కాలక్షేపానికి ఆమె నిరాకరించడంతో...
తైలోక్యనాథ మిశ్రా కుటుంబానికి నోటీసులు
కోడలు ఫిర్యాదు మేరకు పోలీసుల నిర్ణయం
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కుటుంబీకులకు నగర కమిషనరేటు పోలీసులు శుక్రవారం నోటీసు జారీ చేశారు. త్రైలోక్యనాథ మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ మేరకు నిర్ణయించారు. త్రైలోక్యనాథ మిశ్రా కుటుంబీకుల ఆచూకీ లభించనందున వారి ఇంటి గోడకు నోటీసు అంటించినట్టు నగర పోలీసు డిప్యూటీ కమిషనరు సత్యబ్రొతొ భొయి తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు అత్తింటి వారి నుంచి ప్రాణ భయం ఉన్నట్టు బాధిత వివాహిత మహిళ లోపముద్ర మిశ్రా చేసిన అభ్యర్థన మేరకు ఆమె భద్రత కోసం హోమ్ గార్డుల్ని నియమించారు. అత్తింట్లో ఆమె ఎదుర్కొన్న వేధింపులపై ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను అత్తింటి వారు బెదిరించారు. ఈ మేరకు స్థానిక బర్‌గడ్ పోలీసు ఠాణాలో బుధవారం ఉదయం ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. ఆమె కుమారుని అపహరిస్తామని హెచ్చరించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ హెచ్చరిక వెనుక అత్త, మామల హస్తం ఉన్నట్టు వివరించారు. పెళ్లయిన తొలి రోజుల నుంచి భర్త వేధింపులకు గురిచేస్తున్నారని, భర్త వేధింపులకు అత్త, మామ పరోక్షంగా కొమ్ముకాసి తన సహనానికి పరీక్ష పెట్టినట్టు ఆరోపించారు. హానీ మూన్ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో వైఫ్ స్వాపింగ్(భార్యల బదిలీ) కాలక్షేపానికి ఆమె నిరాకరించడంతో భర్త వేధింపులు ప్రారంభమైనట్టు తెలిపారు. 2006 సంవత్సరం జనవరి నెల 27వ తేదీన త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో వివాహం జరిగిందని పేర్కొన్నారు.