
ఓపెనింగ్ వీకెండ్ వసూళ్లలో దుమ్మురేపింది!
ముంబై: వరుణ్ ధావన్, అలియా భట్ జోడీ మరోసారి దుమ్మురేపింది. 'హంప్టీ శర్మ కి దుల్హనియా' సినిమాతో గతంలో విజయాన్నందుకున్న ఈ జోడీ.. తాజాగా 'బద్రినాథ్‌కి దుల్హనియా'తోనూ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసింది. పాజిటివ్ టాక్, రివ్యూలు తెచ్చుకున్న ఈ సినిమా తొలివారం భారీ వసూళ్లు సాధించింది.
బాక్సాఫీస్‌ఇండియా.కామ్ ప్రకారం.. ఈ సినిమా తొలి మూడురోజుల్లో రూ. 42 కోట్లు వసూలు చేసింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 12 కోట్లు వసూలు చేయగా.. రెండోరోజు 14.25 కోట్లు రాబట్టింది. మూడోరోజు ఆదివారం వసూళ్లు మరింత పెరిగి రూ. 15.75 కోట్లు తన ఖాతాలో వేసుకొంది. సోమవారం హోలీ పండుగ సెలవు కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ ఇటు విమర్శకుల నుంచి, అటు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో 'బద్రినాథ్..' వసూళ్లలో మరింత దూసుకుపోయే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.