ఆలయంలో మహిళపై కత్తితో దాడి | woman temple worker attacked with machete, youth arrested | Sakshi
Sakshi News home page

ఆలయంలో మహిళపై కత్తితో దాడి

Published Tue, Oct 18 2016 6:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

ఆలయంలో మహిళపై కత్తితో దాడి

ఆలయంలో మహిళపై కత్తితో దాడి

కర్ణాటకలో దారుణం జరిగింది. ఆలయం ప్రాంగణంలోకి చొరబడిన ఓ ముసుగు వ్యక్తి.. పెద్ద కత్తి తీసుకుని ఆలయ అధికారిణిపై దాడికి తెగబడ్డాడు. ఆమె ప్రాణభయంతో అటూ ఇటూ పరుగులు పెడుతున్నా వదలకుండా వెంటపడి మరీ దాడి చేసేందుకు దూసుకొచ్చాడు. ఈ వ్యవహారం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఎట్టకేలకు కొందరు వ్యక్తులు అతడిని పట్టుకోవడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.

కర్ణాటక రాజధాని బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్‌ నగరంలోని కోటిలింగేశ్వరి ఆలయంలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న కుమారి అనే మహిళపై ఈ దాడి జరిగింది. ఇందులో ఆమె తలకు తీవ్రగాయమైంది. దాడికి పాల్పడిన సంతోష్ (24) అనే యువకుడు కూడా ఇదే ఆలయంలో పనిచేస్తున్నాడు. ఆమె కారిడార్‌లో నిల్చుని ఉండగా వెనకవైపు నుంచి అతడు దాడి చేసినట్లు సీసీటీవీ వీడియోలో కనిపించింది. కుమారితో ఉన్న వ్యక్తిగత వివాదం వల్లే అతడు ఈ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement