Trailokya Mishra
-
'వైఫ్ స్వాపింగ్' కేసులో దంపతులకు ఊరట
భువనేశ్వర్: ఒడిశాలో ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్య మిశ్రా దంపతులు, ఆయన కుమారుడిని ఈ నెల 29 వరకు అరెస్టు చేయవద్దని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అత్తింటి వారు వేధిస్తున్నారని త్రైలోక్య మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. అత్త, మామలు, భర్త అరెస్టులో జాప్యం చేస్తే తనకు, తన బిడ్డకు ప్రాణాపాయం ముంచుకు వస్తుందని బాధితురాలు పోలీసులకు తెలిపారు. కాగా, పారిశ్రామికవేత్త త్రైలోక్య మిశ్రా దంపతులు, ఆయన కుమారుడిని ఈనెల 29 వరకు అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోగా కోర్టులో పోలీసులు కేసు డైరీ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పెళ్లయిన తొలి రోజుల నుంచి భర్త వేధింపులకు గురిచేస్తున్నారని, భర్త వేధింపులకు అత్త, మామ పరోక్షంగా కొమ్ముకాసి తన సహనానికి పరీక్ష పెట్టినట్టు లోపముద్ర మిశ్రా అంతకుముందు ఆరోపించారు. హానీ మూన్ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో వైఫ్ స్వాపింగ్(భార్యల బదిలీ) కాలక్షేపానికి ఆమె నిరాకరించడంతో భర్త వేధింపులు ప్రారంభమైనట్టు తెలిపారు. 2006 సంవత్సరం జనవరి నెల 27వ తేదీన త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో వివాహం జరిగిందని పేర్కొన్నారు. -
కాలక్షేపానికి ఆమె నిరాకరించడంతో...
తైలోక్యనాథ మిశ్రా కుటుంబానికి నోటీసులు కోడలు ఫిర్యాదు మేరకు పోలీసుల నిర్ణయం భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కుటుంబీకులకు నగర కమిషనరేటు పోలీసులు శుక్రవారం నోటీసు జారీ చేశారు. త్రైలోక్యనాథ మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ మేరకు నిర్ణయించారు. త్రైలోక్యనాథ మిశ్రా కుటుంబీకుల ఆచూకీ లభించనందున వారి ఇంటి గోడకు నోటీసు అంటించినట్టు నగర పోలీసు డిప్యూటీ కమిషనరు సత్యబ్రొతొ భొయి తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు అత్తింటి వారి నుంచి ప్రాణ భయం ఉన్నట్టు బాధిత వివాహిత మహిళ లోపముద్ర మిశ్రా చేసిన అభ్యర్థన మేరకు ఆమె భద్రత కోసం హోమ్ గార్డుల్ని నియమించారు. అత్తింట్లో ఆమె ఎదుర్కొన్న వేధింపులపై ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను అత్తింటి వారు బెదిరించారు. ఈ మేరకు స్థానిక బర్గడ్ పోలీసు ఠాణాలో బుధవారం ఉదయం ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. ఆమె కుమారుని అపహరిస్తామని హెచ్చరించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ హెచ్చరిక వెనుక అత్త, మామల హస్తం ఉన్నట్టు వివరించారు. పెళ్లయిన తొలి రోజుల నుంచి భర్త వేధింపులకు గురిచేస్తున్నారని, భర్త వేధింపులకు అత్త, మామ పరోక్షంగా కొమ్ముకాసి తన సహనానికి పరీక్ష పెట్టినట్టు ఆరోపించారు. హానీ మూన్ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో వైఫ్ స్వాపింగ్(భార్యల బదిలీ) కాలక్షేపానికి ఆమె నిరాకరించడంతో భర్త వేధింపులు ప్రారంభమైనట్టు తెలిపారు. 2006 సంవత్సరం జనవరి నెల 27వ తేదీన త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో వివాహం జరిగిందని పేర్కొన్నారు. -
'వైఫ్ స్వాపింగ్' ఒప్పుకోనందుకు..!
అత్తింటి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు బాధితురాలు ప్రముఖ వ్యాపారవేత్త త్రైలోక్య నాథ మిశ్రా కోడలు భువనేశ్వర్: అత్తింటి వారి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా పోలీసులను ఆశ్రయించారు. మంగళ వారం రాత్రి తన ప్రాణానికి ముప్పు ఉందని బెదిరించారని స్థానిక బర్గడ్ పోలీసు ఠాణాలో బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని అపహరిస్తామని అత్త, మామ బెదిరించారని పేర్కొన్నారు. పెళ్లయిన కొత్తలో హానీ మూన్ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ వైఫ్ స్వాపింగ్ (భార్యల బదిలీ) కాలక్షేపానికి ఆమె నిరాకరించడంతో వైవాహిక జీవితం తొలి దశలోనే తనపట్ల భర్త అమానుషంగా వ్యవహరించినట్లు ఆలస్యంగా వెలుగులోకి తెచ్చారు. పెద్దింటి కోడలిగా సమాజంలో గౌరవం కాపాడుకుంటు పుట్టింటికి అగౌరవం కలగకుండా జాగ్రత్తపడేందుకు చాల కాలం ఓపికతో వ్యవహరించడంతో రోజు రోజుకు వేధింపులు తీవ్రంగా మారాయి తప్ప పరిస్థితులు కుదుటపడనట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల కిందట వేధింపుల గురించి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో తనను హత్య చేస్తామని అత్తింటి వారు బెదిరించారని పేర్కొన్నారు. 2006 సంవత్సరం జనవరి నెల 27వ తేదీన పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో ఆమెకి వివాహం జరిగింది. భర్త వేధింపులకు అత్త ఆశా మంజరి మిశ్రా, మామ త్రైలోక్యనాథ మిశ్రా పరోక్షంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించినట్లు బహిరంగపరిచారు. ఈ మేరకు స్థానిక మహిళా ఠాణాలో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. ఫలితం శూన్యం కావడంతో ఈసారి స్థానిక బర్గడ్ ఠాణాలో మరో ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసుల నిర్వీర్యతపట్ల నగర డీసీపీ సత్యబ్రొతొ భొయి స్పందించారు. లోపముద్ర ఆరోపణల నేపథ్యంలో తక్షణమే చర్యలు చేపడతామని ఆయన బుధ వారం మీడియాకు తెలియజేశారు. మహిళా ఠాణా పోలీసుల నిర్వీర్యత ఖాతరు చేయకుండా నగర పోలీసు కమిషనరేటు ఆధ్వర్యంలో కౌన్సిలింగుకు అభ్యర్థించి చేసిన ప్రయత్నాలు కూడ ఫలించనట్లు ఆమె విచారం వ్యక్తం చేశారు.