ధర్నా చౌక్.. జేఏసీదే విజయం
- నేటి అనుమతితో డిమాండ్ సాధించుకున్నట్లే: కోదండరాం
హైదరాబాద్: ధర్నా చౌక్ విషయంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, విపక్ష పార్టీలు విజయం సాధించినట్లేనని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ‘ఆక్యుపై ధర్నా చౌక్’ కార్యక్రమం ముగింపు సంర్భంగా సోమవారం సాయంత్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. ధర్నా చౌక్ కొనసాగింపు కోసం జరిగిన ఉద్యమంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
‘ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌ను కొనసాగించండి.. నిరసన హక్కును కాపాడండి’ అనే నినాదంతో తాము చేసిన పోరాటంలో అన్ని వర్గాలూ పాల్గొన్నారని కోదండరామ్ చెప్పారు. ‘ధర్నాచౌక్ తరలింపు విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. ఎందుకు కొనసాగించకూడదు? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానం చెప్పలేకపోతోంది. గవర్నర్, హోం మంత్రి సహా చాలా మందిని కలిసినా సమాధానం మాత్రం రాలేదు. అయితే సోమవారం ఇందిరాపార్క్ వద్ద టెంట్లు, కుర్చీలు ఏర్పాటుచేసిమరీ పోలీసులు ధర్నాకు అనుమతించారు. దాని అర్థం మేం విజయం సాధించినట్లే. ధర్నా చౌక్ అక్కడే ఉండాలన్న మా డిమాండ్ నెరవేరినట్లే’ అని కోదండరామ్ అన్నారు.
(టీఆర్‌ఎస్‌పై కోపం.. కుర్చీలపై ప్రతాపం!)
(ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత)