ఇండియన్ అమెరికన్లకు కీలక పదవులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు భారతీయ అమెరికన్లను కీలక పదవులకు నామినేట్ చేశారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కోఆర్డినేటర్‌గా విశాల్ అమీన్‌ను, ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్(ఓఆర్‌ఐఏ) అడ్మినిస్ట్రేటర్‌గా నియోమి రావును నామినేట్ ఎంపికచేశారు.
విశాల్ అమీన్ ప్రస్తుతం హౌస్ జ్యుడీషియరీ కమిటీలో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ హయాంలో డొమెస్టిక్ పాలసీ అసోసియేట్ డైరెక్టర్‌గానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ నుంచి న్యూరోసైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి న్యాయ పట్టా తీసుకున్నారు.
ఇక ఓఆర్‌ఐఏ అడ్మినిస్ర్టేటర్‌గా నామినేట్ అయిన నియోమి రావు.. జార్జ్ మాసన్ యూనివర్సిటీలో రావు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జార్జి డబ్ల్యూ బుష్ హయాంలో కూడా ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. ఓఆర్‌ఐఏ.. ఫెడరల్ ఏజెన్సీల నిర్ణయాలను సమీక్షించే కీలక సంస్థ కావడం గమనార్హం. అధ్యక్షుడి లక్ష్యాలకు అనుగుణంగా లేని నిర్ణయాలను రద్దు చేసే అధికారం కూడా ఈ సంస్థకు ఉంటుంది.