‘సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం’
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని లోక్ సభ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే ఎంపీ ఎం తంబిదురై తెలిపారు. తమ నాయకురాలు శశికళ జైలుకెళ్లే పరిస్థితి రావడంతో ఆమె స్థానంలో పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని చెప్పారు.
శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకేలో చోటు లేదని స్పష్టం చేశారు. శశికళపై అలకబూని ఢిల్లీకే పరిమితమైన తంబిదురై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మళ్లీ వెలుగులోకి వచ్చారు. పన్నీర్ సెల్వం స్థానంలో తనకు పార్టీ కోశాధికారి పదవి ఇవ్వకపోవడంతో శశికళపై ఆయన అలిగినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఆయన హస్తినకే పరిమితమయ్యారు.