బూతు బొమ్మల జాడ చెబుతున్న కుక్క | This dog can sniff out porn material | Sakshi
Sakshi News home page

బూతు బొమ్మల జాడ చెబుతున్న కుక్క

Published Thu, Jul 10 2014 3:11 PM | Last Updated on Tue, Sep 18 2018 7:52 PM

బూతు బొమ్మల జాడ చెబుతున్న కుక్క - Sakshi

బూతు బొమ్మల జాడ చెబుతున్న కుక్క

న్యూయార్క్: ఇంటర్‌నెట్‌లో బూతు బొమ్మలు చూసేవారి భరతం పడుతోంది ఓ కుక్క. ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజం. వాసన చూసి బూతు బొమ్మల జాడ చెప్పేస్తోంది. అమెరికాలోని రోడె ఐలాండ్ లో బాలలపై నేరాల నిరోధానికి ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కు సహాయపడుతూ ప్రత్యేకత చాటుకుంటోందీ గోల్డెన్ లాబ్రడర్ శునకం. దీని పేరు థోరియో.

అశ్లీల చిత్రాలతో కూడిన హార్డ్ డ్రైవ్, థంబ్ డ్రైవ్, ఇతర కంప్యూటర్ భాగాలను వాసన చూసి పసిగట్టేస్తుందని టాస్క్ఫోర్స్ డిటెక్టివ్ ఆడమ్ హూస్టన్ తెలిపారు. ఇంటర్‌నెట్‌లో పిల్లలకు సంబంధించిన బూతు బొమ్మలు, వీడియోలు చూసేవారిని కూడా థోరియో గుర్తుపడుతుందని వెల్లడించారు. ఇందుకోసం దీనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. థంబ్ డ్రైవ్ లో పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు నింపుకుని వెళుతున్న ఓ వ్యక్తిని థోరియో ఇప్పటికే అధికారులకు పట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement