కరెన్సీ నోట్ల ' విసిరివేత' దుమారం!
హుబ్లీ:స్వాత్వంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పట్టణ మున్సిపల్ కౌన్సిల్ (టీఎంసీ) ప్రతినిధి కరెన్సీ నోట్లను విసిరి వివాదాలకు తెరలేపాడు. కర్ణాటకలోని నిన్న చోటు చేసుకున్న ఈ ఘటన స్థానిక మీడియాలో కలకలం సృష్టించింది. రాష్ట్రంలోని బాన్కాపూర్ పట్టణ మున్సిపల్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నఇస్లామయిల్ సాబ్ దుద్ మానీ విద్యార్థులపైకి నోట్లను విసిరి వివాదంలో చిక్కుకున్నాడు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా టీఎంసీ (టౌన్ మున్సిపల్ కౌన్సిల్) నిర్వహించిన కార్యక్రమంలో చోటు చేసుకున్నఈ పరిణామం రాజకీయ వివాదాలకు దారి తీసింది. విద్యార్థులు స్వదేశీ క్షేమం కోరుతూ స్టేజ్ పై హిందీలో చేసిన నృత్యానికి గాను ఇస్లామాయిల్ రూ.10 , రూ.20 నోట్లను వారి మీదకు విసిరాడు. దీంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
ఒక అధికార ప్రతినిధిగా ఉండి కూడా అతను అహంకారపూరిత ధోరణితో వ్యవహరించాడంటూ బీజేపీ కార్యకర్తలు టీఎంసీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాయి. ఇటువంటి ఘటనలు విద్యార్థులనే కాకుండా, దేశాన్ని కూడా కించపరచినట్లేనని వారు పేర్కొన్నారు.అతనిపై జాతి వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.