ఔరా! తాగొచ్చిన భర్త కళ్లకు ఫెవిక్విక్..
ఆమె భర్త నిత్యం తాగొచ్చి గొడవ పడేవాడు. ఆ తాగుబోతు భర్తతో ఆమె వేగలేకపోయింది. అతనికి బుద్ధిచెప్పాలనుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఇంతలోనే భర్త ఎప్పటిలాగే తాగొచ్చి గొడవకు దిగాడు. విసుగు చెందిన ఆమె అతడు నిద్రపోయింది చూసి.. కళ్లకు 'ఫెవిక్విక్' గమ్ (జిగురు) పెట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో జరిగింది.
సంతోష్ విశ్వకర్మ నిత్యం తాగొచ్చి భార్యతో గొడవ పెట్టుకునేవాడు. దీంతో అతనికి బుద్ధి చెప్పాలని భార్య విజయలక్ష్మి సంకల్పించింది. తాగొచ్చి నిద్రపోతున్న భర్త కళ్లకు ఫెవిక్విక్ గమ్ పెట్టింది. సంతోష్ ఉదయం నిద్రం లేచి భార్యను పిలిచాడు. భార్య అప్పటికే ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా సంతోష్ కళ్లు తెరుచుకోలేదు. కళ్లపై నీళ్లు చల్లినా లాభం లేకపోవడంతో పొరుగువారి సహాయంతో వైద్యుల దగ్గరికి వెళ్లాడు. కంటి వైద్యులు కాస్తా వేడిచేయడం ద్వారా ముసుకుపోయిన కనురెప్పలు తెరుచుకునేలా చేశారు. ఇప్పుడు బాగానే కళ్లు కనిపిస్తున్న సంతోష్.. భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో విచారిస్తున్నాడు.