రాజస్థాన్ ప్రజలకు థ్యాంక్స్: రాజే | Vasundhara Raje set to become Rajasthan CM, thanks people | Sakshi
Sakshi News home page

రాజస్థాన్ ప్రజలకు థ్యాంక్స్: రాజే

Published Sun, Dec 8 2013 11:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

రాజస్థాన్ ప్రజలకు థ్యాంక్స్: రాజే

రాజస్థాన్ ప్రజలకు థ్యాంక్స్: రాజే

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే అధిష్టించనున్నారు. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో కమలం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తమ పార్టీ భారీ విజయం సాధించడం పట్ల రాజే హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. తమ పార్టీ ప్రజలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఈ ఫలితాలు 2014 లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని అన్నారు. రాజస్థాన్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రబావం బాగా పనిచేసిందని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement