న్యూఢిల్లీ: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి జీతభత్యాల వివరాలను అతడి భార్య కోరితే వెల్లడించాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. అంతేకాదు.. సమాచారహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులందరి జీతభత్యాల వివరాలను సంబంధిత కార్యాలయాలు బహిర్గతం చేయాల్సిందేనని పేర్కొంది.
ఢిల్లీ హోంశాఖలో పనిచేసే ఓ అధికారి భార్య తన భర్త వేతన ధ్రువపత్రాన్ని ఇవ్వాల్సిందిగా కోరగా.. అధికారులు తిరస్కరించారు. దాంతో ఆమె సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్.. ‘‘దంపతుల్లో ఎవరికైనా మరొకరి జీతభత్యాల వివరాలు తెలుసుకొనే హక్కు ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి వేతన వివరాలను అతడి భార్య అడిగితే అందజేయాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగుల వేతన వివరాలను వారి వ్యక్తిగత సమాచారంగా పేర్కొనలేం’’ అని స్పష్టం చేశారు.
జీతమెంతో భార్యకు చెప్పాల్సిందే
Published Mon, Jan 20 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement
Advertisement