ఆస్పత్రిలో కాల్పులు.. ఒకరి మృతి
మధ్యప్రదేశ్లోని బింద్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని తుపాకితో కాల్చి చంపాడు. కాల్చిన వ్యక్తి నిక్కరు, బనీను ధరించి బక్క పలచగా ఉండగా.. కాల్పులకు గురైన వ్యక్తి టీషర్టు, జీన్సు ప్యాంటు ధరించి కాస్త బొద్దుగా ఉన్నాడు. అతడి బారి నుంచి తప్పించుకోడానికి పరిగెడుతూ ఆస్పత్రిలోకి వచ్చి, అద్దాల తలుపుల వెనక్కి వెళ్లగా ముందు అద్దంలోంచి గుండెల మీద కాల్చాడు.
దాంతో జీన్సు ప్యాంటు వ్యక్తి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ముందు వెనక్కి వెళ్లిపోయిన ఆగంతకుడు.. అనుమానంతో మళ్లీ వచ్చి, మరోసారి తలుపులు తెరిచి, వీపు మీద మరో రౌండు తుపాకితో కాల్చాడు. అతడు చనిపోయిన విషయాన్ని అప్పుడు నిర్ధారించుకుని పారిపోయాడు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.