one person dies
-
నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి
పరవాడ (పెందుర్తి): కారు యజమాని, అతని వద్ద పనిచేసే ఓ బాలుడి నిర్లక్ష్యంతో నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. తనమానాన తను రోడ్డు పక్కన నిల్చున్నప్పటికీ మృత్యుదేవత కనికరించలేదు. తానాం గ్రామంలో సంభవించిన ఈ దుర్ఘటనలో ఫార్మాసిటీలో పనిచేస్తున్న కార్మికుడు బొమ్మళి రామారావు(39) దుర్మరణం పాలయ్యాడు. మృతుని స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం మూలస్వాలాపురం గ్రామంగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి పరవాడ సీఐ పి.పైడిపునాయుడు తెలిపిన వివరాల ప్రకారం... తానాం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ ఆర్.సన్యాసిరావు వద్ద బడాని శ్రీనివాసరావు అనే బాలుడు సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 7.27 గంటలకు తన యజమానికి చెందిన కారు శుభ్రం చేశాడు. అనంతరం పూర్తిస్థాయిలో డ్రైవింగ్ రాకపోయినప్పటికీ కారును వేరోచోట పార్కింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయి సమీపంలోని జామ చెట్టును ఢీకొట్టి వేళ్లతో సహా పెకిలించింది. అనంతరం ఎదురుగా రోడ్డు పక్కన నిల్చున్న రామారావు అనే కార్మికుడిని బలంగా ఢీకొట్టింది. మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి పాన్ షాపును గుద్దుకుని ఆగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పరవాడ సీఐ పి.పైడిపునాయుడు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకొన్నారు. రామారావు మృతదేహన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన రామారావు ఫార్మాసిటీలోని టోరంటో పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య బిందు, ప్రవల్లిక, భాను అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన రామారావు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కంటతడి పెట్టించింది. రామారావు మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామ పరిధిలో బందరు రోడ్డుపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు ఆశ్రమం కాలువ కట్టకు చెందిన తాపీ కార్మికుడు లింగాల సింహాచలం(26) మోపెడ్‌పై పోరంకి నుంచి పెనమలూరు సెంటర్‌కు బయలుదేరాడు. పచ్చళ్ల కంపెనీ వద్దకు రాగానే వెనుక నుంచి లారీ మోపెడ్‌ను ఓవర్టేక్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి లారీ వెనుక చక్రాల కిందపడ్డాడు. లారీ అతని తలమీదగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్పత్రిలో కాల్పులు.. ఒకరి మృతి
-
ఆస్పత్రిలో కాల్పులు.. ఒకరి మృతి
మధ్యప్రదేశ్‌లోని బింద్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని తుపాకితో కాల్చి చంపాడు. కాల్చిన వ్యక్తి నిక్కరు, బనీను ధరించి బక్క పలచగా ఉండగా.. కాల్పులకు గురైన వ్యక్తి టీషర్టు, జీన్సు ప్యాంటు ధరించి కాస్త బొద్దుగా ఉన్నాడు. అతడి బారి నుంచి తప్పించుకోడానికి పరిగెడుతూ ఆస్పత్రిలోకి వచ్చి, అద్దాల తలుపుల వెనక్కి వెళ్లగా ముందు అద్దంలోంచి గుండెల మీద కాల్చాడు. దాంతో జీన్సు ప్యాంటు వ్యక్తి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ముందు వెనక్కి వెళ్లిపోయిన ఆగంతకుడు.. అనుమానంతో మళ్లీ వచ్చి, మరోసారి తలుపులు తెరిచి, వీపు మీద మరో రౌండు తుపాకితో కాల్చాడు. అతడు చనిపోయిన విషయాన్ని అప్పుడు నిర్ధారించుకుని పారిపోయాడు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.