fifth anniversary
-
రూ.1,000 కోట్లతో స్టార్టప్ సీడ్ ఫండ్
న్యూఢిల్లీ: వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చే స్టార్టప్‌లకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్రం మరో విడత ప్రత్యేక నిధిని ప్రకటించింది. రూ.1,000 కోట్లతో ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్’ను ఏర్పాటు చేస్తున్నట్టు.. ప్రధాని నరేంద్ర మోదీ ‘స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’ ప్రారంభం సందర్భంగా వెల్లడించారు. 2016లో మోదీ సర్కారు స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ఆరంభించగా.. ఇది ఈ ఏడాదితో ఐదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. స్టార్టప్‌ల వృద్ధితో ఎన్నో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, ప్రజల జీవితాల ఉన్నతికి తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘‘స్టార్టప్‌లకు నిధులు అందించేందుకు రూ.1,000 కోట్లతో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాము. ఇది నూతన స్టార్టప్‌ల ఏర్పాటుకు, వాటి వృద్ధికి సాయపడుతుంది’’ అని మోదీ ప్రకటించారు. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాన్ని స్టార్టప్‌లకు మూలధన నిధులు అందించేందుకు వినియోగించనున్నట్టు చెప్పారు. ఇకపై స్టార్టప్‌ల రుణ సమీకరణకూ మద్దతు ఉంటుందని ప్రకటించారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ (సదుపాయాలు)గా ఉందని తెలియజేస్తూ.. వినూత్నమైన టెక్నాలజీలు, ఆలోచనల తో వచ్చి, పెద్ద సంస్థలుగా అవతరించేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు. -
‘లాట్’ 127వ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్ మొబైల్స్ రిటైల్ విక్రయ సంస్థ లాట్ తన 127వ స్టోర్‌ను విజయవాడలో ప్రారంభించింది. ఏలూరురోడ్డులోని సూర్యారావుపేటలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను ప్రముఖ నటి పూజా హెగ్డే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఐదో వార్షికోత్సవం సందర్భంగా మొబైల్స్ కొనుగోళ్లపై కస్టమర్లు రూ.5 కోట్ల విలువైన బహుమతులను లక్కీ డ్రాలో గెలుపొందే అవకాశం ఉందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, నూతన స్టోర్ ప్రారంభించిన సందర్భంగా ఎంపిక చేసిన మోడల్ మొబైల్స్‌పై ఉచిత బహుమతులను కూడా అందిస్తున్నట్టు పేర్కొంది. -
షియోమీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్
12 గంటల్లో...21 లక్షల ఫోన్ల అమ్మకాలు బీజింగ్: తన వెబ్సైట్ మీడాట్కామ్ ద్వారా 12 గంటల్లో 21 లక్షల ఫోన్లను విక్రయించింది చైనా స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ. కంపెనీ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్లాష్ సెల్స్‌లో ఈ రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయి. ఇవి గతేడాది నవంబర్‌లో ఒక రోజులో అలీబాబా విక్రయించిన 18 లక్షల ఫోన్లతో పోలిస్తే అధికం. ఈ ఫ్లాష్ సెల్స్‌లో స్మార్ట్ఫోన్లు, ఇతర వస్తువుల అమ్మకాల ద్వారా షియోమీకి దాదాపు 335 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. గతేడాది షియోమీ దాదాపు 6 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించి, 74.3 బిలియన్ యువాన్ల ఆదాయం పొందింది. దీంతో షియోమీ ప్రపంచ మూడో అతిపెద్ద స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీగా ఆవిర్భవించింది. A