షియోమీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్
12 గంటల్లో...21 లక్షల ఫోన్ల అమ్మకాలు
బీజింగ్: తన వెబ్‌సైట్ మీడాట్‌కామ్ ద్వారా 12 గంటల్లో 21 లక్షల ఫోన్లను విక్రయించింది చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ. కంపెనీ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్లాష్ సెల్స్‌లో ఈ రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయి. ఇవి గతేడాది నవంబర్‌లో ఒక రోజులో అలీబాబా విక్రయించిన 18 లక్షల ఫోన్లతో పోలిస్తే అధికం. ఈ ఫ్లాష్ సెల్స్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఇతర వస్తువుల అమ్మకాల ద్వారా షియోమీకి దాదాపు 335 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. గతేడాది షియోమీ దాదాపు 6 కోట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించి, 74.3 బిలియన్ యువాన్‌ల ఆదాయం పొందింది. దీంతో షియోమీ ప్రపంచ మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీగా ఆవిర్భవించింది.
A