
వసీం అక్రమ్(ఫైల్)
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు.
కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కరాచీలోని నేషనల్ స్టేడియం సమీపంలో గుర్తుతెలియని దుండగులు ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఈ దాడి నుంచి వసీం అక్రమ్ సురక్షితంగా బయటపడ్డాడు.
దాడి గురించి పోలీసు హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కర్సాజ్ రోడ్డులో తన కారుపై కాల్పులు జరిపినట్టు అక్రమ్ తెలిపాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.