
ఉగ్రవాదిని పట్టుకున్న బీఎస్ఎఫ్
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో ఉదంపూర్ ఉగ్రవాద దాడి ఘటనలో సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్), ఆర్మీ ఓ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుంది. బీఎస్ఎఫ్ తో పాటు ఆర్మీ రంగంలోకి దిగి ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న ముగ్గురిని రక్షించారు.
ఈ రోజు ఉదయం ఉదంపూర్ సమీపంలో జమ్ము-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. దాడి నేపథ్యంలో భద్రత చర్యలను పర్యవేక్షించేందుకు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ డీకే పాఠక్ జమ్మూకు వెళ్లారు. పాఠక్ ఉదంపూర్ వెళ్లనున్నట్టు అధికారులు చెప్పారు. ఆయన అమర్నాథ్ యాత్ర భద్రత ఏర్పాట్లను సమీక్షించనున్నట్టు సమాచారం.