న్యూఢిల్లీ: తన భర్తకు అక్రమ సంబంధాలున్నాయనే అనుమానంతో ఓ భార్య అఘాయిత్యానికి పాల్పడింది. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఉరేసుకుని చనిపోయింది. గురువారం రాత్రి తర్వాత ఈఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం నీతు, రాహుల్ ఠాకూర్ అనే ఇద్దరు వ్యక్తులు భార్యభర్తలు. వీరికి ఒక ఐదేళ్లపాప, రియాన్ అనే కుమారుడు ఉన్నారు.
గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాహుల్ తన మరో మరదలితో అక్రమ సంబంధం నెరుపుతున్నాడని అనుమానంతో రోజు వారి మధ్య ఘర్షణ అవుతుండేది. రాత్రి రాహుల్ ఠాకుర్, అతడి సోదరుడు వచ్చి చూడగా భార్య, పిల్లలు ప్రాణాలు కోల్పోయి కనిపించారు.
పిల్లలకు విషమిచ్చి ఉరేసుకుంది
Published Fri, May 29 2015 6:25 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement
Advertisement