిని తగ్గించడం ఒకెత్తు, మచ్చలు పోగొట్టడం ఒకెత్తు. లీచ్ థెరపీ వల్ల ఒంటిపైనున్న మచ్చలన్నీ పోతాయి. అలాగే చెడు రక్తం పోతుంది కాబట్టి కొన్ని ఆహారనియమాలు పాటిస్తే మళ్లీ ఈ జబ్బు వచ్చే అవకాశం ఉండదు’’. బోదకాలకు బోదకాలుతో బాధపడేవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాగా ముదిరిపోతే కష్టం. కానీ మొదటి దశలో లీచ్ థెరపీ చేయించుకుంటే చక్కని ఫలితం ఉంటుంది. ‘బోదకాలు వచ్చిన ఆరునెలలలోపు లీచ్‌థెరపీ చేయించుకుంటే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. బాగా ముదిరిపోయాక ఎనభై శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. ముందు నాలుగైదు సిట్టింగ్‌లలో జలగల ద్వారా కాలులో పేరుకుపోయిన చెడు రక్తాన్ని తీసేస్తాం. కాలు లావు తగ్గి మామూలుగా అయిపోతుంది. తరువాత మళ్లీ రాకుండా కొన్ని మందులు ఇస్తాం. వైద్యం సింపులే కాని దీనికి ఒకటీ రెండు జలగలు సరిపోవు. నాలుగైదు ఉండాలి..’’ అంటున్నారు వైద్యులు. పైల్స్ నివారణ... మల ద్వార ప్రాంతంలో రక్తం గడ్డ కట్టుకు పోయి లేదా పుండుగా ఏర్పడి బాధపెట్టే పైల్స్ నివారణకు కూడా లీచ్‌థెరపీ బాగా ఉపయోగపడుతుంది. గడ్డలు కరగడానికి, పుండు తగ్గడానికి, నొప్పి పోవడానికి... రకరకాల మందులు వాడుతూ ఉంటారు. లీచ్‌థెరపీ వల్ల అన్ని సమస్యలూ ఒకేసారి పోతాయి. చెడురక్తం, గడ్డకట్టిన రక్తం అన్నీ తొలగిపోతాయి. మూడు సిట్టింగ్‌లు పెట్టించుకుని, కొన్ని రకాల ఆహార నియమాలు పాటిస్తే మళ్లీ ఆ సమస్య మీ జోలికి రాదంటారు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ప్రకాశ్. గడ్డలు మాయం... ఉన్నట్టుండి ఒంటిమీద గడ్డలు ఏర్పడుతుంటాయి కొందరికి. చెడురక్తం, కొవ్వుపదార్థాల వల్ల ఏర్పడ్డ ఈ గడ్డల్ని మందులతో కన్నా...లీచ్‌లతో చాలా తొందరగా కరిగించవచ్చంటారు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రాగసుధ. ‘చాలామంది ఒంటిపైన గడ్డలు కనిపిస్తాయి. ఎక్కువగా నుదుటి భాగంలో వస్తుంటాయి. మందులకు లొంగని గడ్డల్ని సర్జరీ చేసి తొలగిస్తారు. ఆపరేషన్ లేకుండా లీచ్‌థెరపీ ద్వారా వీటిని చాలా తేలిగ్గా తొలగించవచ్చు’’ అంటారావిడ. కంటికి, పంటికి... లీచ్‌థెరపీని విదేశాల్లో కంటి జబ్బులకు, పంటి జబ్బులకు కూడా వాడుతున్నారు. దీని గురించి ’కంటిలో నీటికాసులు(గ్లకోమా) ఏర్పడుతుంటాయి. దీని వల్ల చూపు మందగిస్తుంది. దీన్నే...కంటికి నీరు పట్టిందని చెబుతుంటారు. రక్త నాళాల్లో కొవ్వుపదార్థాలు పేరుకుపోవడం, రక్తం గడ్డ కట్టుకుపోవడం వల్ల రక్తప్రసరణ సరిగా జరగదు. దాంతో చూపు మందగిస్తుంది. కంటి చివరి భాగంలో లీచ్‌థెరపీ చేయడం వల్ల రక్తనాణాలలో రక్తప్రసరణ వేగవంతమవుతుంది. మధుమేహం... మన దేశంలో లీచ్‌థెరపీ ఎక్కువగా వాడేది మధుమేహం వల్ల వచ్చే పుండ్లకు. షుగర్ ఎక్కువగా ఉన్నవారికి శరీరంలోని కొన్ని భాగాల్లో ముఖ్యంగా కాళ్లకు, చేతులకు చెడు రక్తం పేరుకుపోయి రంగు మారిపోతుంది. దురదగా మొదలైన ఆ ప్రాంతం పుండుగా మారిపోతుంది. ఈ పుండ్లు లీచ్‌థెరపీతో తొందరగా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. ‘నా అనుభవంలో ఎక్కువగా లీచ్‌థెరపీ వాడింది షుగర్ పేషంట్లకే. షుగర్ కంట్రోల్లో లేకపోతే ఆ పుండ్లు తగ్గవు. పుండు తగ్గడానికి ఒకోసారి సర్జరీలు కూడా అవసరమవుతాయి. ప్రతిరోజు డ్రసింగ్ చేయించుకోలేక, పుండు పెట్టే బాధ పడలేక చాలా ఇబ్బందిపడుతుంటారు. పుండు సైజును బట్టి ఎన్ని లీచ్‌లు వాడాలి, ఎన్ని సిట్టింగ్‌లు పెట్టాలో నిర్ణయిస్తాం. చెడురక్తం, చీము, నీరు, దానివల్ల ఏర్పడ్డ బ్యాక్టీరియా అంతా జలగ తీసేస్తుంది. పుండు మొత్తం మానేవరకూ సిట్టింగ్స్ ఉంటాయి. చాలా తొందరగా ఉపశమనం వస్తుంది.’’ అని చెప్పారాయన. లీచ్‌థెరపీతో షుగర్ పుండు తగ్గించుకున్న షుగర్ కంట్రోల్లో ఉండడం లేదు. నాలుగు నెలల కిత్రం కుడికాలుకి వాపు వచ్చింది. మెల్లమెల్లగా ఆ ప్రాంతంలో శరీరం రంగు మారడం మొదలయింది. దురద కూడా రావడంతో చిన్నగా పుండు పడింది. వెంటనే ఆసుపత్రికి వెళితే మందులు ఇచ్చారు. అవి వాడుతూ ప్రతిరోజూ డ్రసింగ్ చేయించుకునేవాన్ని. ఆ నీళ్లు తాగడం వల్ల జలగ పొట్ట పూర్తిగా శుద్ధి అయిపోతుంది. తరువాత దానికి కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం. వైద్యానికి అన్ని అర్హతలు పొందిన తర్వాతే దాన్ని థెరపీకి ఎంచుకుంటాం. ఒకరి వైద్యానికి ఉపయోగించిన జలగని మరొకరికి వాడం. లీచ్‌థెరపీ పూర్తవగానే జలగకు ఒక మందు ఇస్తాం. వెంటనే తాగిన రక్తాన్ని వాంతి చేసేసుకుంటుంది. తరువాత మళ్లీ పసుపు నీళ్లలో వేస్తాం. తరువాత సిట్టింగ్‌నాటికి దాని కడుపులో, శరీరంలో ఎలాంటి చెడుపదార్థాలు లేకుండా శుద్ది చేసి మళ్లీ వైద్యానికి ఉపయోగిస్తాం. పేషెంటు రాగానే నీళ్లలో ఉన్న జలగని తెచ్చి అతనిపై వదిలేస్తాం అనుకుంటే పొరపాటు...ఈ వైద్యానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది’’ అని చెప్పారు రాగసుధ. అందరినీ పట్టుకోవు... సాధారణంగా జలగ ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకూ రక్తం పీల్చుకుంటుంది. ఇక చాలు... అనుకుంటే పసుపు కాని ఉప్పు గాని దానిపై వేస్తే వెంటనే వదిలేస్తుంది. తరువాత అది పట్టుకున్న చోట వేడినీళ్లతో కడిగి కొద్దిగా పసుపు అంటించి బ్యాండేజ్ వేసేస్తారు. జలగ పట్టుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావు. నొప్పి కూడా పెద్దగా ఉండదు. జలగ రక్తం పీల్చుకుంటున్నప్పుడు ఒకలాంటి మత్తుగా ఉంటుందంటారు పేషెంట్లు. మనవాళ్లు ఈ వైద్యం ప్రయోజనాలు తెలియక ముందుకు రావడం లేదు కాని మా దగ్గరికి వచ్చిన ఏ పేషెంటు కూడా జలగని చూసి భయపడి వెనక్కివెళ్లలేద’’ని చెబుతారామె. అల్లోపతికి జలగసాయం- జలగల వైద్యం ఇంత గొప్పదైనపుడు అల్లోపతి వైద్యంలో కూడా వీటిని వాడుకోవచ్చు కదా! అని జీవరత్నం గారిని ప్రశ్నిస్తే... ‘తప్పకుండా... విదేశాల్లో ఎప్పటినుంచో వాడుతున్నారు. యూరప్ దేశాల్లో ఆపరేషన్ తర్వాత కుట్లు విప్పడానికి జలగల్నే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా లావాటి వాళ్లకు కుట్లు విప్పే ముందు రెండు వైపులా రెండేసి జలగల్ని పట్టిస్తే నిమిషాల్లో అక్కడి చర్మం వదులుగా అవుతుంది. అలాగే వాపు, ఇన్ఫెక్షన్లు వంటివి పోతాయి కూడా. దీని వల్ల కుట్లు తేలిగ్గా విప్పడానికి వీలవుతుంది. హైదరాబాద్‌లోని ఆసుపత్రివారు ప్లాస్టిక్ సర్జరీ అనంతరం స్కిన్ డ్రాఫ్టింగ్‌కి లీచ్ థెరపీ చేయాలని చెప్పి మా దగ్గరికి వచ్చి జలగల్ని తీసుకెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ అనంతరం ఆ భాగంలో రక్తప్రసరణ బాగా జరిగేట్టు చేస్తే తొందరగా చర్మం అతుక్కుంటుంది. ఇలా పలు సందర్భాల్లో లీచ్‌థెరపీని అల్లోపతివారు కూడా వాడుతున్నారు. అయితే అటు వైద్యుల్లో ఇటు ప్రజల్లో కూడా లీచ్‌థెరపీ గురించి అవగాహన చాలా పెరగాల్సిన అవసరం ఉంది. -డాక్టర్ నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. 5AM Club: వాళ్లంతా ఉదయం ఐదింటికే నిద్రలేస్తారు! ప్రయోజనాలెన్నో! -
స్విమ్మింగ్: మూత్రాశయంలోకి వెళ్లిన జలగ
ఫెనోమ్ పెన్: జలగ.. దీని పేరు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఒక్కసారి అది శరీరాన్ని పట్టుకుందంటే రక్తం తాగుతూనే ఉంటుంది. ఇంతటి ప్రమాదకరమైన ప్రాణిగా అనిపించే ఈ జలగ ఓ యువకుడి పురుషాంగం ద్వారా అతని శరీరంలోకి ప్రవేశించింది. ఈ ఘటన కాంబోడియాలో చోటు చేసుకుంది. ఫోమ్ పెన్కు చెందిన ఓ యువకుడు సరదాగా చెరువులో ఈతకెళ్లాడు. ఈ క్రమంలో ఓ జలగ అతని పురుషాంగం ద్వారా శరీరం లోపలికి ప్రవేశించింది. ఇదేమీ గమనించని అతడు ఈత కొట్టడం ముగియగానే ఇంటికెళ్లిపోయాడు. తర్వాతి రోజు అతను టాయిలెట్‌కు వెళ్లగా నొప్పి మొదలైంది. తర్వాత ఆ నొప్పి మరింత తీవ్రం కావడంతో విలవిల్లాడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి పరుగెత్తాడు. (జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది!) అతడి సమస్య ఏంటో తెలుసుకునేందుకు వైద్యులు అతడి మూత్రాశయంలోకి సూక్ష్మమైన కెమెరా పంపగా జలగ ఉన్నట్లు తెలిసింది. పురుషాంగం ద్వారా అది మూత్రాశయానికి చేరుకుని స్థిరపడిపోయినట్లు గుర్తించారు. రక్తం తాగుతున్న కొద్దీ దాని పరిమాణం పెరగడంతో యువకుడి అంతర్గత అవయవాలు సైతం దెబ్బ తిన్నాయి. అవయవాన్ని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు బయటకు తీయడం ప్రమాదకరం కాబట్టి వైద్యులు బైపోలార్ రెసెక్టోస్కోప్ సాయంతో జలగను శరీరంలోనే చంపేసి, అనంతరం దాన్ని బయటకు తీశారు. ఇక ఆ జలగ 500 మిల్లీలీటర్ల రక్తం తాగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నారు. (గొంతులోంచి రెండు జలగలు బయటకు తీశారు..) -
గొంతులోంచి రెండు జలగలు బయటకు తీశారు..
సాధారణంగానే జలగలను చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటిది రెండు నెలలకు పైగా ఒక వ్యక్తి శరీరంలో జలగలు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వివరాల్లోకి వెళితే.. చైనాలో ఒక వ్యక్తి రెండు నెలలుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు. కాగా, శుక్రవారం దగ్గుతుండగా రక్తం పడడంతో అనుమానమొచ్చి సదరు వ్యక్తి ప్యూజిన్ ఫ్రావిన్స్‌లోని వుపింగ్ కౌంటీ హాస్పిటల్‌ను సంప్రదించాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అతన్ని శ్వాసకోస విభాగానికి సిఫార్సు చేశారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి సిటీ స్కాన్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు బ్రాంకోస్కోపీ పరీక్ష నిర్వహించారు. రిపోర్టులను పరీక్షించిన డాక్టర్లు ఆ వ్యక్తి గొంతు, ముక్కు భాగంలో రెండు జలగలు ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. వెంటనే సదరు వ్యక్తికి మత్తుమందు ఇచ్చి ట్వీజర్ సాయంతో ఆపరేషన్ నిర్వహించి 1.2 ఇంచులు ఉన్న రెండు జలగలను బయటికి తీశారు. ప్రసుత్తం ఆ వ్యక్తి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 'అతని గొంతులోంచి రెండు జలగలను బయటకు తీశాం. ప్రసుత్తం అతని ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆ వ్యక్తి బహుశా జలగలు ఉన్న నీటిని తాగి ఉంటాడు. అయితే అవి కంటికి కనిపించని స్థితిలో ఉండడంతో గుర్తించలేకపోయాడు. కాగా, ఆ జలగలు రెండు నెలలుగా ఆ వ్యక్తి యొక్క రక్తం పీల్చుతూ పెరిగాయని' శ్వాసకోస విభాగధిపతి డాక్టర్ రావు గున్యాంగ్ తెలిపారు. -
గోడలెక్కే రోబో జలగ
టోక్యో: జలగ మాదిరిగా గోడలను సైతం సునాయాసంగా పాకుతూ ఎక్కగలిగే రోబోను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ రోబోలు భవనాల నిర్వహణ, తనిఖీ, అన్వేషణ, విపత్తు సమయాల్లో భవనాల లోపలికి వెళ్లగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని జపాన్‌లోని టోయోహాషి యూనివర్సిటీ, బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. దీని పేరు లీచ్(లాంగిట్యూడినల్లీ ఎక్స్‌టెన్సిబుల్ కంటినమ్ రోబోట్ ఇన్స్పైర్డ్ బై హిరుడినియా). దీనిని షవర్ హోస్(స్నానాల గదిలో వాడే పైపు), రెండు సక్షన్ కప్(గోడకు పట్టి ఉండే పరికరం)లను ఉపయోగించి తయారు చేశారు. జలగలు కొండలు, ఇతరత్రా ఎక్కేటప్పుడు వాటి శరీరంలో ఉండే సక్షన్ కప్‌లు ఉపయోగపడతాయని తాము గుర్తించామని అన్నారు. ఈ రెండింటితోపాటు మరికొన్ని పరికరాలను ఉపయోగించి దీనిని తయారు చేశామని వివరించారు. మృదువుగా, సౌకర్యవంతంగా ఉంటూ ఎలాంటి గోడలను అయిన ఎక్కగలిగే ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో ఇదేనని వెల్లడించారు. ఈ వివరాలు సాఫ్ట్ రోబోటిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
వారం రోజులుగా ముక్కులోనే జలగ
-
వైరల్ : ముక్కులో జలగ
బీజింగ్ : చైనాకు చెందిన ఓ వ్యక్తి ముక్కు నుంచి వారం రోజులుగా తరచు రక్తం కారుతుండటంతో ఆస్పత్రికి వెళ్లాడు. అతని సమస్య విని ఆశ్చర్యం వ్యక్తం చేసిన డాక్టర్‌కు అలా జరగడానికి గల కారణం అంతుపట్టలేదు. కొన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అతని ముక్కు కుడి వైపు రంధ్రంలో రక్తం పీల్చే జలగ ఉందని గుర్తించి షాక్ తిన్నాడు. అందువల్లే ముక్కు నుంచి రక్తం కారుతుందని నిర్ధారణకు వచ్చిన డాక్టర్.. అతని ముక్కులో నుంచి జలగను బయటకు తీశాడు. అది అప్పటికి ప్రాణాలతోనే ఉంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంత పెద్ద జలగ ముక్కులో దూరిన అతనికి తెలియకపోవడం కాసింత ఆశ్చర్యం గొలిపే అంశమే. ముక్కు నుంచి రక్తం కారడాన్ని మొదట తేలికగా తీసుకున్న అతను తన భార్య ముక్కులో ఏదో చూశానని చెప్పడంతోనే ఆస్పత్రికి వెళ్లడాని సమాచారం. -
పరి పరిశోధన
ఆవిరి స్నానంతో గుండెపోటు అవకాశాలు తగ్గుముఖం! వారంలో కనీసం ఒకసారి వేడి నీటి ఆవిరి (సానా)తో సాన్నం చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం జరిపిన అధ్యయనం స్పష్టం చేసింది. వారానికి నాలుగు నుంచి ఏడుసార్లు ఆవిరి స్నానం చేస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు 61 శాతం వరకూ తగ్గుతాయని ‘న్యూరాలజీ’లో ప్రచురితమైన అధ్యయనం చెబుతోంది. ఈస్టర్న్ ఫిన్‌ల్యాండ్, లీచెస్టర్, ఎమోరీ, కేంబ్రిడ్జి, ఇన్స్బ్రక్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు 53–74 మధ్య వయస్కులపై ఈ అధ్యయనం చేశారు. ఫిన్లాండ్ తూర్పు ప్రాంతంలో ఉండే వీరికి ఆవిరి స్నానం బాగా అలవాటు. వారానికి ఒకసారి చేసేవారిని ఒక గుంపుగా, రెండు మూడు సార్లు చేసేవారిని రెండో గుంపుగా, ప్రతిరోజూ చేసేవారిని మూడో గుంపుగా చేసి వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ వచ్చారు. దాదాపు 15 ఏళ్ల తరువాత గుండెపోటుకు దారితీసే అన్ని ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. ఎక్కువసార్లు ఆవిరి స్నానం చేసేవారికి ఈ ప్రమాదం చాలా తక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. గుండెపోటు మాత్రమే కాకుండా ఆవిరి స్నానం ద్వారా గుండెజబ్బులతో మరణించే అవకాశం కూడా బాగా తగ్గుతుందని తమ అధ్యయనం ద్వారా తెలిసిందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సెటోర్ కునుట్సోర్ తెలిపారు. రక్తపోటును తగ్గించడంతో పాటు, రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం, నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపడం వంటి లాభాలు ఉన్నాయని వివరించారు. జలగలు చెప్పే సౌరశక్తి ముచ్చట్లు... జలగలకు, సౌరశక్తికి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక ప్రత్యేక జాతికి చెందిన జలగలు.. నీటిలో పెరిగే నాచు మొక్కలను తినేసి.. వాటితోనే మొక్కల్లో మాదిరిగా కిరణజన్య సంయోగక్రియ జరుపుకుని బతికేస్తున్నాయి అని మెయిన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకోలా చెప్పాలంటే.. మొక్క మాదిరిగా ఓ జంతువు సూర్యుడి నుంచి శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేసుకుంటోందన్నమాట. అయితే ఏంటి అంటున్నారా! చాలానే ఉంది. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో మొక్కల అవసరం కూడా లేకుండా ఇంధనం.. తద్వారా విద్యుత్తును తయారు చేసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందంటున్నారు దేబాశిష్ భట్టాచార్య. కెనడాతో పాటు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ఎలీసియా క్లోరోటికా రకం జలగ పచ్చగా ఉంటుంది. దాదాపు రెండు అంగుళాల వరకు పెరుగుతుంది. నీటిలో ఉండే సూక్ష్మస్థాయి మొక్కలైన నాచును ఆహారంగా తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అది నాచు మొక్కల్లోని కణాలను శరీరంలోకి జొప్పించుకుంటుందన్నమాట. ఆ తరువాత సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఈ కణాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసుకుని ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు బతికేస్తుంది. ఇదెలా జరుగుతోందో తెలసుకోగలిగితే కృత్రిమ ఇంధన తయారీ సులువు అవుతుందని అంచనా. -
బతికున్న జలగలను నమిలి తినేశాడు!
బతికున్న జలగలను ఓ వ్యక్తి నమిలి తినేశాడు. దాదాపు 6 నుంచి 7 అంగుళాల పొడవు ఉన్న పెద్ద జలగలను సాస్ లో ముంచుకుని అవి కదులుతుండగానే నమిలి తినేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చైనాకు ఓ చెందిన వ్యక్తి స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు ఈ సాహసం చేసినట్లు తెలుస్తోంది. వాటిని నములుతున్న సమయంలో అతను జలగల రుచి చాలా బాగుంది అంటూ కామెంట్ కూడా చేశాడు. చైనీయులు అన్ని రకాల ఆహారాలను తీసుకుంటారు. అయితే జలగలను ఓ మనిషి తినడమనేది సాధ్యమేనా అనిపిస్తుంది. ఎందుకంటే జలగలు రక్తం తాగి జీవిస్తాయి. ఒకే ఒక జాతికి చెందిన జలగలు మాత్రమే రక్తాన్ని తమ ఆహారంగా తీసుకుంటాయి. జలగల్లో కొన్ని జాతులు రక్తాన్ని ఆహారంగా తీసుకోవు. ఉత్తర అమెరికాలో రక్తాన్ని ఆహారంగా తీసుకోని జలగల జాతులు అగుపిస్తాయి. ఒక్క అంటార్కిటికా ఖండంలో తప్ప ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో జలగల జాతులు ఉన్నాయి. కొన్ని జాతుల జలగలను వైద్యరంగంలో వినియోగిస్తున్నారు. అవసరమైనప్పుడు జలగలను ఉపయోగించి వాటి ద్వారా మనిషి శరీర భాగంలో కావలసిన చోటు నుంచి చెడు రక్తాన్ని పీల్చేలా చేస్తారు. జలగలు 18 అంగుళాల వరకూ పెరుగుతాయి. వీటి జీవనకాలం 20 సంవత్సరాలు. జలగలు కుటుంబాలుగా జీవిస్తాయి. ఒక జలగ గుడ్లు పెడితే ఆ కుటుంబం మొత్తం తమ శరీరాలతో వాటికి ఎలాంటి వ్యాధులు సోకకుండా కాపాడుకుంటాయి. చైనాలో ఉండే కాంటోనీస్ క్యూజీన్ లలో అన్ని రకాల తినే ఆహారాలు లభ్యమవుతాయి. వీటిలో బొద్దింకలు తదితర కీటకాల ఆహారాలు కూడా ఉంటాయి. -
బతికున్న జలగలను నమిలి తినేశాడు!