జియో ఎఫెక్ట్: వోడాఫోన్ 'డబుల్ ధమాకా' | Vodafone halves pre-paid 4G mobile broadband price | Sakshi
Sakshi News home page

జియో ఎఫెక్ట్: వోడాఫోన్ 'డబుల్ ధమాకా'

Published Thu, Dec 8 2016 10:46 AM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM

Vodafone halves pre-paid 4G mobile broadband price

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో   ఉచిత సేవలు మార్చి 2017 వరకు పొడిగించడంతో దేశీయ  టెలికం కంపెనీలు కూడా దిగి వస్తున్నాయి. తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు గాను ఆఫర్లను సమీక్షించుకుంటూ , కొత్త ఆఫర్లను  అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో్  ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్   ముందుగా మేల్కోగా తాజాగా  ఈ ఉచిత సేవలను మరో  టెలికాం ఆపరేటర్  వోడాఫోన్  బుధవారం ప్రకటించింది. జియో ఎఫెక్ట్ తో  'డబుల్ డాటా' ను ప్లాన్ ను వెల్లడించింది. రూ.255 పైన అందుబాటులో ఉన్న అన్ని ప్లాన్ పై ఉన్న 4జీ డాటాపై  డబుల్ డాటా ను  ఉచితంగా అందిస్తోంది. తద్వారా 50 శాతం ధరలు తగ్గించింది.   
ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి:
రూ.255 రీ చార్జ్ పై 2 జీబీ 4జీ డాటా అందిస్తోంది.  ఇప్పటివరకు 1 జీబీ మాత్రమే.  అలాగే రూ.459 రీ చార్జ్ పై 6 జీబీ 4జీ డాటా,
రూ.559 రీ చార్జ్ పై 8 జీబీ 4జీ డాటా, రూ. 999  ప్లాన్ లో  20 జీబీ, రూ. 1999 ప్లాన్ లో  40 జీబీ అందుబాటులోకి తీసుకొంచ్చింది. ఈ ప్లాన్  లు అన్నింటికి  28 రోజుల వాలిడిటీ ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పధకాల్లో  వోడాఫోన్ 4జీ ప్రీపెయిడ్ వినియోగదార్లకు డబుల్ డేటా ప్రయోజనాలను అందిస్తున్నట్టు ప్రకటించింది. వోడాఫోన్ వినియోగదారులకు  మెరుగైన మొబైల్ ఇంటర్నెట్ అనుభవాన్ని అందించేందుకు ఈ ఆఫర్  తీసుకొచ్చినట్టు  వోడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది.  సూపర్ నెట్ 4 జీ   అనుభవం తమ  కసమర్లకు అందించనున్నామనే విశ్వాసాన్ని ఢిల్లీ-ఎన్సీఆర్  బిజినెస్ హెడ్, అపూర్వ మెహ్రోత్రాపై వ్యక్తం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement