అఖిలేశ్ సంచలన నిర్ణయం
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రివర్గంలోని ఏకంగా 8 మంది మంత్రులపై వేటు వేశారు. 8 మంది మంత్రులను తొలగించారు. ఉద్వాసనకు గురైన వారిలో ఐదుగురు మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులు ఉన్నారు. అయితే మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో భాగంగానే వీరిని తొలగించినట్టు తెలుస్తోంది. వీరి స్థానంలో కొత్త మంత్రులను నియమించే అవకాశముంది. ఈనెల 31న కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ ఉంటుందని, కొత్తవాళ్లను మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి.
తన పాలనపై అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో దిద్దుబాట చర్యల్లో భాగంగా అఖిలేశ్ మంత్రులను తొలగించినట్టు తెలుస్తోంది. స్వయంగా తన తండ్రే తరచూ విమర్శలు చేయడం అఖిలేశ్ కు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో పనిచేయని మంత్రులను తొలగించి కేబినెట్ ను ప్రక్షాళన చేసేందుకు అఖిలేశ్ ఉపక్రమించినట్టు కనబడుతోంది.