మావోయిస్టు అగ్రనేత అరెస్టు.. భార్య కూడా
తిరువనంతపురం: మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. కేరళలో మావోయిస్టు అగ్రనేతగా పనిచేస్తున్న రూపేశ్ అలియాస్ మీసాల రాజిరెడ్డి, అలియాస్ మల్లా రాజిరెడ్డి, ఆయన భార్యతోపాటు మరో ఐదుగురుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమిళనాడులోని కొయంబత్తూరులో అరెస్టు చేశారు. న్యాయవిద్యను పూర్తి చేసిన రూపేశ్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఈ వివరాలు కేరళ హోంమంత్రి రమేశ్ చెన్నితాలా తెలియజేస్తూ మావోయిస్టులను అణిచివేసే చర్యల్లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు పోలీసులు నిర్వహించిన గాలింపు చర్యల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తమిళనాడులో రూపేశ్ పట్టుబడ్డాడు.
కేరళలోని వయనాడ్, పాలక్కడ్ జిల్లాల్లో జరిగిన దాడులకు ఇతడే సూత్రదారి అని చెప్పారు. మొత్తం ఈయనపై 24 కేసులు ఉన్నాయి. వ్యూహాత్మక దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించడంలో రూపేశ్ మేటి. ఆంధ్రప్రదేశ్లో అరెస్టయిన వీరిని కేరళకు తరలించనున్నారు. కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన రూపేశ్ (రాజిరెడ్డి గతంలో అరెస్ట్ అయ్యి బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.