ముగ్గురు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరిక | Three NCP MLAs join BJP in Nagaland | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరిక

Published Tue, Jun 17 2014 8:11 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ముగ్గురు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరిక - Sakshi

ముగ్గురు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరిక

 కొహిమా: నాగాలాండ్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరారు. బిజెపిలో చేరినవారిలో ఎన్సీపి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు  ఇంతిలేంబా సంగ్తమ్ కూడా ఉండటం విశేషం. సంగ్తమ్తోపాటు  మాజీ మంత్రి  డాక్టర్ టీఎం లోథా, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన హోన్లూమో కికోన్‌లు బీజేపీలో చేరారు.


బీజేపీ భాగస్వామిగా ఉన్న ఎన్‌పీఎఫ్ నేతత్వంలోని డమోక్రటిక్ అలయల్స్ ఆఫ్ నాగాలాండ్(డీఏఎన్) ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికే తాము పార్టీ మారినట్లు  సంగ్తమ్ చెప్పారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడినందున, కేంద్రం సహకారంతో రాష్ట్రం అభివృద్దిపరచుకునేందుకు తాము పార్టీ మారినట్లు డాక్టర్ లోథా చెప్పారు. ఎన్సీపీ నుంచి వీరు వెళ్లిపోవడంతో అసెంబ్లీలో ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగలగా,  ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న బీజేపీ బలం నలుగురికి పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement